ఆవలింత పెద్దదైతే మెదడు కూడా పెద్దదే!
న్యూయార్క్: ఆవలింతలు, మెదడు పరిమాణాల మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 29 రకాల క్షీరదాలపై పరిశోధన చేసి వారు ఈ విషయం తేల్చారు. ఒక్కో ఆవలింత సమయం ఎక్కువగా ఉంటే, వాటి మెదడు పెద్దగా ఉన్నట్లట. అమెరికాలోని స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ వారు పరిశోధనలో క్షీరదాల ఆవలింతల సగటు సమయాన్ని నమోదు చేశారు. మెదళ్ల బరువును ముందుగానే తీసుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. మెదడు బరువుతోపాటు, వల్కలం అనే భాగంలోని నాడీ కణాల సంఖ్యమీద ఆధారపడి ఆవలింత సమయం ఉంటుందన్నారు.