డ్రగ్స్ పట్టివేత, సినీ నిర్మాతతో పాటు నైజీరియన్ల అరెస్ట్ | tollywood producer sushanth reddy, two Nigerians held with cocaine | Sakshi
Sakshi News home page

డ్రగ్స్ పట్టివేత, సినీ నిర్మాతతో పాటు నైజీరియన్ల అరెస్ట్

Published Tue, Feb 24 2015 8:17 AM | Last Updated on Wed, Oct 17 2018 5:28 PM

డ్రగ్స్ పట్టివేత, సినీ నిర్మాతతో పాటు నైజీరియన్ల అరెస్ట్ - Sakshi

డ్రగ్స్ పట్టివేత, సినీ నిర్మాతతో పాటు నైజీరియన్ల అరెస్ట్

హైదరాబాద్: హైదరాబాద్లో మరో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. జూబ్లీహిల్స్లో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్లను జూబ్లిహిల్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం  ఫిలింనగర్ రోడ్డు నెంబర్ 1లో యువ నిర్మాత సుశాంక్ రెడ్డి, మరో సినీ ప్రముఖుడికి శనివారం రాత్రి ఇద్దరు నైజీరియన్లు డ్రగ్స్ అందచేయడానికి వచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.

 

ఈ మేరకు యువ నిర్మాతతో పాటు మరో ప్రముఖుడిని, ఇద్దరు నైజీరియన్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిని త్వరలో మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. నైజీరియన్ల వద్ద లభించిన లాప్ ట్యాప్, సెల్ఫోన్ డాటా ఆధారంగా మరి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement