george h.w. bush seniour
-
బుష్ చేతులు నన్ను ఎక్కడెక్కడో తడిమాయి!
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్ తనను అసభ్యంగా తాకి వేధించారని రోస్లిన్ కార్రిగన్ అనే 30 ఏళ్ల మహిళ ఆరోపించారు. తాను టీనేజ్‌లో ఉండగా మాజీ అధ్యక్షుడు సీనియర్ బుష్‌ను కలిసేందుకు చాన్స్ రాగా ఆయనను కలిసిన సందర్భంలో తనకు ఈ చేదు అనుభవం ఎదురైందని ఆమె పేర్కొన్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ' అది 2003 సంవత్సరం. అప్పుడు నాకు 16 ఏళ్లు. టెక్సాస్ లో ఓ ఈవెంట్‌కు బుష్ రాగా, రాజకీయాలపై ఎంతో ఆసక్తి ఉన్న నేను అమ్మానాన్నలతో కలిసి అక్కడికి వెళ్లాను. అమ్మతో కలిసి అమెరికా 41వ అధ్యక్షుడు సీనియర్ బుష్‌ను కలిశాను. రాజకీయాల్లోకి రావాలని ఉందని మాజీ అధ్యక్షుడికి చెప్పి ఎంతో సంతోషించాను. అయితే ఆ సంతోషం క్షణాల్లో ఆవిరైంది. ఆయనతో కలిసి ఫొటోలు దిగుతుండగా.. నన్ను వెనుకవైపు నుంచి అసభ్యంగా తాకి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు బుష్. ఏం జరుగుతుందో అర్థంకాక ఎంతో భయపడ్డాను. అమ్మ సారీ యంగ్ పక్కన ఉండగానే బుష్ చేతులు ఎక్కడెక్కడో నన్ను తడిమాయి. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. కేవలం సామాన్య మైనర్ బాలికనైన నేను మాజీ అధ్యక్షుడికి 'అలాంటి పనులు చేయకూడదు. అమ్మాయిలు, మహిళలతో అలా అసభ్యంగా ప్రవర్తించకూడదని' ఎలా చెప్పగలను. ఇటీవల ఫొటోతో పాటు ఆ చేదు అనుభవాన్ని బహిర్గతం చేశానని' బాధితురాలు రోస్లిన్ కార్రిగన్ వివరించారు. సీనియర్ బుష్ అధికారిక ప్రతినిథి జిమ్ మెక్ గ్రాత్ ఈ ఆరోపణలపై స్పందించారు. బుష్ చాలా మంచి వ్యక్తి. ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించే మనిషి కాదు. వీల్ చైర్లో ఉన్న వ్యక్తి కనుక.. కొన్నిసార్లు ఆసరా కోసం పక్కనున్న వారిని పట్టుకుని ఉంటారు. తప్పుగా అర్థం చేసుకోకూడదంటూ మెక్‌గ్రాత్ వివరణ ఇచ్చారు. అయితే 2003లో ఫొటో దిగిన సమయంలో సీనియర్ బుష్ వీల్ చైర్లో కూర్చునే పరిస్థితి లేదని, గతంలో ఐదుగురు మహిళలు సీనియర్ బుష్ తమతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించిన విషయం తెలిసిందే. -
ఒకే వేదికపై.. ఐదుగురు మాజీలు
వాషింగ్టన్ : ఇటీవల కాలంలో అమెరికాను వణికించిన హార్వీ, ఇర్మా, మరియా తుఫాను బాధితులను ఆదుకేనుందుకు ఐదుగురు అమెరికా మాజీ అధ్యక్షులు నడుంబిగించారు. తుఫానుల కారణంగా టెక్సాస్, ఫ్లోరిడా, లూసియానా, పోర్టారికో, వర్జిన్ ఐలాండ్స్ ప్రాంతాలు పూర్తిగా నాశనం అయ్యాయి. తుపాను బాధితుల నిధుల సేకరణకు రంగంలోకి దిగిన మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ బుష్, బిల్ క్లింటన్, జార్జ్ బుష్ (సీనియర్) జిమ్మీ కార్టర్లు శనివారం టెక్సాస్‌లోని ఏఅండ్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. డెమోక్రాట్ పార్టీ నుంచి బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జిమ్మి కార్టర్లు, రిపబ్లికన్ పార్టీ నుంచి జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్, జార్జి డబ్ల్యూ బుష్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిపబ్లిన్ మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్ (93) పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూనే చక్రాల కుర్చీలోనే కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. ఈ కార్యక్రమంలో గ్రామీ అవార్డే విజేత లేడీ గాగా తన డ్యాన్స్‌తో అలరించారు. నిధుల సేకరణ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 7 నుంచి ఐదుగురు మాజీ అధ్యక్షులు చేపట్టారు. ఇప్పటివరకూ 31 మిలియన్ డాలర్ల నిధులను వీరు సమకూర్చినట్లు జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్ అధికార ప్రతినిధి జిమ్ మెక్‌గ్రాత్ తెలిపారు. తుఫాను బాధితుల కోసం నిధుల సమకూరుస్తున్న ఐదుగురు మాజీ అధ్యక్షులను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. అమెరికా అత్యున్నత ప్రజా సేవకులుగా వారిని ట్రంప్ అభివర్ణించారు. మాజీలెవరూ.. తమ ప్రసంగంలో ట్రంప్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. -
బుష్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్(సీనియర్) (92) అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో గల ఓ ఆస్పత్రిలో బుధవారం ఉదయం ఆయనను చేర్పించినట్లు అక్కడి కేహెచ్ఓయూ అనే టెలివిజన్ సంస్థ తెలిపింది. కొద్ది రోజుల తర్వాత ఆయనను ఆస్పత్రి వర్గాలు ఇంటికి పంపించే అవకాశం ఉందని జీన్ బెకర్ అనే వ్యక్తి తెలిపారు. అయితే, ఆయనను ఏ ఆస్పత్రిలో చేర్పించారనే విషయం మాత్రం బయటకు తెలియనివ్వలేదు. అలాగే, ఆయన ఆస్పత్రిలో అనూహ్యంగా చేరడానికి గల కారనాలు కూడా చెప్పలేదు. గతంలో ఓ సారి ఆయన కిందపడి ఆయన మెడలోని ఎముక విరిగిపోవడంతో తనకుమారుడు జార్జ్ బుష్ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుర్చీకే పరిమితం అయిన సీనియర్ బుష్ ఇప్పటికే తన మెడకు పట్టీని కొనసాగిస్తున్నారు.