ఎయిర్ పోర్టులో భారీగా కొకైన్ పట్టివేత
న్యూయార్క్: భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు అక్రమరవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాయశ్రయంలో కస్టమ్స్ అండ్ బొర్డర్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీటి బరువు 10 కిలోలకు పైగా ఉందని, కొకైన్ విలువ రూ. 2.6 కోట్లకు పైగా ఉంటుందని కస‍్టమ్స్ అధికారులు గురువారం వెల్లడించారు. గత నెలలోనూ ఇదే తరహాలో మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, తరచుగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. స్మగ్లింగ్ కొంత పుంతలు తొక్కుతుందని, దీనిని అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.
ఎవరికీ ఏ అనుమానం రాకుండా బ్యాగుల్లో, వస్తువుల్లో దాచకుండా శరీరానికి అట్టిపెట్టుకుని ఉండేలా కొకైన్ ను డ్రగ్స్ ముఠా సభ్యులు అమర్చుకున్నారు. డొమినికన్ రిపబ్లిక్ నుంచి ఈ వ్యక్తులు ఒకే విమానంలో న్యూయార్క్ కు రాగా, వారి కదలికలపై అనుమానం వచ్చి తనిఖీలు చేశారు. తొడ నుంచి దాదాపు పాదాలకు పైభాగం వరకూ కవర్లలో నింపి ఉంచిన కొకైన్ ను దాచి తరలిస్తున్నట్లు గుర్తించి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫెడరల్ నార్కోటిక్స్ వీరిపై స్మగ్లింగ్ కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. గత నెలలో మాదకద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి 668 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
Not one, but two 'busted' out of their pants...on the same flight by #JFK @CustomsBorder read the story herehttps://t.co/lFtSy9pMFO pic.twitter.com/ss6NUqZdVk
— CBP New York City (@CBPNewYorkCity) 26 April 2017