యోగా అంటేనే దేహం, మనసు, ఆత్మల సమన్వయం. నిజానికి ప్రతి యోగాసనంతో మైండ్, బాడీ, స్పిరిట్ (సోల్) ఈ మూడూ పునరుత్తేజితమవుతాయి. అయితే ఇక్కడ పేర్కొన్న ఈ ఆసనాలు నేరుగా మెదడును ఉత్తేజితం చేస్తాయి. అందుకే ప్రత్యేకంగా వీటి ప్రస్తావన.
చేతులు రెండూ క్రిందకు ఉంచిన తరువాత (ఇక్కడ చూపిన పొజిషన్‌లో) కుడికాలు వెనుకకు తరువాత ఎడమకాలు వెనుకకు తీసుకువెళ్లి శ్వాస వదులుతూ నడుమును పైకి తీసుకువెళ్లి పొట్టని బాగా లోపలకు లాగుతూ 3 లేదా 5 శ్వాసలు ఉండాలి. ఈ స్థితిలో తలవైపునకు రక్తప్రసరణ పెరిగి మెదడు తదితర భాగాలు చురుకుగా పనిచేస్తాయి. సూర్యనమస్కారాల్లో ఒకటైన ఆసనాన్ని విడిగా చేయాలి అనుకున్నప్పుడు... సమస్థితిలో నిలబడి శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకెళ్లాలి. పైన చేతులు ఇంటర్‌లాక్ చేసి శ్వాస తీసుకుంటూ కాలి వేళ్ల మీద పైకి లేస్తూ మడమల్ని పైకి ఎత్తి స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదులుతూ మడమలను నేల మీద ఆన్చి తల చేతులు కలిపి ముందుకు ఫార్వార్డ్ బెండింగ్ చేయాలి. మోకాళ్లను ఫ్రీగా ఉంచి పొట్టను లోపలకు లాగుతూ నడుము నుంచి పై భాగాన్ని ఎడమవైపు నుంచి కుడివైపునకు కుడి నుంచి ఎడమవైపునకు చేతులను వేలాడేస్తూ రొటేట్ చేయాలి. తలను మధ్యలోకి తీసుకు వచ్చి చేతులు ముందు నేల మీద ఒకదానికి ఒకటి ఒక అడుగు దూరంలో ఉంచి ఆల్టర్నేట్ పాదాలు ఒక్కో అడుగు వెనుకకు వేస్తూ రెండు పాదాలు వెనుకకు తీసుకువెళ్లి, పాదాల మధ్య ఒకటి లేదా ఒకటిన్నర అడుగు దూరం ఉంచి నడుమును బాగా పైకి లేపి భూమికి శరీరం త్రిభుజాకారంలో ఉండేటట్టుగా ప్రయత్నించాలి. శ్వాస వదులుతూ పొట్టను బాగా లోపలకి లాగిపెట్టి ఉంచే ప్రయత్నం చేస్తూండాలి. మూడు లేదా ఐదు శ్వాసల తర్వాత తిరిగి అలాగే వెనుకకు పాద హస్తాసనము లోనికి, శ్వాస తీసుకుంటూ తల చేతులు పైకి లేపి శ్వాస వదులుతూ చేతులు పక్క నుంచి కిందకు తీసుకువచ్చి తిరిగి సమస్థితిలోనికి రావాలి.
ఉపయోగాలు: శరీరంలో ఉన్న 640 కండరాలలో కనీసం 500 కండరాలకు వ్యాయామం జరుగుతుంది. వెన్నుపూస భాగానికి తలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. బ్రెయిన్ బాగా యాక్టివేట్ అవుతుంది.
చంద్రభేది ప్రాణాయామం
అర్ధ పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చోవాలి. వెన్నెముక, మెడ నిటారుగా ఉంచి ఎడమచెయ్యిని ధ్యానముద్ర (చూపుడు వేలు చివరభాగం బొటవేలు చివరభాగానికి తాకించి) లేదా చిన్ముద్ర (చూపుడు వేలు చివరభాగం బొటనవేలు మధ్యభాగానికి తాకించి)లో ఉంచి, కుడిచేతిని నాసికా ముద్ర లేదా నాసాగ్రముద్రలో లేదా మధ్యలో మూడు వేళ్లు మడిచి బొటన వేలు చిటికెన వేలితో నాసిక రంధ్రాలను మూస్తూ చేయాలి.
చేసే విధానం: కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ, శ్వాస తీసుకున్న తరువాత ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి ఉంచి కుడి ముక్కు రంధ్రాన్ని తెరిచి కుడి ముక్కు ద్వారా శ్వాసను బయటకు వదలాలి. మళ్లీ ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుని కుడి ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఈ విధంగా 5 లేదా 10 సార్లు రిపీట్ చేయాలి.
గమనిక: రైట్ హ్యాండర్స్ కుడి చేత్తో, లెఫ్ట్ హ్యాండర్స్ ఎడమచేత్తో చేయవచ్చు. కుడిచేత్తో చేసేటట్లయితే కుడిముక్కు రంధ్రాన్ని మూయడానికి తెరవడానికి బొటనవేలును ఉపయోగిస్తారు. ఎడమచేతి వాటం ఉన్నవాళ్ళు చిటికెన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని తెరవడం, మూయడం చేస్తారు.
ఉపయోగాలు: ఎడమ ముక్కు నుంyì శ్వాస తీసుకుంటాం కనుక మెదడులోని కుడి గోళార్ధానికి ఆక్సిజన్ ఎక్కువగా పంపబడి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. స్ట్రెస్, టెన్షన్స్, హై బీపి, ఎమోషనల్ ఇన్‌బ్యాలెన్స్ వంటి సమస్యలకు చాలా మంచిది. క్రియేటివ్ థింకింగ్, ప్యారల్లెట్ ప్రాసెసింగ్‌కి ఉపయోగించే కుడి మెదడు పనితీరు మెరుగవడానికి ఉపయోగపడుతుంది.
సర్వాంగాసన
ఆసనంలో వెల్లకిలా పడుకుని చేతులు రెండూ శరీరానికి ఇరువైపులా అరచేతులు భూమిమీద నొక్కుతూ రెండు పాదాలను మోకాళ్లను కలిపి ఉంచి శ్వాస తీసుకుంటూ రెండు కాళ్లను నెమ్మదిగా పైకిలేపి 90 డిగ్రీ కోణంలోకి తీసుకు రావాలి. తర్వాత కాళ్లను ఇంకా తలవైపునకు తీసుకువెళుతూ నడుముకి రెండు చేతులతో సపోర్ట్ ఉంచి నడుమును సీటు భాగాన్ని ఇంకా పైకి లేపి వీపు మధ్య భాగానికి చేతులతో సపోర్ట్ ఉంచి భుజములు మెడ మీద శరీరం మొత్తాన్ని పైకి గాలిలోకి లేపే ప్రయత్నం చేయాలి. పూర్తి ఆసన స్థితిలోకి వచ్చిన తర్వాత స్ట్రెచ్ చేసిన పాదాలను కొంచెం రిలాక్స్‌డ్‌గా సమంగా ఉంచాలి. ఈ స్థితిలో గడ్డం ఛాతీ భాగాన్ని అదుముతూ ఉంటుంది. ఆసనంలో స్థిరంగా సాధారణ శ్వాసలు 5 లేదా 10 తీసుకుని అంటే సుమారు రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉన్నట్లయితే రక్త ప్రసరణ తలవైపునకు ఎక్కువగా ఉండి క్రేనియల్ నెర్వస్ సిస్టమ్‌కి లాభం చేకూరుతుంది. ఆసనం మీద పట్టు ఉన్నట్లయితే సర్వాంగాసనంలో రెండు కాళ్లు పైన పక్కలకు సెపరేట్ చేయవచ్చు. ఒకకాలు ముందుకు ఒక కాలు వెనుకకు ఆల్టర్నేటివ్‌గా కదలించవచ్చు. సైక్లింగ్ చేయవచ్చు.
కపాలాసన లేదా శీర్షాసన
ఇది చేయడం కష్టతరమే అని అన్పిస్తున్నా నిరంతర అభ్యాసంతో తేలికగా చేయవచ్చు. ముందుగా కొన్నాళ్లు గోడను ఆధారంగా చేసుకొని ప్రాక్టీసు చేయాలి. తలకింద మెత్తటి బ్లాంకెట్‌ను గాని యోగా మ్యాట్‌ను గాని చక్కగా మడత వేసి, తల మాడు భాగాన్ని కాకుండా ప్రీ ఫ్రోంటల్ ఏరియాను అంటే మాడు నుదురుకి మధ్యలో ఉన్న భాగం నేల మీద ఉంచాలి. రెండు అరి చేతులు తలకి ఇరువైపులా వేళ్లు ఇంటర్‌లాక్ చేసి సపోర్టుగా రెండు మోచేతులు భూమి మీద తలపక్కగా స్టాండ్‌లాగా ఉంచాలి. శరీరాన్ని బ్యాలెన్సు చేస్తూ రెండు పాదాలు, కాళ్లు కలిపి ఉంచి వాటిని భూమి మీద నుండి నెమ్మదిగా పైకి లేపుతూ భూమికి సమాంతరంగా వచ్చిన తరువాత, రెండు మూడు శ్వాసల కాలం విశ్రాంతి తీసుకుని మళ్లీ అక్కడ నుండి పైకి భూమికి లంబంగా వచ్చేటట్లుగా తీసుకువెళ్లాలి. ఈ స్థితిలో మూడు లేదా అయిదు నిమిషాల సేపు ఉండగలిగితే మెదడులోని కణాలన్నింటికీ ఆక్సిజన్‌తో కూడిన రక్తం సరఫరా బాగా పెరిగి మెదడు చురుకుగా పనిచేస్తుంది. పిట్యుటరీ గ్రంధి యాక్టివేట్ అవ్వడం వలన శరీరంలో హార్మోన్ల విడుదలలో సమతౌల్యత చేకూరుతుంది.
ముఖ్య గమనిక: నిపుణుల పర్యవేక్షణలోనే ఈ ఆసనాన్ని సాధన చేయాలి.
బ్రెయిన్ ట్రెయిన్
యోగా అనేది మనల్ని మనం వర్తమానంలో ఉంచుకోవడానికి ఉద్దేశించింది. మొత్తం యోగా కాన్సెప్ట్... అనేది దీని చుట్టూనే డిజైన్ చేయడం జరిగింది. ఈ మైండ్‌నే యోగాలో అంతఃకరణాలు అంటాం. ఇంద్రియాలు, మనస్సు కలిపి కాన్షియస్ మైండ్ అంటాం, అహం, చిత్తంని అన్‌కాన్షియస్ లేదా సబ్‌కాన్షియస్ మైండ్ అంటాం. మన స్వభావం మారితేనే అన్నీ మారతాయి. కోపం, ఈర్ష్య, కామం వంటివాటిపై అదుపు ఉన్న మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. వీటికి అవసరమైన శిక్షణ, సాధన యోగాలో లభిస్తుంది.
బ్రెయిన్‌కు స్ట్రెయిన్...
బ్రెయిన్‌కి ముందు భాగంలో ఉండేవాటిని ఫ్రాంటల్ ఏరియాస్ అంటాం. ఫీలింగ్స్‌ని, ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసేది బ్రెయిన్‌లోని ఆ ప్రాంతమే. అయితే ప్రస్తుత తరం పిల్లల్లో ఆ ఏరియా చాలా బలహీనపడింది. దీంతో భావోద్వేగాల మీద, ఫీలింగ్స్ మీద కంట్రోల్ ఉండటం లేదు. ర్యాంక్ రాకపోయినా సూసైడ్, మొబైల్ కొనకపోయినా సూసైడ్ చేసుకోవడం... వంటివి అందుకనే జరుగుతున్నాయి. జీవితంలో చిన్ననాటి నుంచి కష్టాలను ఎదుర్కుంటే ఫ్రాంటల్ ఏరియాస్ శక్తిమంతంగా మారతాయి. ఇప్పుడు పిల్లలకి అంతా స్పూన్ ఫీడింగ్ కదా. బస్సెక్కి శారీరక అవయవాలను ఉపయోగించి చేయాల్సిన పనులు వాళ్లు చేయడం లేదు. మైండ్ ని మాత్రమే ఉపయోగిస్తున్నారు. శరీరం ఒక కష్టాన్ని తట్టుకుంటూ నేర్చుకోవడాన్ని ఎక్స్‌పీరియన్స్‌డ్ లెర్నింగ్ అంటారు. ఇప్పుడు పిల్లల్లో ఎక్స్‌పీరియన్స్‌డ్ లెర్నింగ్, లోకోమోటార్ లెర్నింగ్ తక్కువైపోయింది.
పరిశోధనలు తేల్చింది ఏమిటంటే...
బ్రెయిన్‌పై యోగా–ధ్యానం ప్రభావం అనే అంశంపై ప్రస్తుతం 500కి మించి పరిశోధనలు జరుగుతున్నాయి. మైండ్ ఫుల్ నెస్ అనే అంశం మీద జాన్ కబాత్ అనే ఆయన అమెరికాలో మెడిటేçషన్ కోర్సు పెట్టాడు. మెడిటేషన్ తర్వాత బ్రెయిన్‌లో వచ్చే ఎన్నో సానుకూల మార్పులు ఆయన కనిపెట్టారు. నవతరం చాలా షార్ప్. ఒకేసారి 10వేల రకాల డైరెక్షన్‌లో వీరి మైండ్ తిరుగుతుంటుంది. మొబైల్ ఫోన్స్, టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉన్నవారిలో మైండ్ మరింత యాక్టివ్‌గా ఉంటోంది. దీని వల్లే వీరికి ఒక పనిమీద ఏకాగ్రత అంత సులభంగా కుదరదు. విపరీతమైన డైవర్షన్స్ ఉంటాయి. దీనికి కారణం ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసే గ్రేసెల్ ఏరియాస్, వైట్ సెల్ ఏరియాస్ వీక్ అవుతుండటం. ఇదే రీసెర్చ్‌లో తేలింది. ప్రస్తుత తరంలో అత్యధికులు మైండ్ సంబంధిత పని మాత్రమే చేస్తున్నారు. శారీరకమైన పని దాదాపు సున్నా అయింది. అది సరైంది కాదు. అలాగే లెఫ్ట్ బ్రెయిన్, రైట్‌బ్రెయిన్స్‌లో లెఫ్ట్ యాక్టివ్‌గా ఉంటోంది. రైట్ బ్రెయిన్ వీక్ అవుతోంది. స్ట్రెస్, యాంగ్జయిటీ అంతా లెఫ్ట్‌లోనే ఉంటుంది. రైట్ బ్రెయిన్ మనకి పీస్ ఆఫ్ మైండ్, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అందిస్తుంది. భారతీయుల్లో సహజంగానే లెఫ్ట్ బ్రెయిన్ చాలా యాక్టివ్. పుస్తకాల పురుగుల్లా చేయడం వల్ల కూడా ఈ సమస్య మరింత పెరుగుతుంది. రైట్ బ్రెయిన్ చాలా పూర్‌గా పనిచేస్తుంది. రైట్ బ్రెయిన్ ఎప్పుడూ వర్తమానంలో ఉంటుంది. ఇదే క్రియేటివిటీకి ఉపయోగిస్తుంది.అలా రైట్ బ్రెయిన్ యాక్టివ్ చేయడానికి ధ్యానం ఉపకరిస్తుంది. రైట్ బ్రెయిన్‌కి ప్రోగ్రామింగ్ చేయడం అనేది మెడిటేషన్ ద్వారా మాత్రమే సాధ్యం.
మైండ్ ట్రెయిన్...
మైంyŠ కి ఇచ్చే శిక్షణ 2 రకాలు. ఒకటేమో ఏకాగ్రత పెంచేది. రెండోది వర్తమానంలో ఉంచడానికి ఇచ్చేది. మన స్వభావాన్ని, నేచర్‌ని మార్చడానికి, వర్తమానంలో ఉండేందుకు చేసేదే మెడిటేషన్. –ధ్యానాలు... కాన్షియస్ మైండ్ మీద పనిచేసే ధ్యానాలు. అన్‌కాన్షియస్ మైండ్ మీద పనిచేసే ధ్యానాలు అని రెండుంటాయి. మైండ్ అటూ ఇటూ వెళ్లకుండా ఉపయోగపడే ధ్యానాలను గ్రాహ్య తరగతికి చెందినవి. మంత్ర మెడిటేషన్, చక్రాల మీద ధ్యానం చేయడం ఇవన్నీ కాన్షియస్ మైండ్ మీద పనిచేసేవి. అన్‌కాన్షియస్ మైండ్ మీద ప్రభావం చూపే ధ్యానాలను గ్రహీత్న తరగతికి చెందుతాయి. అసలైతే ధ్యానాల్లో మొత్తం 40 రకాలు ఉంటాయి. వీటిలో దాదాపు అన్నీ అంటే 38 రకాల వరకూ కాన్షియస్ మైండ్ మీదనే పనిచేస్తాయి.
ఆసనం ఉద్దేశం అదే...
యోగాసనాల ఉద్దేశం చాలా మంది అనుకుంటున్నట్టు ఫిట్‌నెస్, ఆరోగ్యం ఇవి మాత్రమే కావు... బ్రెయిన్‌ని సరైన విధంగా శిక్షణ ఇవ్వడమే. మనసుకి అటూ ఇటూ తిరగడం అలవాటు. దాన్ని మార్చడానికి, శరీరంతో ఉంచడానికే ఆసనం. కాబట్టి దాదాపు అన్ని ఆసనాలూ బ్రెయిన్‌ని యాక్టివేట్ చేయడానికి ఉపకరిస్తాయి. అన్‌కాన్షియస్ మైండ్ అనేది శరీరంలో అణువణువునా ఉంటుంది. అయితే ప్రతి కదలికలో మనసు ఉండాలి. అలాంటి శిక్షణ ఇచ్చేదే ఆసనం. అందుకే ఆసన కాన్సెప్ట్ మొత్తం కూడా బ్రెయిన్ ప్రోగ్రామ్‌నకు చెందిందే. అథోముఖ శ్వానాసనం, కపాలాసనం లేదా శీర్షాసనం... ప్రాణాయామాల్లో చంద్రభేదీ ప్రాణాయామం, క్రియా ప్రాణాయామం ... ఇవన్నీ కూడా బ్రెయిన్ మీద శక్తిమంతంగా పనిచేసి అల్జీమర్స్, పార్కిన్‌సన్స్, డౌన్ సిండ్రోమ్, ఆటిజం వంటి సమస్యల నివారణకు ఉపకరిస్తుంది. ఆసనం ద్వారా ఆక్సిజన్ సరఫరా పెరిగి 15 నుంచి 20% బ్రెయిన్ యాక్టివ్‌నెస్ పెరుగుతుందని రుజువైంది.
Comments
Please login to add a commentAdd a comment