ఏమీ తెలియని రంగంలోకి ప్రవేశించి, ఉన్నత శిఖరాలకు చేరడానికి అద్భుత దీపాలతో పనిలేదు. ఆసక్తి ఉంటే, అనుభవపాఠాలు తోడుంటే చాలు! అంతంతమాత్రం అవగాహనతో అడ్వర్‌టైజింగ్ రంగంలోకి అడుగుపెట్టిన కైనజ్ కర్మాకర్ ఆ రంగంలో ఉన్నతస్థాయికి చేరుకుంది. ఆదర్శ ఉద్యోగిగా నిలిచింది.
సైకాలజీలో పట్టా పుచ్చుకున్న కైనజ్ కర్మాకర్ (ముంబై) అడ్వర్‌టైజింగ్ రంగంలోకి అడుగు పెట్టే నాటికి ఆ రంగం గురించి పెద్దగా తెలియదు. విదేశాలలో ఉన్నత చదువులు చదవాలనే కోరిక సాకారం కాక΄ోవడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది కైనజ్. అడ్వర్‌టైజింగ్ రంగంలో కనిపిస్తున్న ఆర్ట్ డైరెక్షన్, కాపీ రైటింగ్ అనే రెండు దారుల్లో రెండో దారిని ఎంచుకుంది. దీనికి కారణం తనకు రచనలు చేయడం అంటే ఇష్టం. అయితే అడ్వర్‌టైజింగ్ కాపీ రైటింగ్ గురించి మాత్రం ఏమీ తెలియదు.
ముంబైలోని ఒక యాడ్ ఏజెన్సీలో చేరినప్పుడు, ఉద్యోగంలో చేరినట్లు కాకుండా మొదటిసారిగా బడికి వచ్చిన విద్యార్థిలా అనిపించింది.
‘అదృష్టాన్ని నమ్ముకున్నవారు దాని కోసమే నిరీక్షిస్తూ తమకు తెలియకుండానే దురదృష్టంలోకి జారుకుంటారు’ అనే మాట ఉంది.అయితే కైనజ్ అదృష్టం కంటే కష్టాన్నే నమ్ముకుంది. 2000 సంవత్సరంలో ‘లియో బర్నెట్ ఇండియా’లో చేరినప్పుడు అక్కడ అగ్నెలో డయాస్ పరిచయం అయ్యాడు. తాను ఒక గురువై అడ్వర్‌టైజింగ్‌కు సంబంధించిన సూక్ష్మనైపుణ్యాలను బోధించాడు. విలువైనపాఠాలు అవి.
‘ఓగిల్వీ ఇండియా’ కంపెనీలో అడుగు పెట్టడానికి ముందు రకరకాల కామెంట్స్ వినిపించాయి... ‘కొత్తవాళ్లు అక్కడ పనిచేయడం కష్టం’ ‘అక్కడ ఎప్పటికప్పుడు నిలదొక్కుకోవడం తప్ప ఉన్నత స్థాయికి చేరడం అనేది కలలో మాట’ అయితే ఇలాంటి కామెంట్స్‌ను పట్టించుకోకుండా తన పనిపైనే పూర్తిగా దృష్టి పెట్టింది కైనజ్.
కంపెనీ నేర్పినపాఠాలు, కాలం నేర్పినపాఠాలతో తనలోని సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకుంది. ‘ఒగిల్వీ ఇండియా’ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ స్థాయికి ఎదిగింది. ‘చెప్పే విధానం ఎంత ఆకర్షణీయంగా ఉంటే, మార్పు అనేది అంత త్వరగా మొదలవుతుంది’ అంటున్న 46 ఏళ్ల కైనజ్ తన సృజనాత్మక కృషికి దేశ, విదేశాల్లో 40కి పైగా ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్‌లు అందుకుంది.
‘క్లయింట్ సమస్యను తన వ్యక్తిగత సమస్యగా భావించి వెంటనే రంగంలోకి దిగుతుంది. అది పరిష్కారం అయ్యే వరకు కష్టపడుతుంది. తన పనేదో తాను నిశ్శబ్దంగా చేసుకుంటూ ΄ోతుంది తప్ప హడావిడి, ఆర్భాటం కనిపించవు. కైనజ్ ్రపాధాన్యతలలో పని మొదటిస్థానంలో ఉంటుంది. ఔత్సాహికులకు స్ఫూర్తిని ఇచ్చే వ్యక్తి’ అంటున్నాడు కైనజ్‌తో ఎన్నో సంవత్సరాలు కలిసి పనిచేసిన హర్షద్ రాజాధ్యక్ష. ‘ఒగిల్వీలో ఎందరో దిగ్గజాల దగ్గర ఎన్నో విలువైనపాఠాలు నేర్చుకున్నాను. అడ్వర్‌టైజింగ్‌కు సంబంధించి నా ఆలోచనలు మార్చుకోవడానికి, కొత్తగా ఆలోచించడానికి అవి ఉపకరించాయి’ అంటున్న కైనజ్ ఐటీసి, బ్రూక్ బాండ్, ఫియట్, బజాజ్... మొదలైన ప్రసిద్ధ బ్రాండ్‌లకు పనిచేసింది.
కెరీర్ కొత్తలో చేదు అనుభవాలు ఎదురైనా, వాటిని ఎప్పటికప్పుడూ డిలీట్ చేస్తూ వస్తోంది కైనజ్. ‘చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడం కంటే కొత్త ఐడియాల గురించి ఆలోచించడానికి ఇష్టపడతాను. కొత్తగా ఆలోచించడం అనేది నా వృత్తిలో భాగం. నేను ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలనే ఆలోచన తప్ప వేరే రంగాన్ని ఎంచుకొని ఉంటే బాగుండేది అని ఎప్పుడూ ఆలోచించలేదు. వృత్తిజీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోగలిగే రంగమే నా దృష్టింలో గొప్ప రంగం’ అంటుంది కైనజ్ కర్మాకర్.
విజయపథం: క్రియేటివ్ క్వీన్
Published Thu, Jan 5 2023 3:39 AM | Last Updated on Thu, Jan 5 2023 7:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment