వాయు కాలుష్యం.. కంటికి కనపడదు.. కానీ.. ఒంట్లో మాత్రం కనిపిస్తుంది.. అదెలా అంటారా.. వివిధ రకాల రుగ్మతల రూపంలో.. ఓ సారి కింద ఉన్న గ్రాఫిక్‌పై ఓ లుక్కేయండి.. కాలుష్యం కాటు ప్రభావం.. మన శరీరంలో ఎందెందు వెతికినా.. అందందే అన్నట్లు కనిపిస్తుంది.. అతి సూక్ష్మమైన ధూళి కణాల వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే..
ఊపిరితిత్తులు..
- ఊపిరితిత్తుల వ్యాధి మరింత ముదురుతుంది
- ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది
రక్తం
- రక్త నాళాల గోడల ద్వారా ఈ ధూళి కణాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి
- రక్త ప్రసరణ సమస్యలు
- రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టడం/థ్రాంబోసిస్
రక్త నాళ వ్యవస్థ
- అథెరోస్క్లెరోసిస్(ధమని గోడల్లో కణితి ఏర్పడటం వల్ల రక్త ప్రసరణ తగ్గడం)
- రక్త నాళాలు కుచించుకుపోవడం, అధిక రక్తపోటు
మెదడు
- మెదడుకు రక్తప్రసరణ సరిగా లేక స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం
- కాగ్నిటివ్ డిజార్డర్స్ (మానసిక రుగ్మతలు)
- న్యూరో డిజెనరేషన్ సమస్యలు(పార్కిన్సన్, అల్జీమర్స్ మొదలైనవి)
గుండె
- గుండె పనితీరులో మార్పులు
- గుండె కొట్టుకునే వేగానికి సంబంధించిన సమస్యలు
పునరుత్పత్తి వ్యవస్థ
- సంతానోత్పత్తి సమస్యలు
- గర్భస్రావం
- పిండం ఎదుగుదల సమస్యలు, నెలలు నిండకుండానే జననం
- తక్కువ బరువుతో పుట్టడం
సాక్షి, తెలంగాణ డెస్క్
ఆధారం: ఫ్రెంచ్ నేషనల్ హెల్త్ ఏజెన్సీ, యూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ
Comments
Please login to add a commentAdd a comment