మెదడు
మితంగా పుచ్చుకుంటే మద్యం వల్ల మెదడుకు మేలే జరుగుతుందని అంటున్నారు రోచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. తక్కువ స్థాయిలో తీసుకునే మద్యం మెదడులో పేరుకుపోయే బీటీ అమైలాయిడ్ వంటి విష పదార్థాలు బయటకు పంపేందుకు దోహదపడుతుందని , తద్వారా వాపు/మంట తగ్గి మెదడు పనితీరు మెరుగవుతుందని శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం ద్వారా స్పష్టం చేస్తున్నారు. దీర్ఘకాలంపాటు మద్యం ఎక్కువగా తీసుకోవడం నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుందని వీరు గతంలోనే నిరూపించగా.. తాజా అధ్యయనంలో కొన్ని ఎలుకలకు తక్కువ మోతాదులో ఎథనాల్ అందించి.. వాటి మెదళ్లలో వచ్చే మార్పులను పరిశీలించారు.
అస్సలు మద్యం తీసుకోని ఎలుకల కంటే కొద్దిమోతాదులో తీసుకునే వాటిలో మెదడులోని మలినాలను తొలగించేందుకు ఉపయోగపడే సెంట్రల్ స్పైనల్ ఫ్లూయిడ్స్ వేగంగా పనిచేసినట్లు తెలిసింది. మెదడు కదలికలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా మద్యం తీసుకోని.. తక్కువ తీసుకున్న ఎలుకల పనితీరు ఒకేలా ఉందని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ఈ ప్రయోగాల్లో తక్కువ మోతాదు మద్యమంటే.. రోజుకు రెండున్నర పెగ్గులుగా తీర్మానించారు!
Comments
Please login to add a commentAdd a comment