బ్రెయిన్కు ట్రైనింగ్ ఇచ్చే భలే యాప్స్!! | 8 apps to train your brain | Sakshi
Sakshi News home page

బ్రెయిన్కు ట్రైనింగ్ ఇచ్చే భలే యాప్స్!!

Oct 7 2016 12:43 PM | Updated on Sep 4 2017 4:32 PM

బ్రెయిన్కు ట్రైనింగ్ ఇచ్చే భలే యాప్స్!!

బ్రెయిన్కు ట్రైనింగ్ ఇచ్చే భలే యాప్స్!!

స్మార్ట్ఫోన్లో వాడే యాప్స్ ద్వారా మన మెదడుకు పదునుపెట్టుకోవచ్చట.

ఎప్పటికప్పుడు మన మెదడుకు పదునుపెట్టుకోవడం కత్తి మీద సాము లాంటిదే. చేసే పనిపైనే ఎక్కువగా దృష్టిపెట్టడం, ఉన్న జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడం, ఒత్తిడిని తగ్గించుకుని ఉత్సాహవంతంగా పనిచేయడం..ఇవన్నీ మెదడు చురుగ్గా ఉంటేనే సాధ్యం. దానికి పరిష్కారం మరెక్కడో లేదు.. మన జేబులోనే ఉంది. ఇటీవల ప్రజలు స్మార్ట్ఫోన్లకు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నా.. స్మార్ట్ఫోన్లో వాడే యాప్స్ ద్వారా మెదడుకు పదునుపెట్టుకోవచ్చట. వీటిలో 8 కొత్తరకం యాప్స్ భలే  సక్సెస్ఫుల్గా పనిచేస్తూ..  మానసిక శాంతిని చేకూరుస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు. 
లూమోసిటీ... 
బ్రెయిన్ ట్రైనింగ్ యాప్స్లో ఇది చాలా పాపులర్. న్యూరో సైంటిస్టులు ఈ యాప్ను రూపొందించారు.అత్యంత ఆసక్తికరమైన ఫీచర్లెన్నో దీనిలో ఉంటాయి. యూజర్ల మెమరీని పెంచుతూ, సమస్యలను వేగవంతంగా పరిష్కరించడానికి, యూజర్లకు అనుగుణంగా ఆలోచించడంలో లుమోసిటీ యాప్ పని అమోఘం. ప్రస్తుతం ఈ యాప్ను 70 మిలియన్ యూజర్లు వాడుతున్నారు. చిన్న చిన్న గేమ్స్‌ ద్వారా యూజర్లు తమ తెలివిని పరీక్షించుకుంటూనే తర్వాత దశలకు వెళ్లొచ్చని ఈ యాప్ డెవలపర్లు పేర్కొంటున్నారు. 
విజార్డ్...
ఈ యాప్ను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని న్యూరోసైంటిస్టులు, సైకాలజిస్టులు, గేమ్ డెవలర్స్, మనోవైకల్యం కలిగిన వారు కలిసి రూపొందించారు. విజార్డ్ యాప్ యూజర్లు ఒక ప్రత్యేక కార్యక్రమంపై అందరికీ ఒకేలా మెమరీ కలిగి ఉండేలా సహకరించడంతో పాటు, మనోవైకల్యం కలిగిన వారి దైనందిన జీవితంలో ఉపయోగపడేలా దీన్ని తయారుచేశారు.
 
ఫిట్ బ్రైయిన్స్ ట్రైనర్....
వేగవంతంగా ఆలోచించడానికి ఫిట్ బ్రైయిన్స్ ట్రైనర్ యాప్ ఎంతో సహకరిస్తుంది. 360 గేమ్స్, పజిల్స్ కూడిన ఈ యాప్, యూజర్ల బ్రెయిన్కు పదునుపెట్టేలా చేస్తుంది. గేమ్స్ ద్వారా మీ ఫర్ఫార్మెన్స్ను ట్రాక్ చేసి, సలహాలు సూచనలు కూడా ఫిట్ బ్రైయిన్స్ ట్రైనర్ అందిస్తోంది. 
 
ఇడెటిక్‌: ఇంపార్టెంట్‌ ఫోన్‌ నెంబర్లు నుంచి సన్నిహితుల బర్త్డేల వరకు ఏ వాస్తవం గుర్తుంచుకోవాలన్నా ఈ యాప్ భలే సహాయ పడుతుందట. ఇతరాత్ర భాషలు నేర్చుకోవడానికి కూడా ఈ ఇడెటిక్ సూపర్గా ఉపయోగపడుతుంది..విద్యార్థులకు సంబంధించి ఫర్‌ఫెక్ట్‌ యాప్స్‌లో ఇది ఒకటిగా చెప్పొచ్చని పరిశోధకులంటున్నారు. 
ఎలివేట్‌...
2014లో ఎలివేట్ యాప్ను లాంచ్ చేశారు. డైలీ చాలెంజస్తో  యూజర్లు తమ  కమ్యూనికేషన్, ఎనలిటికల్ స్కిల్స్ను పెంచుకోవడంలో దీనికి సాటిలేదట.  మెమొరీ, మ్యాథ్స్‌, ఏకాగ్రతతో పాటుగా ఇతర మెంటల్‌ స్కిల్స్‌ను పరీక్షించే 30 రకాల గేమ్స్‌ దీనిలో ఉన్నాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లలో ఉచితంగా లభించే ఈ యాప్‌లో ఒకసారి ఎంటరైతే మరలా బయటకు రావడం కష్టం. అంతగా ఆకట్టుకునే రీతిలో ఈ గేమ్స్‌ ఉంటాయి.
 
 బ్రెయిన్ ట్రైనర్ స్పెషల్ ..
మాథమేటికల్ ప్రాబ్లమ్స్ను పరిష్కరించడం నుంచి సుడోకోలు ఆడటం వరకు ఎంపిక చేసిన గేమ్స్ అన్నింటినీ ఇది ఆఫర్ చేస్తుంది. బ్రెయిన్ ట్రైనర్ స్పెషల్ యాప్ యూజర్లు ఏ అంకెలనైనా వరుస క్రమంలో గుర్తుంచుకోవడానికి,  మెదడును ఓ మంచి రూపంలో తయారుచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.  
 
మైండ్ గేమ్స్..
ఈ యాప్ పూర్తిగా ఉచితం. వెంటనే మెమరీని పెంచడం, పదసామాగ్రిని యూజర్లలో విస్తృతపరచడానికి ఇది ఎంతో సహకరిస్తోందట.
 
హ్యాపీఫై...
సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఎక్కువ పాజిటివ్గా ఆలోచించాలనుకుంటున్నారా? అయితే హ్యాపీఫై మిమ్మల్ని ఎప్పుడూ హ్యాపీగా ఉంచుతుందట. ఈ యాప్ క్విజ్ లను, పోల్స్ను ఆఫర్ చేస్తూ మనలోని ఒత్తిడిని తొలగిస్తుందట. దీనిలో రిలాక్సేషన్, మెడిటేషన్ ఫీచర్లు కూడా ఉన్నాయట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement