అమ్మడూ... లెట్స్‌ డూ కుమ్ముడు! | Hansika along with Prabhu Deva in the Tamil Action Comedy movie of Gulabakawali | Sakshi
Sakshi News home page

అమ్మడూ... లెట్స్‌ డూ కుమ్ముడు!

Published Wed, Aug 23 2017 11:55 PM | Last Updated on Sun, Sep 17 2017 5:53 PM

అమ్మడూ...  లెట్స్‌ డూ  కుమ్ముడు!

అమ్మడూ... లెట్స్‌ డూ కుమ్ముడు!

అమ్మడు’ అంటే కాజల్‌ అగర్వాల్‌ కాదు. ‘లెట్స్‌ డూ కుమ్ముడు’ అంటే స్టెప్పులేయడం కాదు, ఈ మాట అంటున్నది చిరంజీవి అంతకన్నా కాదు. ఇక్కడ అమ్ముడు ఎవరంటే... హన్సిక. ‘లెట్స్‌ డూ కుమ్ముడు’ అంటోన్నది ఎవరంటే... యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ పీటర్‌ హెయిన్‌. ఈయన గురించి తెలుసుగా. మాంచి స్టంట్‌సీక్వెన్సులు కొరియోగ్రఫీ చేస్తారు. సో, కుమ్ముడు అంటే కన్ఫర్మ్‌గా కొట్టడమనే! రౌడీలను చితకొట్టేయమని హన్సికతో అంటున్నారు.

ఇదంతా సినిమా కోసమే సుమా! ‘గులేబకావలి’ అనే తమిళ యాక్షన్‌ కామెడీ సిన్మాలో ప్రభుదేవాకు జోడీగా హన్సిక నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌ క్యారెక్టర్‌ పాటలకు, హీరోతో రెండుమూడు సన్నివేశాలకు పరిమితమయ్యేది కాదు. హీరోయిన్‌తో ఫైట్లు కూడా చేయిస్తున్నారు. ఏయే సందర్భాల్లో హీరోయిన్‌ ఫైట్‌ చేస్తుందనేది సస్పెన్స్‌. ప్రస్తుతం చెన్నైలో హన్సిక, ఇతర ముఖ్య తారలపై కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న బిల్డింగులో ఫైట్‌ సీన్స్‌ తీస్తున్నారు. అదండీ సంగతి!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement