అదిరేటి సెట్టులో... అదిరేటి స్టెప్పులు! | Prabhu Deva and Hansika pairs in the movie 'Gulibakavali' | Sakshi
Sakshi News home page

అదిరేటి సెట్టులో... అదిరేటి స్టెప్పులు!

Published Mon, Jul 3 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

అదిరేటి సెట్టులో... అదిరేటి స్టెప్పులు!

అదిరేటి సెట్టులో... అదిరేటి స్టెప్పులు!

అక్షరాలా రెండు కోట్ల రూపాయలు... ఓ చిన్న సినిమా బడ్జెట్‌ కాదు ఇది. ఓ పెద్ద సినిమాలో లాంగ్‌ షెడ్యూల్‌ షూట్‌ సెట్‌ కోసం కేటాయించిన అమౌంట్‌ అసలే కాదు. జస్ట్‌... ఒక సాంగ్‌ షూట్‌ చేయడం కోసం పెట్టిన ఖర్చు.

తమిళ చిత్రం ‘గులేబకావళి’ కోసం ఇటీవల ఈ పాట చిత్రీకరించారు. ప్రభుదేవా, హన్సిక జంటగా కల్యాణ్‌ డైరెక్షన్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. పాట కోసం రెండు కోట్ల రూపాయలతో ఆర్ట్‌ డైరెక్టర్‌ కదిర్‌ అదిరిపోయే సెట్‌ వేశారట. వివేక్‌ మెర్విన్‌ స్వరపరచిన ఈ పాటలో ప్రభుదేవా, హన్సిక వేసిన అదిరిపోయే స్టెప్పులు మాస్‌ని హుషారెక్కించే విధంగా ఉంటాయట. సెట్, స్టెప్స్‌ ఐ–ఫీస్ట్‌ అని కోలీవుడ్‌ టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement