2003లో సీనియర్ బుష్‌తో రోస్లిన్ కార్రిగన్ (ఎడమ)
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్ తనను అసభ్యంగా తాకి వేధించారని రోస్లిన్ కార్రిగన్ అనే 30 ఏళ్ల మహిళ ఆరోపించారు. తాను టీనేజ్‌లో ఉండగా మాజీ అధ్యక్షుడు సీనియర్ బుష్‌ను కలిసేందుకు చాన్స్ రాగా ఆయనను కలిసిన సందర్భంలో తనకు ఈ చేదు అనుభవం ఎదురైందని ఆమె పేర్కొన్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ' అది 2003 సంవత్సరం. అప్పుడు నాకు 16 ఏళ్లు. టెక్సాస్ లో ఓ ఈవెంట్‌కు బుష్ రాగా, రాజకీయాలపై ఎంతో ఆసక్తి ఉన్న నేను అమ్మానాన్నలతో కలిసి అక్కడికి వెళ్లాను.
అమ్మతో కలిసి అమెరికా 41వ అధ్యక్షుడు సీనియర్ బుష్‌ను కలిశాను. రాజకీయాల్లోకి రావాలని ఉందని మాజీ అధ్యక్షుడికి చెప్పి ఎంతో సంతోషించాను. అయితే ఆ సంతోషం క్షణాల్లో ఆవిరైంది. ఆయనతో కలిసి ఫొటోలు దిగుతుండగా.. నన్ను వెనుకవైపు నుంచి అసభ్యంగా తాకి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు బుష్. ఏం జరుగుతుందో అర్థంకాక ఎంతో భయపడ్డాను. అమ్మ సారీ యంగ్ పక్కన ఉండగానే బుష్ చేతులు ఎక్కడెక్కడో నన్ను తడిమాయి. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. కేవలం సామాన్య మైనర్ బాలికనైన నేను మాజీ అధ్యక్షుడికి 'అలాంటి పనులు చేయకూడదు. అమ్మాయిలు, మహిళలతో అలా అసభ్యంగా ప్రవర్తించకూడదని' ఎలా చెప్పగలను. ఇటీవల ఫొటోతో పాటు ఆ చేదు అనుభవాన్ని బహిర్గతం చేశానని' బాధితురాలు రోస్లిన్ కార్రిగన్ వివరించారు.
సీనియర్ బుష్ అధికారిక ప్రతినిథి జిమ్ మెక్ గ్రాత్ ఈ ఆరోపణలపై స్పందించారు. బుష్ చాలా మంచి వ్యక్తి. ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించే మనిషి కాదు. వీల్ చైర్‌లో ఉన్న వ్యక్తి కనుక.. కొన్నిసార్లు ఆసరా కోసం పక్కనున్న వారిని పట్టుకుని ఉంటారు. తప్పుగా అర్థం చేసుకోకూడదంటూ మెక్‌గ్రాత్ వివరణ ఇచ్చారు. అయితే 2003లో ఫొటో దిగిన సమయంలో సీనియర్ బుష్ వీల్ చైర్‌లో కూర్చునే పరిస్థితి లేదని, గతంలో ఐదుగురు మహిళలు సీనియర్ బుష్ తమతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment