'డ్రగ్స్ ముఠాతో సినీ పరిశ్రమకు సంబంధం లేదు' | cine industry didnt have relation with drugs gang | Sakshi
Sakshi News home page

'డ్రగ్స్ ముఠాతో సినీ పరిశ్రమకు సంబంధం లేదు'

Published Wed, Feb 25 2015 1:40 PM | Last Updated on Wed, Oct 17 2018 5:28 PM

'డ్రగ్స్ ముఠాతో సినీ పరిశ్రమకు సంబంధం లేదు' - Sakshi

'డ్రగ్స్ ముఠాతో సినీ పరిశ్రమకు సంబంధం లేదు'

 హైదరాబాద్ జూబ్లీహిల్స్లో  డ్రగ్స్తో పట్టుబడ్డ ముఠాను వెస్ట్జోన్ పోలీసులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. వెస్ట్జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు డ్రగ్స్ ముఠా వివరాలను వెల్లడించారు.  నలుగురు నైజీరియన్లతో పాటు మరో ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి 90 గ్రాముల కొకైన్తో పాటు, 40 ప్యాకెట్ల గంజాయిని, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

కాగా పట్టుబడ్డవారిలో నల్గొండ జిల్లాకు చెందిన సుశాంత్ రెడ్డి  ఓ సినిమాకు దర్శకత్వం వహించారని అలాగే అదే జిల్లాకు చెందిన పనాస రవి కూడా సినీ రంగానికి సంబంధించి వ్యక్తి అని తెలిపారు. వీరిద్దరు తప్ప... సినిమా రంగానికి చెందినవారితో డ్రగ్స్ ముఠాకు ఎలాంటి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లేవన్నారు. ఆధారాలు లేకుండా తాము మాట్లాడలేమని ఆయన తెలిపారు.  

నిందితుల్లో నలుగురు నైజీరియన్లు ఇక్కడే ఉంటూ నిజాం కళాశాలలో చదివారని, వారిలో ఒకరికి వీసా గడువు పూర్తయినా  ఇక్కడే ఉంటూ డ్రగ్స్ అమ్ముతున్నారని డీసీపీ పేర్కొన్నారు.  పట్టుబడ్డ నైజీరియన్స్‌ కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ...టాలీవుడ్తో ఎలాంటి సంబంధాలు లేవని తేల్చారు. కాగా ఈ కేసులో యువ నటుడు నందు పేరు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇవన్ని అవాస్తవాలేనని నందు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement