క్షమాపణలు చెప్పిన హీరో నాగార్జున.. ఏమైందంటే? | Nagarjuna Apologies To Person After His Bodyguard Pushes Fan: Viral Video | Sakshi
Sakshi News home page

Nagarjuna: బాడీగార్డ్ అత్యుత్సాహం.. సారీ చెప్పిన నాగార్జున

Published Mon, Jun 24 2024 7:13 AM | Last Updated on Mon, Jun 24 2024 9:02 AM

Nagarjuna Apologies To Person His Body Guard Viral Video

కింగ్ నాగార్జున ఓ వ్యక్తికి క్షమాపణ చెప్పాడు. తన బాడీగార్డ్ అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే ఇదంతా జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? నాగ్ ఎందుకు సారీ చెప్పాడు?

(ఇదీ చదవండి: తెలంగాణలో 'కల్కి' టికెట్ ధరలు పెంపు.. ఒక్కొక్కటి ఏకంగా?)

నాగార్జున స్క్రీన్‌పై కనిపించి చాలా కాలమైపోయింది. సంక్రాంతికి ఓ సినిమాతో వచ్చాడు. ప్రస్తుతం 'కుబేర' అనే మూవీ చేస్తున్నాడు. దీని షూటింగ్ సాగుతోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ షెడ్యుల్ కోసం నాగార్జునతో పాటు ధనుష్ కూడా వచ్చారు. అయితే ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు హీరోలు నడుచుకుని వస్తుండగా, అక్కడే షాపులో పనిచేస్తున్న ఓ వ్యక్తి సెల్ఫీ కోసమని నాగ్ దగ్గరకు వచ్చాడు.

కానీ నాగ్ సెక్యురిటీ గార్డ్ మాత్రం పెద్దాయన అని కూడా చూడకుండా గట్టిగా తోసేశాడు. దీంతో కిందపడబోయిన ఆ పెద్దాయన తమాయించుకుని నిలబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలా నాగ్ దృష్టికి కూడా వెళ్లింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ (ఎక్స్)లో నాగ్ క్షమాపణలు చెప్పాడు. మరోసారి ఇలా జరగకుండా చూస్తానని రాసుకొచ్చాడు.

(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ డీటైల్స్.. అప్పటివరకు వెయిటింగ్ తప్పదా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement