ఎక్కడైనా కిలో, పది కిలోల కొకైన్ పట్టుబడటం చూశాం. కానీ ఫ్రాన్సులో కస్టమ్స్ ఏజెంట్లు ఏకంగా 1.3 టన్నుల కొకైన్ను స్వాధీనం చేసుకుని రికార్డు సృష్టించారు. వెనిజులా నుంచి ప్యారిస్ వచ్చిన ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో ఇది ఉన్నట్లు ఫ్రెంచి అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది.
చార్లెస్ డి గాలీ విమానాశ్రయానికి వచ్చిన కార్గో విమానంలో పలు సూట్కేసులలో ఈ కొకైన్ ఉంది. దీని విలువ దాదాపు 433 కోట్ల రూపాయలు!! కారకాస్ నుంచి ఈ విమానం ప్యారిస్ వచ్చింది. ఫ్రాన్సుకు తమ దేశంనుంచి కొకైన్ స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించింది ఎవరో తెలుసుకోడానికి తాము దర్యాప్తు చేయనున్నట్లు వెనిజులా అటార్నీజనరల్ కార్యాలయం తెలిపింది. డ్రగ్స్ రవాణాను అడ్డుకోడానికి అంతర్జాతీయ ఒప్పందాలపై వెనిజులా తగినవిధంగా స్పందించడంలేదని అమెరికా ఇటీవలే ఆరోపించింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా కొకైన్ను ఉత్పత్తి చేసే కొలంబియాతో వెనిజులాకు 2,200 కిలోమీటర్ల సరిహద్దు ఉంది!!
ఫ్రాన్సులో 1.3 టన్నుల కొకైన్ స్వాధీనం
Published Mon, Sep 23 2013 10:33 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM
Advertisement