జిమ్‌కి వెళ్లడం అనేది చాలా శ్రమతో కూడిన పని. పైగా వర్కౌట్లు, యోగా వంటివి కొన్ని రోజులు చేసి వదిలేస్తాం. అదే డ్యాన్స్ అనంగానే కాస్త ఉత్సాహంగా ఆనందంగా చేస్తాం. శ్రమగా కూడా భావించం. ఒక్కసారిగా బాధలన్నీ మరిచిపోయి కాసేపు తేలికైపోతాం. అలాంటి డ్యాన్స్‌ని చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందచ్చట. అంతేగాదు కొన్ని రకాల రుగ్మతల నుంచి బయటపడేలా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. బాడీ ఫిట్‌నెస్ కోసం నృత్యానికి మించిన వర్కౌట్ లేదని చెబుతున్నారు. అదెలాగో సవివరంగా తెలుసుకుందాం.
నృత్యం చేసినప్పుడు శరీరాన్ని కదిలించడమే గాక మెదడుకు పని కల్పిస్తుంది. దీంతో మెదడుకు ఓ చక్కని వ్యాయామం అందుతుంది. నృత్యంలో బ్యాలెన్స్కి, కొన్ని స్టెప్‌లు గుర్తుంచుకునేందుకు తగ్గట్టుగా మెదడులో షార్ప్‌గా అవ్వడం మొదలవుతుందని న్యూరో సర్జర్ ఆదిత్య గుప్తా చెబుతున్నారు. నృత్యం మనసును ఏకాగ్రతతో వ్యవహరించేలా చేస్తుంది. జ్ఞాపకశక్తికి వ్యాయామంగా ఉంటుంది. బీట్‌లకు తగ్గట్టు కాళ్లు, చేతులు తిప్పేలా మల్టీ టాస్క్ చేస్తారు.
ఇది అభిజ్ఞా క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పార్కిన్సన్స్‌తో బాధపడుతున్న రోగులకు డ్యాన్స్ చికిత్సగా కూడా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే..? ఇది చూస్తూ.. వింటూ అనుకరిస్తూ తన శరీరాన్ని కదుపుతుంటారు కాబట్టి..నెమ్మదిగా బ్రెయిన్ ఆలోచించడం ప్రారంభిస్తుంది. ఇది అధ్యయనంలో కూడా తేలింది. అంతేగాదు వృద్ధులపై జరిపిన అధ్యయనంలో కూడా మెరుగరైన ఫలితాలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడికి చెక్ పెడుతుంది..
డ్యాన్స్ ఒత్తడిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎండార్ఫిన్‌ల విడుదల ద్వారా మానసిక స్థితిని మెరుగుపరిచి మంచి అనుభూతిని కలిగించేలా చేస్తుంది. డ్యాన్స్ మూవ్‌మెంట్‌లు డిప్రెషన్, యాంగ్జయిటీని తగ్గిస్తుంది. జీవన నాణ్యత, వ్యక్తుల మధ్య అభిజ్ఞా నైపుణ్యాలను పెంచుతుందని పరిశోదన పేర్కొంది.
ఇతర ఆరోగ్య ప్రయోజనాలు..
ఆరోగ్యంగా దృడంగా ఉండేందుకు బెస్ట్ వర్కౌట్ డ్యాన్స్. రెగ్యూలర్ డ్యాన్స్ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాల బలాన్ని పెంచుతుంది.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఊపిరితిత్తులు మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది.
నృత్యం శ్యాసకోశ వ్యవస్థను కూడా మెరుగ్గా ఉంచుతుంది.
బరువు నిర్వహణలో సహాయపడుతుంది
బాడీ మంచి ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెచింగ్ ఉండేందుకు ఉపకరిస్తుంది.
ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
(చదవండి: రాయల్ సెల్ఫీ: వందేళ్లక్రితమే భారత్‌లో సెల్ఫీ ఉందని తెలుసా..!)
Comments
Please login to add a commentAdd a comment