JFK Airport
-
అన్ని తనిఖీలు దాటుకుని ఎంచక్కా పారిస్‌కు
న్యూయార్క్/పారిస్: అమెరికా. నిఘా నేత్రాలమయం. అక్కడ మన లాంటి భారతీయులు రోడ్లపై తిరుగుతున్నా అనుమానమొస్తే పోలీసులు మొత్తం ఆరాతీస్తారు. సంబంధిత గుర్తింపు కార్డులు చూపిస్తేనే వదిలేస్తారు. లేదంటే పోలీస్‌స్టేషన్‌కు పోవాల్సిందే. మరి అలాంటిది అంతర్జాతీయ విమానాశ్రయంలో నేరుగా విమానం ఎక్కనిస్తారా?. అస్సలు కుదరదు. పాస్‌పోర్ట్, వీసా, ఐడీ కార్డులు, లగేజీ తనిఖీలు, నిషేధిత వస్తువుల లేకుండా చూసుకోవడం.. వంటివన్నీ పూర్తిచేసుకుంటేనే బోర్డింగ్ పాస్ చేతికొస్తుంది. విమానంలోకి అడుగుపెట్టగలం. అలాంటిది ఒక మధ్యవయస్కురాలు ఇవేం లేకుండా నేరుగా విమానం ఎక్కేసింది. అదేదో మారుమూల విమానాశ్రయంలో అంతరాష్ట్ర విమానమో ఆమె ఎక్కలేదు. నేరుగా అంతర్జాతీయ విమానమే ఎక్కింది. న్యూయార్క్ నగరం నుంచి ఫ్రాన్స్‌లోని పారిస్‌కు చేరుకుంది. దీంతో అత్యంత కట్టుదిట్ట భద్రత అని చెప్పుకునే అమెరికా ఎయిర్‌పోర్ట్‌లోనూ డొల్ల వ్యవస్థ ఉందని ఆమె పరోక్షంగా నిరూపించింది. ఎక్కడా ఎవరికీ చిక్కుకుండా పారిస్‌లో దిగి ఎయిర్పోర్ట్ బయటకు వెళ్దామని ఆశించి భంగపడింది. ఫ్రాన్స్‌లో విమానం ల్యాండ్ అయ్యాక దొరికిపోయింది. అమెరికా ఎయిర్పోర్ట్ వ్యవస్థ పరువుతీసిన ఈ మహిళ గురించే ఇప్పుడు ఎయిర్‌లైన్స్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డెల్టా ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యం వల్లే ఆమె ఖండాంతయానం చేయగలిగిందని కొందరు ఆరోపిస్తున్నారు. అమెరికా ఎయిర్పోర్ట్ అథారిటీ వర్గాలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాయి. తప్పు ఎక్కడ జరిగిందని కూపీలాగుతున్నాయి. ఈమె ఊరు పేరు ఇతరత్రా వివరాలను అధికారులు బయటపెట్టలేదు. ఏం జరిగింది? ఎలా జరిగింది? ట్రాన్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చి న వివరాల ప్రకారం గత మంగళవారం న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన జరిగింది. 55–60 ఏళ్ల మహిళ టికెట్, ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. అక్కడ రెండు చోట్ల ఐడెంటిటీని చెక్ చేసే గుర్తింపు కేంద్రాలను ఒడుపుగా దాటేసింది. తర్వాత అనుమానాస్పద వస్తువులను తనిఖీచేసే సెక్యూరిటీ చెక్పాయింట్లనూ దాటింది. తర్వాత బోర్డింగ్ పాస్ జారీచేసే చోటు నుంచి తెలివిగా ఆవలి వైపునకు వచ్చేసింది. రన్‌వే మీద నిలిచి ఉన్న విమానం దాకా ప్రయాణికులను తీసుకెళ్లే బస్సును ఎక్కేసింది. తర్వాత విమానం తలుపు దగ్గర ఎయిర్‌హోస్టెస్ స్వాగత పలకరింపులు, పరిచయాలను పూర్తిచేసుకుని లోపలికి ప్రవేశించింది. నిండుగా ఉన్న విమానంలో ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండదుకాబట్టి బాత్రూమ్లోకి వెళ్లి దాక్కుంది. అంతా సవ్యంగా ఉండటంతో విమానం గాల్లోకి ఎగిరింది. ఫ్రాన్స్‌లోని ఛార్లెస్ డి గాలే ఎయిర్పోర్ట్ పార్కింగ్ పాయింట్ వద్ద విమానం ఆగిన తర్వాత విమానంలోనే ఈమెను అధికారులు గుర్తించారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న న్యూయార్క్ సిటీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రాబ్ జాక్సన్ ఇంకొన్ని వివరాలను వెల్లడించారు. విమానంలో సీట్లో కూర్చోకుండా ఒక బాత్రూమ్ నుంచి ఇంకో బాత్రూమ్లోకి మారుతూ అటూ ఇటూ తిరుగుతున్న ఈమె వాలకం చూసి విమానసిబ్బందికి అనుమానమొచ్చింది. ఈమెను ఆపి ప్రశ్నించేలోపు ఇంకో బాత్రూమ్లో దూరి గడియపెట్టుకుంది. దీంతో ఫ్రాన్స్‌లో దిగాక పైలట్ వెంటనే ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారమిచ్చాడు. ఏ ఉగ్రవాది నక్కాడో అని ప్రయాణికులు భయపడతారనే ఉద్దేశ్యంతో వాళ్లకు ఏమీ చెప్పలేదు. ‘‘అందరూ మీమీ సీట్లలో ప్రశాంతంగా కూర్చోండి. మన విమానంలో అదనపు అతిథి ఉన్నారు. పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు’’అని ప్యాసింజర్లను ప్రశాంతపరిచాడు. చివరకు పోలీసులు వచ్చి ఈమెను అరెస్ట్‌చేసి విచారణ మొదలెట్టారు. అమెరికా గ్రీన్‌కార్డ్.. విమానంలో చొరబడిన ఈమెకు అమెరికా గ్రీన్‌కార్డ్ ఉందని, రష్యా పాస్‌పోర్ట్ ఉందని మీడియాలో వార్తలొచ్చాయి. అమెరికాలో ఉండే ఉద్దేశంలేక కావాలనే ఫ్రాన్స్ శరణుకోరు తూ శరణారి్థగా ఇక్కడికి అక్రమంగా వచ్చిం దని మరో కథనం వెలువడింది. ఆమె మానసిక స్థితి గురించి ఇంకా వివరాలు తెలియరాలేదు. అనుమతిలేకుండా విమానం ఎక్కి సేవల దుర్వినియోగం, దేశం దాటి రావడం, ఇతరత్రా సెక్షన్ల కింద కేసులు మోపి ఫ్రాన్స్ జైళ్లో పడేయొచ్చు. లేదంటే అమెరికాకే తిరిగి పంపొచ్చు. అప్పుడు అమెరికా చట్టాల ప్రకారం శిక్ష పడే వీలుంది. డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించడంతో తమ వైపు సెక్యూరిటీ చెక్ విషయంలో ఏం లోపాలు జరిగాయో తెల్సుకునేందుకు విమానయాన సంస్థ ఈమెను ప్రశ్నించే వీలుంది. అమెరికాకు తిరిగొస్తే జేకేఎఫ్ ఎయిర్పోర్ట్ అధికారులు ఆమెను విచారించే అవకాశముంది. గత మంగళవారం థ్యాంక్స్‌గివింగ్ హాలిడే రోజు అమెరికా ఎయిర్‌పోర్ట్‌లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. అమెరికాలో ఆ ఒక్కరోజే 27 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. ఆ రద్దీని ఈమె తనకు అనువుగా మలుచుకుని ఉంటుందని భావిస్తున్నారు. -
మీ దేశానికి వెళ్లిపోండి.. అమెరికాలో ఎన్నారైపై దాడి
అమెరికాలో ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తోన్న ఓ ప్రవాస భారతీయుడిపై న్యూయార్క్‌లో దాడి జరిగింది. అంతేకాదు ఎన్నారైని ఉద్దేశించి జాత్యాహాంకర వ్యాఖ్యలకు దిగాడు. దీంతో దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు అవగా బాధితుడికి అండగా భారతీయ సంఘాలు నిలబడ్డాయి. ఈ ఘటకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. అమెరికాలో దాడికి సంబంధించిన వివరాలను హిందూ పత్రిక ప్రచురించింది. హిందూ తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌కి చెందిన ఓ యువకుడు అమెరికాలో ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. జనవరి 3న జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4 దగ్గర తన కారును పార్క్ చేశారు. ఇంతలో కస్టమర్ రావడంతో కారును ముందుకు కదిపేందుకు ప్రయత్నించగా అక్కడ మరో ట్యాక్సీ నిలిపి ఉంది. వెంటనే కారు దిగిన సింగ్.. తన కారు వెళ్లేందుకు వీలుగా ముందున్న కారును పక్కకు తీయాలంటూ అందులో ఉన్న వ్యక్తిని కోరాడు. సింగ్ కారు దిగడం ఆలస్యం కారులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా దాడికి దిగాడు. ముఖం, ఛాతిపై పంచ్‌లు విసిరాడు. దాడికి పాల్పడుతూనే సింగ్ తలకు ఉన్న టర్బన్‌ను తీసేందుకు ప్రయత్నించాడు. ‘ టర్బనేడ్ పీపుల్, గో బ్యాక్ టూ యువర్ కంట్రీ ’ అంటూ జాత్యాంహార వ్యాఖ్యలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లి పోయాడు. జరిగిన ఘటనపై సింగ్ వెంటనే ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో ఉన్న పోర్టు అథారిటీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేశాడు. అయితే సింగ్‌పై దాడి చేసిన వ్యక్తి ఎవరనేది స్పష్టంగా తెలియడం లేదు. దీంతో ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న సిక్కు కమ్యూనిటీల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ విషయంలో బాధితుడికి న్యాయం జరిగేందుకు వీలుగా ఒక డిటెక్టివ్, న్యాయవాదిని నియమించారు. చదవండి: దేశమేదైనా అండగా మేమున్నాం -
ఎయిర్ పోర్టులో భారీగా కొకైన్ పట్టివేత
న్యూయార్క్: భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు అక్రమరవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాయశ్రయంలో కస్టమ్స్ అండ్ బొర్డర్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీటి బరువు 10 కిలోలకు పైగా ఉందని, కొకైన్ విలువ రూ. 2.6 కోట్లకు పైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు గురువారం వెల్లడించారు. గత నెలలోనూ ఇదే తరహాలో మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, తరచుగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. స్మగ్లింగ్ కొంత పుంతలు తొక్కుతుందని, దీనిని అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరికీ ఏ అనుమానం రాకుండా బ్యాగుల్లో, వస్తువుల్లో దాచకుండా శరీరానికి అట్టిపెట్టుకుని ఉండేలా కొకైన్ ను డ్రగ్స్ ముఠా సభ్యులు అమర్చుకున్నారు. డొమినికన్ రిపబ్లిక్ నుంచి ఈ వ్యక్తులు ఒకే విమానంలో న్యూయార్క్ కు రాగా, వారి కదలికలపై అనుమానం వచ్చి తనిఖీలు చేశారు. తొడ నుంచి దాదాపు పాదాలకు పైభాగం వరకూ కవర్లలో నింపి ఉంచిన కొకైన్ ను దాచి తరలిస్తున్నట్లు గుర్తించి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫెడరల్ నార్కోటిక్స్ వీరిపై స్మగ్లింగ్ కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. గత నెలలో మాదకద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి 668 కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. Not one, but two 'busted' out of their pants...on the same flight by #JFK @CustomsBorder read the story herehttps://t.co/lFtSy9pMFO pic.twitter.com/ss6NUqZdVk — CBP New York City (@CBPNewYorkCity) 26 April 2017 -
కుక్క బోనులో పది కిలోల హెరాయిన్
న్యూయార్క్: కుక్క బోనులో పది కిలోల హెరాయిన్‌ను దొంగచాటుగా తరలించేందుకు ప్రయత్నిస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు దొరికిపోయారు. బ్రాంక్స్ ఏరియాకు చెందిన శామ్యూల్ సీబ్రూక్స్(35), కార్మెల్‌కు చెందిన బెటన్కోర్ట్ మొరేల్స్(27) మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ న్యూయార్క్‌లో పట్టుబడడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సీబ్రూక్స్, బెటన్కోర్ట్ మొరేల్స్ ఇద్దరూ బ్రాంక్స్‌లోని ఓ హోటల్లో శుక్రవారం రాత్రి కలుసుకున్నారు. ఇద్దరూ వేర్వేరు వాహనాల్లో న్యూయార్క్ కెన్నడీ ఎయిర్‌పోర్టులోని పార్సిల్ సర్వీస్ కౌంటర్ వద్దకు చేరుకున్నారు. ప్యూర్టోరికో నుంచి బోనుతో సహా వచ్చిన లాబ్రడార్ జాతి కుక్క పార్సిల్‌ను వారు తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం మొదటగా బెటన్కోర్ట్ మొరేల్స్ లోపలికి వచ్చి కౌంటర్ వద్ద సంతకం చేసి, పార్సిల్‌ను తీసుకోబోయాడు. అయితే, వీరి కదలికలపై కన్నేసి ఉంచిన నిఘా వారు.. లగేజీని క్షుణ్నంగా తనిఖీ చేశారు. కుక్క బోనును పరీక్షగా చూడగా అడుగున ప్రత్యేకంగా ఉన్న అరలో దాచిన పది పొట్లాల్లో ఉన్న పది కిలోల హెరాయిన్ బయటపడింది. ఈ మేరకు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎక్కడి నుంచి, ఎవరి నుంచి కొనుగోలు చేసి తీసుకువస్తున్నారో తెలుసుకునే పనిలో ఉన్నారు. దేశంలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలను తీసుకువస్తున్న నేరం కింద వారిద్దరికీ సుమారు 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తెలిపింది.