కొకైన్ కేసులో హీరోకు పోలీస్ కస్టడీ | Actor, 4 others held on drug charge sent to police custody | Sakshi
Sakshi News home page

కొకైన్ కేసులో హీరోకు పోలీస్ కస్టడీ

Published Thu, Feb 5 2015 9:29 PM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

కొకైన్ కేసులో హీరోకు పోలీస్ కస్టడీ

కొకైన్ కేసులో హీరోకు పోలీస్ కస్టడీ

కొచ్చి: కొకైన్ కలిగి ఉన్నకేసులో అరెస్టయిన మళయాళ చిత్ర నటుడు షినే టామ్ చాకోతో పాటు నలుగురు మహిళలను పోలీసు కస్టడీకి అప్పగించారు. ఈ నెల 10 వరకు వారికి పోలీస్ రిమాండ్ విధిస్తూ స్థానిక న్యాయస్థానం ఆదేశించింది. మహిళలల్లో ముగ్గురు మోడల్స్, ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు.

కొచ్చిలోని ఓ ప్లాట్లో ఇటీవల షినే టామ్ చాకోతో పాటు నలుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. వీరి దగ్గర స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. చాకో అసిస్టెంట్ డైరెక్టర్గా తన కేరీర్ని ప్రారంభించి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తు వచ్చాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement