
కర్నూలు(సెంట్రల్): నాన్నా తాగొద్దు. అమ్మను బాగా చూసుకో అంటూ లెటర్ రాసి పెట్టి బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కల్లూరులోని జానకీ నగర్‌కు చెందిన విజయకుమార్ జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి అనారోగ్య సమస్యలతోపాటు ఇంట్లో తండ్రి మందుకు అలవాటుపడడంతో చదువుపై దృష్టి సారించలేకపోయేవాడు. ఈక్రమంలో శుక్రవారం ఇంట్లో వాళ్లు బంధువుల ఇంటికి వెళ్లడంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొనిఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలుతెలియాల్సి ఉంది.