మెదడు పెద్దదైతే.. మానసిక రుగ్మతలు
వాషింగ్టన్ : మెదడు పరిమాణం పెద్దగా ఉండే వారు మనోవైకల్యం, అల్జీమర్స్ వంటి మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మెదడు పరిమాణం పెద్దగా ఉండడంతో మెదడులోని దూర ప్రాంతాలకు సమాచార మార్పిడి సరిగ్గా జరగకపోవడమే దీనికి కారణంగా వారు పేర్కొంటున్నారు.
క్షీరదాలలో సమాచార మార్పిడి, జ్ఞాపకశక్తి వ్యవస్థలను మెదడులోని సెరెబ్రల్ కార్టెక్స్ నిర్వహిస్తుంది. దీనిలోని నాడుల పనితీరును తెలుసుకోవడం ద్వారా అది చేసే పనుల గురించి అవగాహనకు రావచ్చని వాషింగ్టన్ వర్సిటీ, రుమేనియాలోని బొలాయి వర్సిటీ పరిశోధకులు తెలిపారు.