Stunt Master
-
టారస్ వరల్డ్ స్టంట్ అవార్డుకు నామినేట్.. షారుక్ మెచ్చుకున్నారు!
భారతీయ సినిమాలో స్టంట్ మాస్టర్‌గా అనల్ అరసుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తమిళనాడుకు చెందిన ఈయన తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో స్టార్ హీరో చిత్రాలకు పని చేస్తూ ప్రముఖ స్టంట్ మాస్టర్‌గా రాణిస్తున్నారు. ఇటీవల షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌హిట్ మూవీ జవాన్‌కు అనల్ అరసు స్టంట్ కొరియోగ్రఫీ చేశారు. త్వరలో తెరపైకి రానున్న ఇండియన్–2 చిత్రానికీ ఈయన ఫైట్స్ కంపోజ్ చేశారు. 'టారస్ వరల్డ్ స్టంట్ అవార్డు'ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న వా వాద్ధియారే, హిందీలో బేబీజాన్, వార్ 2 తదితర చిత్రాలకు స్టంట్ మాస్టర్‌గా పని చేస్తున్నారు. అంతే కాకుండా ఇప్పుడు దర్శకుడిగానూ అవతారమెత్తారు. ఈయన స్వీయ దర్శకత్వంలో హీరో విజయ్‌సేతుపతి వారసుడు సూర్యను హీరోగా పరిచయం చేస్తూ ఫీనిక్స్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇకపోతే అనల్ అరసు 'టారస్ వరల్డ్ స్టంట్ అవార్డు' పోటీల్లో నామినేట్ అయ్యారు. జవాన్ చిత్రానికి గానూ నామినేట్ దీని గురించి ఆయన సోమవారం చైన్నెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుపుతూ టారస్ వరల్డ్ స్టంట్ అవార్డుల్లో.. జవాన్ చిత్రానికి గానూ తన పేరు నామినేట్ అయ్యిందని చెప్పారు. ఇది ఆస్కార్ అవార్డుకు సమానమైనదిగా పేర్కొన్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా స్టంట్ కొరియోగ్రఫీ కేటగిరికి సంబంధించిన పురస్కారం అని చెప్పారు. ప్రపంచ స్థాయి చిత్రాలలో జవాన్ మూవీతో పాటు హాలీవుడ్ చిత్రం మిషన్ ఇంపాజబుల్, జాన్ విక్స్ 4 మొదలగు ఐదు చిత్రాలు నామినేట్ అయ్యినట్లు చెప్పారు. అవార్డు వస్తే సంతోషంఈ నెల 11న లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఈ అవార్డు వేడుక కోసం అమెరికాకు పయనమవుతున్నట్లు తెలిపారు. తాను ఇంతకు ముందు 2017లో కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యానని, అయితే అది ప్రాంతీయ చిత్రాల కేటగిరి కావడంతో పెద్దగా ప్రచారం జరగలేదన్నారు. ఇప్పుడు వరల్డ్ స్థాయి చిత్రాల కేటగిరీలో జరుగుతున్న పోటీలో ఇంత వరకూ భారతీయ సినిమాకు చెందిన ఏ స్టంట్ మాస్టర్ ఈ అవార్డును గెలుచుకోలేదన్నారు. అలాంటి తనకు అవార్డు వస్తే సంతోషం అని అనల్ అరసు పేర్కొన్నారు. ఈ అవార్డుకు నామినేట్ అవడంతో షారుక్ ఖాన్, వరుణ్ ధావన్, షాహిద్ కపూర్, దర్శకుడు అట్లీ వంటి పలువురు అభినందించారని చెప్పారు. -
గగుర్పాటు కలిగించే ఘటన.. ఎత్తైన భవనంపై సాహసం.. అంతలోనే పట్టుతప్పి..
హాంగ్‌కాంగ్: డేర్‌డెవిల్ గా పేరొందిన 30 ఏళ్ల రెమీ లుసిడి ఎత్తైన భవనం అంచున నిలబడి వీడియో తీసుకునే సాహసం చేస్తుండగా పట్టుతప్పి జారిపోయాడు. 68వ అంతస్తు నుండి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. లుసిడి చనిపోయిన స్పాట్ నుండి కెమెరాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటన హంగ్ కాంగ్ లోని ట్రెజుంటర్ టవర్ దగ్గర జరిగింది. రెమీ లుసిడి ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలు చేసే ఓ బ్లాగర్. అతను చేసే సాహసాలంన్నిటినీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో హాంగ్‌కాంగ్‌లోని ట్రెగుంటర్ టవర్ కాంప్లెక్స్ భవనంపైకి ఎక్కి వీడియో తీసుకోవాలని సంకల్పించాడు. అనుకుంది తడవు ఆ కాంప్లెక్స్ కి వెళ్లి 40వ అంతస్తులో తన ఫ్రెండుని కలవడానికి వెళ్తున్నానని చెప్పి సెక్యూరిటీ కళ్ళుగప్పి బిల్డింగ్‌లోకి ప్రవేశించాడు. BREAKING NEWS: Tragic Death of Fearless Instagram Daredevil in Hong Kong High-Rise IncidentIn a heartbreaking incident that shocked the world of extreme sports, Remi Lucidi, a 30-year-old French daredevil renowned for his high-rise stunts, lost his life after falling from the… pic.twitter.com/9jYKnrgVVt— URECOMM (@URECOMM) July 30, 2023 తీరా అతను చెప్పింది వాస్తవం కాదని సెక్యూరిటీ వారికి తెలిసే సమయానికే లుసిడి సీసీటీవీ ఫుటేజిలో 49వ అంతస్తులో బిల్డింగ్‌పైకి వెళ్లే మెట్లు ఎక్కుతూ కనిపించాడు. చివరిగా అతను 7.38 నిముషాలకు పెంట్ హౌస్ బయట కిటికీ తలుపు తడుతూ తాను ప్రమాదంలో ఉన్నట్లు చెప్పబోయాడని అందులో పని చేసే ఒకామె తెలిపింది. అంత ఎత్తు నుండి పడిపోవడంతో లుసిడి అక్కడికక్కడే చనిపోయాడని పోలీసులు తెలిపారు. స్పాట్లో లుసిడి కెమెరాను కనుగొన్న పోలీసులు అందులో కళ్లుచెదిరే సాహసాలకు సంబంధించిన అతడి వీడియోలు ఉన్నట్లు.. బలహీనమైన గుండె కలవారు వాటిని చూడలేరని తెలిపారు. లుసిడి మరణానికి గల కారణం ఏంటనేది మాత్రం వారు చెప్పలేదు. గతంలో లుసిడి చాలా సాహస కృత్యాలు చేశాడు. పారిస్ లోని ఈఫిల్ టవర్ తో పాటు దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పైకి ఒట్టి చేతులతో ఎక్కి ఫోటోలు తీసుకున్నాడు. చివరిసారిగా హంగ్ కాంగ్ లో లుసిడి తీసుకున్న ఫోటోను కింది ట్వీట్ లో చూడవచ్చు. #STUPIDITY gets you #KILLED #Daredevil #Remi #lucidi , 30, known for Instagram #stunts dies after falling 721ft from the top of a 68-story #Hong #Kong #skyscraper - having posted final photo from another high-rise pic.twitter.com/ooMDorcFdB— NEWS-ONE 🏴 (@NEWSONE14898745) July 31, 2023 ఇది కూడా చదవండి: పాలస్తీనా శరణార్ధుల శిబిరంలో అల్లర్లు.. ఐదుగురు మృతి -
ఇదేం విచిత్రమైన పోటీ.. గిన్నిస్ రికార్డు కూడానా?
ఫ్రాన్స్: ఒక విచిత్రమైన పోటీలో పాల్గొని ప్రపంచ రికార్డు బద్దలుకొట్టాడు ఫ్రాన్స్ కు చెందిన జోనాథన్ వెరో అనే స్టంట్ మ్యాన్. ఆక్సిజన్ తీసుకునే అవకాశం లేకుండా ఒంటికి నిప్పంటించుకుని 100 మీటర్ల పరుగు పందాన్ని 17 సెకండ్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డుతో పాటు గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఫ్రాన్స్ కు చెందిన జోనాథన్ వెరో అనే 39 ఏళ్ల స్టంట్ మాస్టర్ కు చిన్నప్పటి నుండి స్టంట్స్ అంటే చాలా ఇష్టమట. అందులోనూ నిప్పుతో చెలగాటమాడటం అంటే అతడికి మహా సరదా. నిప్పును నోట్లో వేసుకుని విన్యాసాలు చేయడం వంటి ఎన్నో సాహసాలు చేయడం అతడికి అలవాటు. అందులో భాగంగానే ఒళ్ళంతా నిప్పు అంటించుకుని కాలుతూ పరిగెత్తడంలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మంటల్లో మండుతూ 272.25 మీటర్లు పరిగెత్తి కాలుతూ ఆక్సిజన్ తీసుకోకుండా ఎక్కువ దూరం పరిగెత్తిన రికార్డుతో పాటు 17 సెకండ్లలో 100 మీటర్లు పూర్తి చేసి పాత రికార్డును చెరిపేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. కేవలం ప్రపంచ రికార్డు మాత్రమే కాదు ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు జోనథన్. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ స్వయంగా గిన్నిస్ బుక్ ప్రతినిధులే వీడియోతో సహా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఈ వీడియోకు మిలియన్లలో వీక్షణలు దక్కాయి. నెటిజన్లు ఈ వీడియోకు ఇలాంటి చెత్త రికార్డులు కూడా ఉంటాయా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. New record: The fastest full body burn 100 m sprint without oxygen - 17 seconds by Jonathan Vero (France) Jonathan also set the record for the farthest distance ran in full body burn during this attempt at 272.25 metres! 🔥 pic.twitter.com/J0QJsPNkPf — Guinness World Records (@GWR) June 29, 2023 ఇది కూడా చదవండి: ఎస్కలేటర్ లో చిక్కుకున్న మహిళ కాలు.. ఏం చేశారంటే..? -
షూటింగ్లో ప్రమాదం.. పైనుంచి కిందపడి ఫైట్ మాస్టర్ మృతి
సినీమా షూటింగ్లో అపశృతి చోటుచేసుకుంది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తూ స్టంట్ మాస్టర్ మరణించాడు. వివరాల ప్రకారం.. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్, హీరో సూరి కాంబినేషన్లో 'విడుదలై' అనే తమిళ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుంది.ఇందులో భాగంగా భారీ క్రేన్‌కు తాళ్లు బిగించి యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ సురేష్‌కు కట్టిన తాడు తెగిపోయింది. సుమారు 20 అడుగుల పైనుంచి కింద పడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన మూవీ టీం ఆతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే సురేష్ ప్రాణాలు కోల్పోయాడు. సురేష్ మృతితో తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అతని మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. -
ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ అరెస్ట్
సినీ ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ను చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం పుదుచ్చేరిలో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే గత నెల 31వ తేదీ స్థానిక మదురవాయిల్‌లో హిందూ మున్నని సమాఖ్య హిందువుల పరిరక్షణ కోసం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో కణల్ కన్నన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరంగం ఆలయం ఎదురుగా, దేవుడిపై నమ్మకం లేని పెరియార్ విగ్రహాన్ని బద్దలు కొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. దీంతో తందై పెరియార్ ద్రవిడ కావడం చెన్నై జిల్లా కార్యదర్శి కుమరన్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కణల్ వ్యాఖ్యల వీడియో ఆధారాలను పొందుపరిచారు. వీడియో ఆధారాలను పరిశీలించిన చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కణల్ కన్నన్ పరారయ్యారు. 13 రోజుల తర్వాత పుదుచ్చేరిలో తలదాచుకుంటున్న సమాచారం అందడంతో చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడ వెళ్లి సోమవారం కణల్ కన్నన్ను అరెస్ట్ చేసి చెన్నై తీసుకొచ్చారు. చదవండి: (సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న నటి స్నేహ ఫ్యామిలీ ఫోటోలు) -
‘అఖండ’ ఫైట్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘తెలుగు ప్రేక్షకులు యాక్షన్ సన్నివేశాలను బాగా ఇష్టపడతారు. తమిళంలో కాస్త తక్కువ. కానీ రజనీకాంత్, విజయ్ వంటి హీరోలకు మాత్రం వారి అభిమానులు భారీ యాక్షన్ సీక్వెన్సెస్నే కోరుకుంటారు’’ అని స్టంట్ శివ అన్నారు. బాలకృష్ణ, ప్రగ్యాజైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అఖండ’. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న విడుదలైంది. ఈ చిత్రానికి పనిచేసిన ఫైట్ మాస్టర్, యాక్టర్ శివ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మెకానిక్‌గా ఉన్న నేను సినిమాలపై ఆసక్తితో ఫైట్ మాస్టర్‌గా మారాను. బాలకృష్ణగారి ‘లక్ష్మీనరసింహా, విజయేంద్ర వర్మ, సింహా’ చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేశాను. ఇప్పుడు ‘అఖండ’ కు వర్క్ చేయడం సంతోషంగా ఉంది. బాలకృష్ణగారి ‘అఘోరా’ పాత్రకు ఫైట్స్ కంపోజ్ చేశాం. ఫైట్స్ మాస్టర్స్‌లా కాకుండా బాలకృష్ణగారి అభిమానుల్లా ఫైట్స్ కంపోజ్ చేశాం. ఈ సినిమాకి దాదాపు 65 రోజులు ఫైట్స్ తీయగా, మరో 15 రోజులు యాక్షన్ సీన్స్‌లోని మిగతా వర్క్, ఎలివేషన్ షాట్స్ తీశాం. క్లైమాక్స్ ఫైట్ కంపోజింగ్ కాస్త కష్టంగా అనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్‌ను బాలకృష్ణగారు సూపర్‌హీరోలా చేశారు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో బోయపాటిగారు ఓ ఫైట్మాస్టర్లానే ఆలోచిస్తారు. నిర్మాత రవీందర్‌రెడ్డిగారు బాగా హెల్ప్ చేశారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం కూడా ఫైట్స్‌కి ప్లస్ అయ్యాయి. (అన్‌స్టాపబుల్ షోలో సూపర్ స్టార్ సందడి.. ఫొటోలు వైరల్) ‘క్రాక్’ తర్వాత యాక్టర్‌గా నాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ‘ఎఫ్ 3’ చిత్రంలో నేనే మెయిన్ విలన్. ఫైట్ మాస్టర్‌గా ‘రామారావు: ఆన్ డ్యూటీ’, ‘ధమాకా’ తో పాటు మరికొన్ని సినిమాలు ఉన్నాయి. పీటర్ హెయిన్స్ సోదిరిని వివాహం చేసుకున్నాను. నా కుమారులు కెవిన్, స్టీవెన్ కూడా ఫైట్ మాస్టర్స్‌గా చేస్తున్నారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిన్, స్టీవెన్ పాల్గొన్నారు. (‘అఖండ’ లోని గిత్తలు ఎవరివో, వాటి ప్రత్యేకత ఏంటో తెలుసా?) -
సాహస ప్రదర్శనలో ప్రాణం పోయింది
-
వీడియో : సాహస విన్యాసం.. ప్రాణం పోయింది
కౌల లంపూర్ : మలేషియాలో దారుణం చోటు చేసుకుంది. ప్రజలందరి సమక్షంలో లైవ్ ప్రదర్శన ఇస్తుండగా.. ఓ స్టంట్ మాస్టర్ ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఈ వార్తను స్థానిక మీడియా ప్రసారం చేసింది. 68 ఏళ్ల లిమ్ బా ‘హ్యుమన్ స్టీమింగ్’ పేరిట గత కొన్నేళ్లుగా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. కింద మంటపెట్టి దానిపై చెక్క లాంటి ఓ వస్తువును పరిచి దాని మీద లిమ్ కూర్చుంటారు. అతనిపై ఆవిరి యంత్రాన్ని బోర్లించి.. కాసేపు అలా ఉంచుతారు. ప్రదర్శన జరిగే 30 నిమిషాలపాటు ఆయన కదలకుండా అలానే ఉంటారు. అంతేకాదు ఆ ఆవిరి యంత్రంపై రోట్టెలు, మొక్కజొన్న పొత్తులు కూడా కాలుస్తుంటారు. పదేళ్లుగా ఆయన ప్రదర్శనలు ఇస్తూనే వస్తున్నారు. తాజాగా కేదా రాష్ట్రంలో తావోయిస్ట్ ఉత్సవాల సందర్భంగా సోమవారం అక్కడి చైనీస్ దేవాలయం వద్ద ఆయన ప్రదర్శన ఇచ్చారు. అయితే యంత్రం బొర్లించిన కాసేపటికే లోపలి నుంచి కేకలు వినిపించసాగాయి. వెంటనే అప్రమత్తమైన ఆయన సహాయకులు.. యంత్రాన్ని తీసి ఆయన్ని పక్కకు తీసుకెళ్లారు. అప్పటికే ఆయన చలనం లేకుండా పడి ఉన్నారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే కాలిన గాయాలతోకాకుండా ఆయన గుండెపోటుతోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ఆయనకు ఇదే చివరి ప్రదర్శన అవుతుందని ఊహించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గతేడాదే ఆయనకు గుండె ఆపరేషన్ అయ్యిందని.. తాము ఎంతో వారించినా మాట వినలేదని లిమ్ కొడుకు కంగ్ హువాయ్ చెబుతున్నారు. -
సీనియర్ స్టంట్ మాస్టర్ సాంబశివరావు మృతి!
ఎన్టీఆర్ ‘సర్దార్ పాపారాయుడు’, చిరంజీవి ‘కొండవీటి దొంగ’ చిత్రాలతో పాటు సుమారు 600 చిత్రాలకు స్టంట్ మాస్టర్‌గా పనిచేసిన సాంబశివరావు (89) హైదరాబాద్‌లోని స్వగృహంలో గురువారం తుది శ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించారాయన. ఎక్కువగా ఎన్టీఆర్ చిత్రాలకు పని చేసిన సాంబశివరావు.. ‘ప్రతిఘటన’, ‘నేటి భారతం’, ‘శ్రీరంగనీతులు’ తదితర చిత్రాలకు స్టంట్ మాస్టర్‌గా వ్యవహరించారు. -
చిన్నప్పుడు చూసి... ఇప్పుడు చేశాడు!
దీపావళి రోజున మీరెప్పుడైనా రాకెట్ టపాసు కాల్చారా? నిప్పంటించిన వెంటనే అది గాల్లోకి రయ్యిమని దూసుకెళుతూంటే ముచ్చటేస్తుంది. మరి... రాకెట్ సైజు.. మోటార్సైకిలంత ఉంటే...? దానిపై ఓ మనిషి కూర్చుని ఉంటే... అతడే ఇంజిన్‌ను ఆన్ చేస్తే ఎలా ఉంటుంది? మీకు తెలియకపోతే ఎడ్డీ బ్రాన్ను అడగండి. ఆయనెవరు అంటారా? పక్కన ఫొటోలో కనిపిస్తున్న వాహనాన్ని నడిపించింది ఆయనే మరి! దీంతోనే ఆయన అమెరికాలోని ఇడాహో ప్రాంతంలో ఉన్న రివర్ క్యానన్ (అగాధం) ను దాటేశాడు. ఈ అగాధం వెడల్పు ఎంతో తెలుసా? సింపుల్‌గా... 4000 అడుగులు మాత్రమే! హాలీవుడ్ సినిమాల్లో స్టంట్ కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న ఎడ్డీ తన చిన్నప్పటి కలను సాకారం చేసుకునేందుకు ఈ రికార్డు స్టంట్ చేశాడట. 1974లో ఎవెల్ క్నీవెల్ అనే స్టంట్ మాస్టర్ ఇదే అగాధాన్ని దాటేందుకు విఫలయత్నం చేశాడు. చిన్న పిల్లాడిగా ఆ స్టంట్‌ను చూసిన ఎడ్డీ తాను ఆ రికార్డును సాధించాలని నిర్ణయించుకున్నాడు. ఆస్ట్రేలియా స్టంట్ కో-ఆర్డినేటర్ రిక్ మోరిసన్తోపాటు కొంతమంది రాకెట్ ఇంజనీర్ల సాయంతో నీటి ఆవిరితో పనిచేసే మోటార్‌సైకిల్‌ను సిద్ధం చేసుకున్నాడు. చివరకు ఈ ఏడాది సెప్టెంబర్ 16న ‘ఎవెల్ స్పిరిట్’ పేరుతో సిద్ధం చేసిన స్టీమ్ రాకెట్ మోటార్‌సైకిల్‌తో విజయం సాధించాడు. ఇంజిన్ ఆన్ చేయగానే.. కేవలం కొన్ని సెకన్ల కాలంలోనే దాదాపు గంటకు 693 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్న ఎడ్డీ 2200 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి రెండు పారాచూట్ల సాయంతో అగాధం ఆ చివరకు చేరుకున్నాడు. గిన్నిస్ రికార్డులకు ఎక్కాడు -
సాహసం సేయకురా డింభకా!
బ్రిటన్‌లోని యార్క్‌షైర్‌కు చెందిన ఆంటోని బ్రిట్టన్ (38) ఓ స్టంట్ మాస్టర్. చిన్నప్పటి నుంచే సాహసాలు చేయడమంటే ఇష్టం. కాళ్లు చేతులు కట్టివేయించుకొని నదిలోకి దూకడం, తల్లకిందులుగా మండే తాడుకు వేలాడుతూ అది కాలి తెగేలోపే సురక్షితంగా భూమికి దిగడం, బోనులో బంధించుకొని దాన్ని సముద్రంలో ముంచడం... ఇలాంటి ఫీట్లు చేస్తుంటాడు. వృత్తిరీత్యా వెల్డర్ అయినప్పటికీ సమయం చిక్కినప్పుడల్లా సాహసాలు చేస్తుంటాడు. కిందటి శనివారం ఇలాగే మనోడు ఓ సాహసం తలపెట్టాడు. ఆరడుగుల లోతు గొయ్యి తవ్వించుకొని దాంట్లో ‘సజీవ సమాధి’ అవ్వాలనుకున్నాడు. మీరు చదివింది నిజమే. ఎందుకంటే తృటిలో చావు తప్పి కన్నులొట్ట బోయింది. జనం చూస్తుండగా ఆంటోని బ్రిట్టన్ను గొయ్యిలో పడుకోబెట్టి మట్టి కప్పేశారు. చేతులతోనే మట్టి తొలగించుకొని... ఊపిరి ఆగేలోగా బయటపడాలి. బాగానే ప్రాక్టీసు చేసినా... ఈసారి పాపం బయటపడలేకపోయాడు. నిమిషం... రెండు నిమిషాలు... మూడు నిమిషాలు సమాధిలో ఎలాంటి కదలిక లేదు. అనుమానం వచ్చిన సహాయ సిబ్బంది రంగంలోకి దిగి... గబగబా సమాధిని తవ్వేశారు. లోపల చూస్తే అచేతనంగా ఆంటోని. నోరు, ముక్కు నిండా మట్టి. అంబులెన్స్ రెడీగా ఉంది కాబట్టి పారామెడిక్స్ ఆగిన అతని గుండె మళ్లీ పనిచేసేలా చేయగలిగారు. అలా మృత్యుముఖం దాకా వెళ్లొచ్చిన ఇతన్ని మరోసారి ‘సాహసం సేయకురా డింభకా’ అనాలేమో.