‘సండే యా మండే... రోజ్ ఖావ్ అండే’ అనేది ఉత్త ప్రచార నినాదమే కాదు, శాస్త్రీయ వాస్తవం కూడా. ప్రతిరోజూ కనీసం ఒక గుడ్డు తింటున్నట్లయితే పిల్లల్లో మెదడు పనితీరు మెరుగుపడుతుందని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వరుసగా ఆరునెలలు ప్రతిరోజూ కనీసం ఒక గుడ్డు చొప్పున తినే పిల్లల మెదడు పనితీరు గణనీయంగా మెరుగుపడినట్లు గుర్తించామని వాషింగ్టన్ వర్సిటీ శాస్త్రవేత్త లోరా ఇయానోటి వెల్లడించారు. పాలు, పప్పుధాన్యాలు, గింజలు మాదిరిగానే గుడ్లు కూడా పిల్లల ఎదుగుదలకు బాగా దోహదపడతాయని తెలిపారు. గుడ్డులో ఉండే ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజలవణాల తో పాటు కీలకమైన డీహెచ్‌ఏ, కోలిన్ అనే సూక్ష్మ పోషకాలు మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపుతాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment