హీరో రజనీకాంత్ టీమ్‌లోకి ఒక్కొక్కరుగా యాడ్ అవుతున్నారు. తాజాగా రజనీ టీమ్‌లోకి యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ జట్టులో చేరారట. ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ డార్జిలింగ్‌లో మొదలైంది.
ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పీటర్ హెయిన్‌ను ఓకే చేశారని కోలీవుడ్ సమాచారం. ఇదివరకు రజనీ నటించిన ‘శివాజీ, యందిరిన్, కొచ్చాడియన్’ సినిమాలకు యాక్షన్ స్టంట్స్‌ను కొరియోగ్రఫీ చేసింది పీటరే. విజయ్‌సేతుపతి, బాబీ సింహా తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలన్నది చిత్రబృందం ఆలోచనట.
నాలుగోసారి...
Published Thu, Jun 21 2018 12:49 AM | Last Updated on Thu, Jun 21 2018 12:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment