హైదరాబాద్: పీటర్ హెయిన్స్.. ఈ పేరు దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. ఒకప్పుడు కొరియోగ్రాఫర్లు, సంగీత దర్శకులు, నేపథ్య గాయకులకు మాత్రమే ప్రేక్షకులకు బాగా గుర్తుండేవారు. ఫైట్స్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన పీటర్‌హెయిన్స్ ప్రేక్షకులకు సుపరిచి తుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బంజారాహిల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి గురువారం ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున నుంచి ఈతరం హీరోలు అల్లు అర్జున్, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ దాకా 120 సినిమాలకు స్టంట్ మాస్టర్‌గా పని చేశానని చెప్పారు. తల్లి మేరి వియత్నాం దేశస్తురాలు కాగా, తండ్రి పెరుమాల్ చెన్నైకి చెందినవారని తెలిపారు.
తాను హైదరాబాద్‌లోనే ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉంటున్నానని చెప్పారు. తెలుగు నేర్చుకుంటున్నట్లు, ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తున్నట్లు చెప్పారు.
'మా అమ్మది వియత్నాం, నాన్నది చెన్నై'
Published Fri, Feb 26 2016 1:02 PM | Last Updated on Tue, Oct 2 2018 6:48 PM
Advertisement