dust air
-
2 వేలు దాటిన అఫ్గాన్ మరణాలు
కాబూల్: అఫ్గానిస్తాన్ పశి్చమ ప్రాంతాన్ని శనివారం కుదిపేసిన పెనుభూకంపంలో మృతుల సంఖ్య రెండువేలు దాటింది. తీవ్ర భూప్రకంపనల కారణంగా మట్టితో నిర్మించిన వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆరు గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎటు చూసినా శిథిలాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటి పెను భూకంపం అఫ్గాన్‌ను కుదిపేయడం ఇదే మొదటిసారి. గత ఏడాది జూన్‌లో అఫ్గానిస్తాన్‌లోని పర్వత ప్రాంతాల్లో సంభవించిన భూకంపంలో కనీసం వెయ్యి మంది చనిపోయారు. అఫ్గాన్‌లో నాలుగో అతి పెద్ద నగరమైన హెరాత్ కేంద్రంగా శనివారం భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. మృతుల సంఖ్య 2,100కి చేరువలో ఉందని ఆదివారం తాలిబన్ సమాచార, సాంస్కృతిక శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ వాహిద్ రయాన్ చెప్పారు. మరో 9,240 మందికి తీవ్ర గాయాలయ్యాయని 1,320 ఇళ్లు నేలమట్టమయ్యాయని ఆయన తెలిపారు. డజనుకి పైగా బృందాలు అత్యవసర సహాయ చర్యల్లో మునిగిపోయాయి. కొన్ని గ్రామాల్లోకి సహాయ సిబ్బంది అడుగు పెట్టడానికి కూడా వీల్లేకుండా శిథిలాలతో నిండిపోయాయి. ఎటు చూసినా శిథిలాల్లో చిక్కుకున్న వారి రోదనలే వినిపిస్తున్నాయి. శిథిలాల కింద ఉన్న వారిని కాపాడడానికి సహాయ బృందాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ చేతులనే ఆయుధాలుగా చేసుకొని శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ గుట్టలు గుట్టలుగా శవాలు బయటకి వస్తున్నాయి. మరికొందరు స్థానికులు శిథిలాల మీద పాకుతూ వెళుతూ వాటిని తొలగిస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న వారిని కాపాడుతున్నారు. హెరాత్‌లో నేలమట్టమైన ఓ ఇంటి శిథిలాల్లో నుంచి ఆదివారం ఒక శిశువును అక్కడి వారు కాపాడుతున్న దృశ్యాన్ని అసోసియేటెడ్ ప్రెస్ ప్రసారం చేసింది. అక్కడే శిథిలాల నుంచి ఓ మహిళ చేయి బయటికి కనిపిస్తుండటం కూడా రికార్డయ్యింది. ఆ మహిళ చిన్నారి తల్లేనని స్థానికులు తెలిపారు. ఆమె బతికున్నదీ లేనిదీ స్పష్టం కాలేదు. క్షతగాత్రులకు చికిత్స అందించడానికి వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. బాధితులకు అందుతున్న సాయం.. అఫ్గాన్‌లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి నుంచి భూకంప బాధితుల్ని కాపాడేందుకు యూనిసెఫ్ దుస్తులు, దుప్పట్లు, టార్పాలిన్లు తదితరాలను పంపించింది. ఐరాస వలసల విభాగం నాలుగు అంబులెన్సులు, వైద్యులు, ఇతర సిబ్బందిని అక్కడి ఆస్పత్రికి పంపించింది. మూడు మొబైల్ వైద్య బృందాలను జెందాజన్ జిల్లాకు పంపిస్తున్నట్లు వెల్లడించింది. డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ కూడా 80 మంది రోగులకు సరిపోయే అయిదు మెడికల్ టెంట్లను హెరాత్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం వంటి సంస్థలు కూడా అత్యవసరాలను అఫ్గానిస్తాన్‌కు అందజేస్తామని ప్రకటించాయి. -
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత.. వ్యర్థాల తరలింపుకు ఎన్ని రోజులు పడుతుందో తెలుసా!
లక్నో: నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతపై దేశమంతా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. నోయిడాలో ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేసింది. వాటర్ పాల్ టెక్నిక్‌ను ఉపయోగించి..100 మీటర్ల దూరం నుంచి అధికారులు బటన్‌ను నొక్కడం ద్వారా టవర్లు నేలమట్టమయ్యాయి. 9 సెకన్లలోనే రెండు భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. భవనాలు కూలడంతో దాదాపు 40 మీటర్లమేర దట్టమైన పొగ కమ్ముకుంది. చదవండి: పేకమేడల్లా కుప్పకూలిన నోయిడా ట్విన్ టవర్స్ .. 9 సెకన్లలోపే.. అయితే ట్విన్ టవర్స్ కూల్చివేత తర్వాత నిర్మాణ వ్యర్థాల తొలగింపునకు 3 నెలల సమయం పట్టనుందని అధికారులు వెల్లడించారు. 55,000 నుంచి 80 వేల టన్నుల శిథిలాలను తరలించనున్నారు. ఈ టవర్స్‌ను కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు. ఇక ఈ రెండు భవనాల్లో ఒకటి 103 మీటర్ల ఎత్తు, మరొకటి 97 మీటర్ల ఎత్తు ఉన్నాయి. చదవండి: మీకు తెలియని ఆసక్తికర విషయాలు : ట్విన్ టవర్స్ కూలడానికి ఆ నలుగురే కారణం! కూల్చివేతల్లో ఒక్కో చదరపు అడుగుకు రూ. 267 ఖర్చు అవుతుండగా... 7.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలు కూల్చివేతకు రూ. 20కోట్లు ఖర్చు అవుతోంది. రూ. 70 కోట్లతో నిర్మించిన ఈ భవనాల ప్రస్తుత విలువ అక్షరాల 1, 200 కోట్లు. #WATCH | Noida, UP: Rubble of demolished #SupertechTwinTowers laid bare along with a cloud of dust in the vicinity after the demolition pic.twitter.com/0jxd4VVh0l — ANI (@ANI) August 28, 2022 ట్విన్ టవర్స్ వద్ద నో ఫ్లైయింగ్ జోన్ అమలు చేయడంతో పాటు చుట్టుపక్కల 500 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. అలాగే కూల్చివేసిన తర్వాత దుమ్ము, కాలుష్య స్థాయిలను పర్యవేక్షించడానికి ప్రత్యేక డస్ట్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. బిల్డింగ్ కూలిన కొద్ది నిమిషాల్లోనే గాలిలో దుమ్ము, దూళిని క్లియర్ చేయనున్నారు. #WATCH | 'Controlled implosion' turns Noida's #SupertechTwinTowers to dust pic.twitter.com/zDksI6lfIF — ANI (@ANI) August 28, 2022 దాదాపు 500 మంది పోలీసులు, ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. ట్విన్ టవర్స్ చుట్టుపక్కల ఉన్న స్థానికులను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. అంతేగాక నోయిడాలోని ఓ స్వచ్ఛంద సంస్థ రంగంలోకి దిగి ఇప్పటివరకు పరిసరాల్లోని 35 వీధి కుక్కలనుపట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. -
దారి చూడు.. దుమ్ము చూడు
సాక్షి, నేలకొండపల్లి(ఖమ్మం): ఆ రోడ్డులో ప్రయాణించేటప్పుడు ఎదురుగా వచ్చే వాహనం కనిపించని పరిస్థితి. రోడ్డు నిర్మాణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి పట్టింపు లేకపోవడంతో దుమ్ము లేస్తోంది. దీంతో వాహనదారులతో పాటు నడుస్తూ వెళ్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కనీసం నీళ్లు కూడా చల్లని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. నీళ్లు చల్లడం లేదు.. మండలంలోని చెరువుమాదారం క్రాస్‌రోడ్డు నుంచి బౌద్ధక్షేత్రం వరకు ఉన్న రహదారిలో దాదాపు 4 కిలోమీటర్ల మేర ప్రభుత్వం నాలుగు లైన్ల రహదారిని మంజూరు చేసింది. రూ.17 కోట్లతో రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. కాగా నేలకొండపల్లిలో రహదారి నిర్మాణ పనుల విషయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీస జాగ్రత్తలు మరిచిపోయారని ప్రజలు మండిపడుతున్నారు. కంకరపోసిన రహదారిపై వాహనాలు వెళ్తుంటే వెనుక నుంచి వచ్చే వారికి ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఎండల తీవ్రత వలన రహదారిపై ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొట్టించాల్సి ఉంది. కానీ సదరు కాంట్రాక్టర్ అడపాదడపా నీళ్లు కొట్టించి చేతులు దులుపుకుంటున్నారనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఇటీవల ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. తృటిలో ప్రమాదం తప్పింది. అనేక వాహనాలు పల్టీకొట్టిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని, కాంట్రాక్టర్ దుమ్ము లేవకుండా నిత్యం నీరు చల్లించేలా చూడాలని కోరుతున్నారు. -
బాబోయ్..ఇదేం రోడ్డు? వెళ్లాలంటేనే దడ పుడుతోంది!
సాక్షి, ఉప్పల్: ఉప్పల్ నుంచి నారపల్లికి వయా ఉప్పల్ డిపో మీదుగా రోడ్డు ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. గుంతలమయమైన రోడ్లు..దుమ్ము ధూళితో కళ్లల్లో మంటలు, తరుచుగా ప్రమాదాలతో ఈ రహదారి టెర్రర్‌గా మారింది. వరంగల్ జాతీయ రహదారి కూడా అయిన ఈ మార్గంలో 2018 జులైలో...రూ.717 కోట్ల వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టారు. ఇప్పటికి 130 పిల్లర్లు మాత్రమే నిర్మించారు. చదవండి: Hyderabad: వాళ్ల కష్టాలు తీరనున్నాయి.. ఆ ప్రాంతానికి మహర్దశ 2020 జూన్‌లోనే ఫ్లైఓవర్ మొత్తం పనులు పూర్తవ్వాల్సి ఉండగా.. వివిధ కారణాల వల్ల ఇప్పటికి కేవలం 35 శాతం మాత్రమే పూర్తయ్యాయి. దీంతో 6.2 కిలోమీటర్ల మేర ఇరువైపులా రహదారి ప్రమాదభరితంగా మారింది. ఇటీవలి వర్షాలకు పరిస్థితి మరీ దిగజారింది. ఏదైనా భారీ వాహనం వెళ్తుంటే..దాని వెనుక వెళ్లే వాహనదారులకు అసలు రోడ్డే కన్పించడం లేదు. అంతగా దుమ్ము..ధూళితో పొగ కమ్ముకుంటోంది. యాదాద్రి వెళ్లాలన్నా, భువనగిరి, వరంగల్, భూపాలపట్నం వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేలాది మంది నరక యాతన అనుభవిస్తున్నారు. చదవండి: మొక్కల కన్నా ముస్లింలు హీనమా? ఉప్పల్ చెరువు కట్ట మీద దుమ్ముకొట్టుకు పోతున్న వరంగల్ జాతీయ రహదారి లేని రోగాలు వస్తాయి.. బీబీనగర్‌లో వెంచర్ నడుస్తున్నందున నేను ప్రతి రోజు ఉప్పల్ మీదుగా వెళ్లాల్సి వస్తోంది. కారు డోరు వేసుకున్నా దుమ్ము వదలడం లేదు. దీంతో దగ్గు వస్తోంది. జబ్బు చేసినట్లుగా ఉంటోంది. వీటికి తోడు పెద్ద పెద్ద గుంతల కారణంగా వాహనాలు పాడవుతున్నాయి. ఈ తిప్పలు ఎన్నాళ్లుంటాయో ఏమో మరి. – మేకల దయాసాగర్ రెడ్డి, వ్యాపారి, ఉప్పల్ గుంతలు..మట్టికుప్పలుబాబోయ్..ఇదేం రోడ్డు? ఉప్పల్ నుంచి నారపల్లి వరకు వెళ్లాలంటేనే దడ పుడుతోంది. ఎక్కడ చూసినా గుంతలు..మట్టికుప్పలు..దుమ్ము ధూళితో ప్రయాణం నరకప్రాయంగా ఉంది. రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై ఎవ్వరికి ఫిర్యాదు చేసినా తమ పరిధి కానే కాదంటున్నారు. – పూస అశోక్ కుమార్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు -
సైకిల్ .. ఇది మామూలుగా ఉండదు మరి!
సైకిల్ తొక్కితే ఆరోగ్యంగా ఉంటామని డాక్టర్లు చెబుతారు.. క్రిస్టియన్ టాపింగ్స్ ఇంకో మాట కూడా చెబుతున్నారు! రోలో తొక్కండి... వాయు కాలుష్యాన్ని పారదోలండీ అని! సైకిల్‌కు, వాయు కాలుష్యానికి సంబంధం ఏమిటనేగా మీ డౌటు? మరి ఈ పండుగ వేళ ఒకసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా? ఒక్కసారి ఈ ఫొటో చూడండి. ఏమిటిది! సైకిల్లాగే కనిపిస్తోంది. కానీ, ఇది మామూలు సైకిల్ మాత్రం కాదు. ఎందుకంటే చక్రాలు కొంచెం భిన్నంగా ఉన్నాయి కాబట్టి! పేరు రోలో! ఈ సైకిల్‌ను తొక్కారనుకోండి.. కాలుష్యం కిల్ అవుతుంది. గాలిని చీల్చుకుంటూ వెళ్లే క్రమంలో కొంత గాలి వేగంగా చక్రాల మధ్యలో ఉండే నిర్మాణాల్లోకి వెళుతుంది. కాలుష్యంతో కూడిన గాలి ఒకవైపు నుంచి వెళితే.. పూర్తిగా శుభ్రమైన వాయువు ఇంకోవైపు నుంచి బయటకు వస్తుంది! క్రిస్టియన్ టాపింగ్స్ అనే బ్రిటన్ డిజైనర్ దీన్ని తయారు చేశారు. ఢిల్లీ కాలుష్యాన్ని చూసి.. ప్రపంచంలోనే ఎక్కువ కాలుష్యమున్న నగరాల్లో ఢిల్లీ ఒకటి. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సులువైన మార్గం కోసం ఆలోచనలు చేసిన టాపింగ్స్ చివరకు సైకిల్ కదిలే వేగాన్ని ఆసరాగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చక్రంలో ఏర్పాటు చేసిన నిర్మాణం కోసం పలు విఫల ప్రయత్నాలు చేసి చివరకు తాజా డిజైన్‌ను ఖరారు చేశారు. ఈ చక్రాల ద్వారా ప్రతి కిలోమీటరు దూరానికి దాదాపు 0.665 ఘనపుమీటర్ల గాలి శుభ్రమవుతుందని అంచనా. క్రిస్టియన్ టాపింగ్స్ ఆ మ్యాజిక్ ఎలా? చక్రాల మధ్యలో ఉండే నిర్మాణంలో మూడు ఫిల్టర్లు ఏర్పాటుచేశారు. లోఫా (స్పాంజి లాంటిది)తో తయారైన ఫిల్టర్ గాల్లోని కొంచెం పెద్దసైజు కాలుష్యకణాలను (పీఎం 10 – 2.5) పీల్చేసుకుంటుంది. ఇళ్లలోని ఎయిర్ ప్యూరిఫయర్లలో వాడే హెపా ఫిల్టర్ పీఎం 2.5 కణాలతోపాటు టైర్లు, బ్రేక్‌ల నుంచి వెలువడే పొడిని తనలో దాచుకుంటుంది. చివరగా.. యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్ వంటి విషవాయువులను పీల్చేసుకుంటుంది. ఈ ప్రక్రియ మొత్తం విద్యుత్తు అవసరం లేకుండానే పూర్తి కావడం రోలో విశిష్టత. కాలుష్యపు కాటు ఇలా.. ► 45 లక్షలు: వాయు కాలుష్యం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలు ► 15 వేల కోట్లు: వాయు కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య, ఇతర సమస్యల కారణంగా భారత్‌లో జరుగుతున్న నష్టం (రూపాయల్లో) ► 91% : 2019లో వాయుకాలుష్యం సమస్యను ఎదుర్కొన్న జనాభా ► 40,000: పీఎం 2.5 కాలుష్యం కారణంగా ఐదేళ్లు నిండకుండానే మరణిస్తున్న చిన్నారులు (ప్రతి ఏడాది) -
పొల్యూషన్.. సిగ్నల్‌లో కన్ఫ్యూజన్
సాక్షి, హైదరాబాద్: డ్రైవర్ అవసరం లేని సాంకేతికత.. ఉప్పల్‌లోని ఆపరేషన్ కంట్రోల్ రూమ్ నుంచే రెండు ప్రధాన రూట్లలో మెట్రో రైళ్ల రాకపోకల నియంత్రణ.. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ (సీబీటీసీ) వ్యవస్థకు ఇప్పటివరకున్న మంచిపేరు. ఫ్రాన్స్.. లండన్.. సింగపూర్ వంటి విశ్వనగరాల్లో అమల్లో ఉన్న ఈ సాంకేతికత ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో మన మెట్రో రైళ్లకు తరచూ బ్రేకులు వేస్తోంది. ట్రాఫిక్ రద్దీ పెరిగి వాతావరణంలో దుమ్ము, ధూళికాలుష్యం పెరగడంతో ఒక్కసారిగా మెట్రో రైళ్లు దూసుకెళ్లే రూట్లలో రెడ్‌లైట్లు ఆన్ అవుతున్నాయి. దీంతో కొన్ని సార్లు మెట్రో రైళ్లు ఉన్న ఫళంగా నిలిచిపోతున్నాయి. అంతేకాదు గంటకు 60 కేఎంపీహెచ్ వేగంతో దూసుకెళ్లే రైళ్ల వేగం కాస్తా.. 25 కిలోమీటర్లకు పడిపోతోంది. తాజాగా మంగళవారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యన ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో ఇదే దుస్థితి తలెత్తింది. ఈ రూట్లో 25 రెడ్‌సిగ్నల్స్ ఒకేసారి ఆన్ అయ్యాయి. ఈ పరిణామంతో పలు స్టేషన్ల వద్ద రైళ్లు నిలిచిపోగా.. రైళ్ల వేగం 25 కేఎంపీహెచ్‌కు పడిపోయింది. దీంతో రంగంలోకి దిగిన మెట్రో సిబ్బంది ఈ రెడ్‌లైట్‌లను మ్యాన్యువల్‌గా ఆఫ్ చేయాల్సి వచ్చింది. సాంకేతిక సమస్య ఇలా.. వాతావరణ మార్పులతో పాటు.. ట్రాఫిక్ రద్దీలో కొన్ని రోజుల్లో దుమ్ము, ధూళి కాలుష్యం ఘనపు మీటరు గాల్లో 100 మైక్రోగ్రాములను మించుతోంది. ఈ స్థాయిలో కాలుష్యం నమోదైన ప్రతిసారి మెట్రో రూట్లలో ఏర్పాటుచేసిన రెడ్‌సిగ్నల్స్ ఆన్ అవుతున్నాయి. సాధారణంగా ఘనపు మీటరు గాలిలో ధూళి కాలుష్యం వంద మైక్రోగ్రాముల లోపల ఉంటేనే సీబీటీసీ సాంకేతికత పనిచేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే వాయు కాలుష్యం పెరిగిన ప్రతిసారీ రెడ్‌లైట్లు ఆన్ అవుతుండటంతో మెట్రో రైలు రిస్టిక్టెడ్ మోడ్ (నియంత్రిత స్థాయి)కు వస్తోంది. దీంతో కొన్నిసార్లు రైళ్లు నిలపాల్సి రావడం.. చాలాసార్లు రైళ్ల వేగం 60 నుంచి 25 కేఎంపీహెచ్‌కు పడిపోతోంది. సీబీటీసీ సాంకేతికత అత్యాధునికమైనదేకాదు.. ఇది అత్యంత భద్రమైనదని మెట్రో అధికారులు చెబుతున్నా.. హైదరాబాద్‌లో వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని హెచ్ఎంఆర్ అధికారులు ఈ సాంకేతికతను తయారు చేసిన థేల్స్(ఫ్రాన్స్)కంపెనీకి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడం గమనార్హం. మెట్రో జర్నీలో సాంకేతిక ఇబ్బందులివే.. ► టికెట్ వెండింగ్ యంత్రాలు నూతన రూ.50, రూ.100, రూ.10 నోట్లను స్వీకరించట్లేదు. ► 4 పాత కరెన్సీ నోట్లతో కలిపి ఒక కొత్త నోటును యంత్రంలో పెడితే పాతనోట్లు కూడా యంత్రంలోనే ఉండిపోతున్నాయి. ► స్టేషన్ మధ్యభాగంలో ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ యంత్రాలుండే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద స్మార్ట్ కార్డులను స్వైప్‌చేస్తే కొన్ని సార్లు యంత్రాలు మొరాయిస్తున్నాయి. ► ప్లాట్‌ఫాంపైకి వెళ్లే సమయంలో సెక్యూరిటీ చెక్ వద్ద మొబైల్‌ను కూడా స్కానింగ్ చేసిన తర్వాతే అనుమతిస్తుండటంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ► మెట్రో అధికారులు రైళ్ల ఫ్రీక్వెన్సీ ప్రతీ రూట్లో ప్రతి 6 నిమిషాలకో రైలు అని ప్రకటించినా సమయం కొన్ని సార్లు 10–12 నిమిషాలకు పైగా పడుతోంది. ► పార్కింగ్ లాట్ వద్ద బైక్‌లకు నెలవారీ పాస్ వెల రూ.250 వసూలు చేస్తున్నారు. ఈ రుసుము అధికంగా ఉండటంతో సిటీజన్లు మెట్రో పార్కింగ్ లాట్లకు దూరంగా ఉంటున్నారు. ► మెట్రో కారిడార్‌లో పిల్లర్లకు లైటింగ్ లేకపోవడంతో ఈ రూట్లలో రాత్రి వేళల్లో కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. ► మెట్రో గమనంలో సడెన్బ్రేక్లు వేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
కాలుష్యం కాటు..ఎందెందు వెతికినా..అందందే..
వాయు కాలుష్యం.. కంటికి కనపడదు.. కానీ.. ఒంట్లో మాత్రం కనిపిస్తుంది.. అదెలా అంటారా.. వివిధ రకాల రుగ్మతల రూపంలో.. ఓ సారి కింద ఉన్న గ్రాఫిక్‌పై ఓ లుక్కేయండి.. కాలుష్యం కాటు ప్రభావం.. మన శరీరంలో ఎందెందు వెతికినా.. అందందే అన్నట్లు కనిపిస్తుంది.. అతి సూక్ష్మమైన ధూళి కణాల వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే.. ఊపిరితిత్తులు.. - ఊపిరితిత్తుల వ్యాధి మరింత ముదురుతుంది - ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది రక్తం - రక్త నాళాల గోడల ద్వారా ఈ ధూళి కణాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి - రక్త ప్రసరణ సమస్యలు - రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టడం/థ్రాంబోసిస్ రక్త నాళ వ్యవస్థ - అథెరోస్క్లెరోసిస్(ధమని గోడల్లో కణితి ఏర్పడటం వల్ల రక్త ప్రసరణ తగ్గడం) - రక్త నాళాలు కుచించుకుపోవడం, అధిక రక్తపోటు మెదడు - మెదడుకు రక్తప్రసరణ సరిగా లేక స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం - కాగ్నిటివ్ డిజార్డర్స్ (మానసిక రుగ్మతలు) - న్యూరో డిజెనరేషన్ సమస్యలు(పార్కిన్సన్, అల్జీమర్స్ మొదలైనవి) గుండె - గుండె పనితీరులో మార్పులు - గుండె కొట్టుకునే వేగానికి సంబంధించిన సమస్యలు పునరుత్పత్తి వ్యవస్థ - సంతానోత్పత్తి సమస్యలు - గర్భస్రావం - పిండం ఎదుగుదల సమస్యలు, నెలలు నిండకుండానే జననం - తక్కువ బరువుతో పుట్టడం సాక్షి, తెలంగాణ డెస్క్ ఆధారం: ఫ్రెంచ్ నేషనల్ హెల్త్ ఏజెన్సీ, యూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ -
గతుకుల దారిలో.. దుమ్ముగాలిలో తప్పని ప్రయాణం
రోడ్డెక్కడో.. గుంతలెక్కడో తెలియదు పాపం.. ఇది శిథిల దారి అని తెలుసూ.. అది మట్టి ధూళీ అని తెలుసూ.. ముందు వాహనం కనిపించదని తెలుసూ.. దారి పొడువునా ఇంతేనని తెలుసూ ఇది ఉరుకుపరుగుల జీవితం.. అది అధికారుల చెలగాటం రోడ్డు శకలమై.. ఒళ్లు హూనమై.. సాగుతున్నదొక ప్రయాణం పట్టు జారినా.. రెప్ప మూసినా ఆగును జీవన పోరాటం.. నంద్యాల–గిద్దలూరు రహదారిపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. కర్నూలు, ప్రకాశం జిల్లాలకు రాకపోకలు సాగించే వాహనదారులకు ఈ దారే ప్రధానం. నంద్యాల నుంచి గుంటూరు, విజయవాడ తదితర ప్రధాన పట్టణాలకు కూడా ఈ దారి మీదుగానే వెళ్లాల్సిందే. నాపరాతి, ధాన్యం, గ్యాస్ సిలిండర్ల లోడ్లతో లారీలు భారీ సంఖ్యలో వెళ్తుంటాయి. ఓ వైపు ఘాట్‌రోడ్డు. మరో వైపు శిథిలమైన రహదారి. అడుగడుగునా గుంతలు. దుమ్ము చెలరేగి ఎదురెదురు వాహనాలు కనిపించని పరిస్థితి. వాహనదారులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మృత్యువు దాడి చేసే అవకాశం. గాజులపల్లె నుంచి ప్రకాశం జిల్లా వైపు సర్వనరసింహ క్షేత్రం వరకు.. ఇటు అయ్యలూరు మెట్ట వరకు పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. 30 కి.మీ. ప్రయాణం రెండు గంటల సమయం పడుతోంది. రాత్రి వేళ పరిస్థితి మరీ దారుణం. వాహనదారులకు ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. - మహానంది