
అవి వాడారో.. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది
న్యూయార్క్: కొకైన్, మత్తుపానీయాలువంటి మత్తుపదార్థాలు వాడే వారికి ఆత్మహత్య గండం ఉందని ఓ అధ్యయనం చెబుతోంది. ఈ రెండు అలవాట్లు ఎవరైతే కలిగి ఉన్నారో వారిలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన సామాన్య వ్యక్తులతో పోలిస్తే 2.4రెట్లు అధికమని చెప్తోంది.
అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన అల్పర్ట్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ సారా అరియాస్ 'మత్తుపానీయాలు, కొకైన్ వంటి మత్తుపదార్ధాలకు ఆత్మహత్యలకు సంబంధం ఉంది' అని అన్నారు. ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన 874 మంది జాబితాను తీసుకొని వాటిని విశ్లేషించి ఈ వివరాలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు.