ప్రాణాలను పీల్చిపిప్పిచేసే మాదకద్రవ్యాలకు హైదరాబాద్ అడ్డాగా మారింది. దేశవిదేశాల నుంచి స్మగ్లింగ్ అయ్యే కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్‌కు హబ్‌గా మారింది. సినిమా నటుల నుంచి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సంపన్నవర్గాల పిల్లలదాకా ఈ డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు చెందినవారు వివిధ మార్గాల ద్వారా డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలించి వీరికి అందజేస్తున్నారు. అంతేగాకుండా ఇక్కడికి వస్తున్న మాదకద్రవ్యాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. యువత ప్రాణాలను పీల్చిపిప్పిచేసే మాదకద్రవ్యాలకు హైదరాబాద్ అడ్డాగా మారింది. దేశవిదేశాల నుంచి స్మగ్లింగ్ అయ్యే కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్‌కు హబ్‌గా మారింది. సినిమా నటుల నుంచి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సంపన్నవర్గాల పిల్లలదాకా ఈ డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు చెందినవారు వివిధ మార్గాల ద్వారా డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలించి వీరికి అందజేస్తున్నారు. అంతేగాకుండా ఇక్కడికి వస్తున్న మాదకద్రవ్యాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి కూడా. ఇటీవలే దక్షిణ అమెరికా నుంచి హైదరాబాద్‌కు పొట్టలో కొకైన్ ప్యాకెట్లను పెట్టుకుని స్మగుల్ చేస్తూ మూసా అనే మహిళ పట్టుబడిన విషయం తెలిసిందే. మూసా దొరికింది కాబట్టి ఈ విషయం అందరికీ వెల్లడైంది. బయటకు తెలియకుండానే హైదరాబాద్ మాదకద్రవ్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఏటా దాదాపు 50 మంది స్మగ్లర్లు (మాదకద్రవ్యాల రవాణాలో ఆరితేరిన వారు) దక్షిణ అమెరికా దేశాల నుంచి వివిధ పద్ధతుల్లో కొకైన్, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలను హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు.
Published Fri, Sep 11 2015 7:46 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement