
Kanal Kannan Arrest: తెలుగు, తమిళంలో పలు సినిమాలకు ఫైట్ మాస్టర్‌గా పనిచేసిన కనల్ కన్నన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్ కోయిల్‌కి చెందిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఈయన్ని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కొన్నిరోజుల ముందు ఓ వీడియో పోస్ట్ చేసిన ఈయన.. ఓ మతం వాళ్ల మనోభావాలు దెబ్బతీశాడు. ఈ కారణంగానే ఇప్పుడు జైల‍్లో ఉన్నాడు.
(ఇదీ చదవండి: ఏంటి ‘బ్రో’.. బేరం కుదర్లేదటగా!)
సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో, అంతే నష్టం కూడా ఉంటుంది. ఫొటోలు, వీడియోలు చూడటం వరకు బాగానే ఉంటుంది కానీ వాటికి లైక్ కొట్టి, షేర్ చేసేటప‍్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇరకాటంలో పడే సందర్భాలు చాలా ఎక్కువ. కొన్నిసార్లు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ కూడా ఇలానే ఓ యువతితో పాస్టర్ డ్యాన్స్ చేస్తున్న వీడియోని గత నెల 18వ తేదీన తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
ఈ వీడియో వేరే దేశానికి సంబంధించినది అయినప్పటికీ, దాన్ని కనల్ కన్నన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఇది సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో సోమవారం ఈయన్ని అదుపులోకి తీసుకున్నారు. కనల్ కన్నన్‌కి ఇలా అరెస్ట్ కావడం కొత్తేం కాదు. గతంలోనూ సోషల్ యాక్టివిస్ట్ పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుపాలయ్యాడు.
(ఇదీ చదవండి: ఈ నటిని గుర్తుపట్టారా? ఇంతలా మారిపోయిందేంటి!)
Comments
Please login to add a commentAdd a comment