Women Harassment
-
‘చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు’
తాడేపల్లి, సాక్షి: ఏపీలో మహిళలపై ఆకృత్యాలు పెరిగాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల కూటమి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మంగళవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ‘‘అఘాయిత్యాలను అరికట్టడంలో కూటమి సర్కార్ విఫలమైంది. ప్రభుత్వ పెద్దలకు కనీస సామాజిక బాధ్యత లేదు. ఏపీలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. కూటమి పాలనలో మహిళల మాన ప్రాణాలకు విలువే లేదు. చీకటికాలంగా మారింది. ప్రతిరోజూ ఏదో ఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నేరస్తులకు అంత ధైర్యం ఎక్కడ నుండి వస్తోంది?. మహిళల కోసం ప్రభుత్వం ఏమీ చేయటం లేదు. ప్రత్యర్ధి పార్టీలను వేధించటానికే పోలీసులను వాడుకుంటున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబుకు కాస్త కూడా బాధ లేదు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వేధింపులు తట్టుకోలేక బాధిత మహిళ పక్క రాష్ట్రం వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టింది. పిఠాపురంలో మహిళ అత్యాచారానికి గురైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు పరామర్శించలేదు?. హిందూపురంలో అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగితే బాలకృష్ణ ఎందుకు పట్టించుకోలేదు? ఆయనకు బాధ్యత లేదా?. తెనాలి యువతిపై అఘాయిత్యం వెనుక టీడీపీ నేతలు ఉన్నారు. ఇన్ని జరుగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు?. ఒక మహిళగా, ఒక తల్లిగా కూడా హోంమంత్రి స్పందించరా?. ..టీడీపీ నేత ఖాదర్‌బాషా రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా చర్యలు ఎందుకు తీసుకోలేదు?. అనురాధ అనే అమ్మాయిపై యాసిడ్ దాడి జరిగితే హైకోర్టు రూ. ఐదు లక్షలు పరిహారం ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. రిషితేశ్వరి ఘటనలో దోషిగా ప్రిన్సిపాల్‌పై కేసు కూడా పెట్టలేదు. వైస్సార్సీపీ నేతలు ధర్నాలు చేస్తేగానీ అరెస్టు చేయలేదు. వనజాక్షి విషయంలో కూడా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదు. వైఎస్సార్సీపీ హయాంలో దిశ యాప్ తీసుకొచ్చాం. దిశ యాప్ ద్వారా ఎందరో మహిళలకు న్యాయం జరిగింది. రాజకీయ దురుద్దేశంతో దిశ చట్టాన్ని పక్కన పెట్టేశారు. వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందని దిశ చట్టంపరై బురదజల్లారు. దిశా యాప్ ద్వారా 13,600 మంది రక్షణ పొందారు. అలాంటి గొప్ప యాప్‌ని చంద్రబాబు తొలగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే 74 మందిపై అత్యాచారాలు జరిగాయి. ఆరుగురిని హత్య చేశారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ మళ్ళీ విజృంభిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పిల్లలకు మంచి చదువులు దూరం అయ్యాయి. మంచి తిండి దూరం అయింది. చివరికి మంచినీరు కూడా దొరకక డయేరియా వ్యాపించే పరిస్థితి తెచ్చారు. మహిళలపై దాడులను ప్రజాక్షేత్రంలో ఎండగడుతాం. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం’’ అని అన్నారు. -
కోల్‌కతా నుంచి కేరళ వరకు...
కేరళతో మొదలుపెట్టి కోల్‌కతా దాకా... దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై దాష్టీ కపు వార్తలే. ఇవన్నీ దేశంలో మహిళల స్థితిని ఎత్తిచూపుతున్నాయి. అదే సమయంలో రాజకీయాల నిర్లిప్తత, వ్యవస్థల వైఫల్యమూ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి.మలయాళ చిత్ర పరిశ్రమ చీకటి కోణాలు కాస్తా హేమ కమిటీ రిపోర్టుతో బట్టబయలయ్యాయి. నటులు, దర్శకులు, సినీ రంగంలోని అన్ని వర్గాల ప్రతినిధులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వార్తలను చూస్తే, ‘అయ్యో’ అనిపి స్తోంది. అధ్వాన్నమైన విషయం ఇంకోటి ఉంది. మహిళకు సమానత్వం, మర్యాద, స్వేచ్ఛ, భద్రత అన్న సిద్ధాంతాన్ని నమ్మిన ఒక్క రాజకీయ పార్టీ లేకపోవడం! ఇదే విషయం మిత్రుడైన ఓ రాజకీయ నేతతో చెబితే... ‘‘మహిళలపై దౌర్జన్యం విషయాల్లో వాళ్లు, వీళ్లు అని ఏమీ లేదు. సొంత ప్రయోజనాలే వారికి పరమావధి’’ అని సమాధానమిచ్చాడు. నిత్యంకించపరిచే వ్యాఖ్యలు వింటూండే మహిళ రాజకీయ నేతలు కూడా పార్టీ అగ్రనేతల హుకుంలకు కట్టుబడ్డారేమో తెలియదు కానీ... గట్టిగా మాట్లాడతారని ఆశించినవాళ్లు కూడా నోళ్లు మెదపలేని స్థితిలో ఉన్నారు. బాధితు లకు రక్షణగా ఉండటం కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని అనిపించిందేమో వారికి!కోల్‌కతా ‘అభయ’కు న్యాయం దక్కుతుందని నాకైతే అనిపించడం లేదు. ఇలా చెప్పేందుకూ నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కేసులో అక్కడి ఘోరకలి సమగ్రంగా ప్రపంచానికి తెలుస్తుందన్న నమ్మకమూ సన్న గిల్లుతోంది. కాలేజీ అధికారులు బాధితురాలి తల్లిదండ్రులకు చేసిన మూడు ఫోన్ కాల్స్ వివరాలు మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. దీన్నిబట్టే ఈ కేసు వివరాలపై గోప్యత ఎంతన్నది స్పష్టమైంది.ఆర్జి కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా సందీప్ ఘోష్ చలాయించిన అధికారాన్ని అర్థం చేసుకుంటే.. ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఈయన వేధింపులు తట్టుకోలేక ఇద్దరు కాలేజీ ఇంటర్న్లు ఆత్మ హత్య చేసుకుందామని అనుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. కాలేజీ మాజీ అధికారి అఖ్తర్ అలీ ఆరోపణల ప్రకారం సందీప్ ఘోష్ మృత దేహాలతో వ్యాపారం చేసేవాడు. అవయవాల రాకెట్‌నూ నడిపేవాడు. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. ఒక వ్యక్తిని కాపాడేందుకు ఇన్ని పనులు ఎందుకు చేస్తున్నారు? సందీప్ ఘోష్ తరఫున వాదించేందుకు ప్రభుత్వం న్యాయ వాదిని నియమించడం ఏమిటి?ఈ ఘటనను రాజకీయంగా వాడుకోలేదా? అందరూ వాడుకున్నారు. రాళ్లు రువ్వడంతో దేబాశీష్ చక్రవర్తి లాంటి పోలీసు కనుచూపు కోల్పోయే పరిస్థితి వచ్చింది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటా మాటా నడుస్తోంది. ఇందు కేనేమో... ఆందోళన చేస్తున్న వైద్యులు ఈ రెండు పార్టీల వారు ఎవరూ తమ పరిసరాల్లో లేకుండా జాగ్రత్త పడ్డారు. ‘అభయ’లాంటి ఘటన జరిగిన తరువాత చేసిన వ్యాఖ్యలు తప్పేనని తృణమూల్ పార్టీ హుందాగా తమ తప్పు ఒప్పుకుని ఉండాల్సింది. కొద్ది రోజులపాటు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి... ఆ తరువాత ఒక్క పళంగా విరుచుకుపడింది. ఒకరి ద్దరు పార్టీ ప్రతినిధులు నోటికి ఏదొస్తే అది మాట్లా డేశారు. ఈ క్రమంలోనే ఓ ఎంపీని నా కార్యక్రమం నుంచి వెళ్లిపొమ్మని అడగాల్సి వచ్చింది. ముప్ఫై ఏళ్ల నా వృత్తి జీవితంలో నేను ఇలా ఎన్నడూ చేయలేదు. పశ్చిమ బెంగాల్ ఘటనకు బాధ్యత టీఎంసీదైతే... హేమ కమిటీ నివేదిక పుణ్యమా అని కేరళ సినీ రంగం లేవనెత్తుతున్న ప్రశ్నలకు అక్కడి లెఫ్ట్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జస్టిస్ కె.హేమ కమిటీ తన నివేదికను సిద్ధం చేసేందుకు ఏకంగా ఐదేళ్ల సమయం పట్టింది. ఈ నివేదిక బయటపడటంతో చాలామంది మహిళా ఆర్టిస్టులు ఇప్పుడు పోలీసులకూ, టాస్క్ఫోర్స్కూ ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. ఈ మలయాళ ‘మీ టూ’ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న నటీమణులు రేవతి, పార్వతి చెప్పిన దాని ప్రకారం... ఈ కేసులో అటు రాజకీయ నేతలు, ఇటు సినిమా శక్తులు వాస్తవాలను తొక్కి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు వర్గాలూ కలిసిపోయే అవకాశమూ లేకపోలేదని వాళ్లు అంటున్నారు. హేమా కమిటీ నివేదికలోని 11 పేరాలను ప్రభుత్వం ఎందుకు తొలగించిందో ఇప్పటివరకూ ఎలాంటి వివరణ లేదు. గుజరాత్ ప్రభుత్వ పుణ్యమా అని బిల్కిస్ బానో రేపిస్టులు మెడలో పూలదండలతో జైల్లోంచి బయట కొచ్చారు. అభయ విషయంలో మమత ప్రభుత్వం మితిమీరిన అహంకారంతో వ్యవహరించింది. 2012 నాటి నిర్భయ ఘటనలో కాంగ్రెస్వాళ్లూ నానా చెత్తా మాట్లాడారు. ఇవన్నీ మనకు చెబుతున్నది ఏమిటి? రాజకీయ నేతలు పట్టించుకోవాలంటే, మహిళలు ఒక ఓటుబ్యాంకుగా సంఘటితం కావాలి.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
శివమొగ్గ జిల్లాలో దురాగతం.. యువతిపై లైంగికదాడి
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మృగాళ్లు ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. గాజనూరు జలాశయం వద్ద మంగళవారం సాయంత్రం ఇద్దరు యువకులతో కలిసి వచ్చిన యువతిని నలుగురు దుండగులు కిడ్నాప్ చేసి మూకుమ్మడి అత్యాచారానికి పాల్పడ్డారు.వివరాలు.. ఓ యువకుడు తన ప్రియురాలు, మరో మిత్రునితో కలిసి గాజనూరు జలాశయానికి వచ్చారు. ఈ సమయంలో నలుగురు యువకులు వారిపై దాడి చేసి కొట్టి యువతిని బెదిరించి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. సమీపంలో ఉన్న తోటలో ఆమైపె నలుగురూ లైంగిక దాడికి ఒడిగట్టారు. ఆమె ప్రియుడు, మరో యువకుడు వెళ్లి స్థానిక తుంగానగర పోలీసులకు తెలియజేయగా గాలింపు చేపట్టారు.ఒకటిన్నర రోజు తరువాత..బుధవారం అంతా గాలించినా యువతి, దుండగుల జాడ దొరకలేదు. చివరకు గురువారం ఉదయం సమీపంలోని తోటలో యువతి అపస్మారక స్థితిలో కనిపించగా ఆమె శివమొగ్గలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వినాయక, అబి, మంజు, కౌశిక్, అనే నలుగురు అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు. గాజనూరులోని ఒక ఇంటిలో నలుగురు కామాంధులు ఉన్నట్లు తెలిసి పోలీసులు దాడి చేశారు. అభి, మంజును అరెస్టు చేయగా మరో ఇద్దరు పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
రైలులో మహిళతో అనుచిత ప్రవర్తన.. ఆమె ఏం చేసిందంటే?
ఢిల్లీ: దేశంలో ఏదో ఒక చోట మహిళలు, యువతుల పట్ల కొందరు పొకిరీలు ఏదో ఒక చోట వేధింపులను గురి చేస్తూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు తెచ్చిన కొందరు మాత్రం తమ ప్రవర్తనను మార్చుకోవడం లేదు. అయితే, తాజాగా రైలు ప్రయాణంలో తనను వేధించిన ఓ వ్యక్తికి మహిళ తగిన బుద్ధి చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. రైలు ప్రయాణంలో ఓ మహిళaతో మరో ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. సదరు వ్యక్తి ఆమె పక్కనే కూర్చోని మహిళను అసభ్యకరంగా తాకాడు. దీంతో, ఆ మహిళ ఆగ్రహంతో రగిలిపోయింది. వెంటనే తన చెప్పుతో ఆ వ్యక్తి చెంపపై పలుసార్లు కొట్టింది. అతడి జుట్టు పట్టుకుని తలపై బాదింది. ఆవేశంలో అంతటితో ఆగకుండా ఆ వ్యక్తి ప్రైవేట్ భాగాలపై కూడా చెప్పుతో కొట్టింది. Kalesh b/w a Lady and a Guy inside Indian Railways over this guy was misbehaving with her pic.twitter.com/JO9g16RVDZ — Ghar Ke Kalesh (@gharkekalesh) November 24, 2023 దీంతో, ఆమె దాడిని తట్టుకోలేని అతడు సీటు నుంచి లేచి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ సీటు పైకి ఎక్కిన మహిళ ఆ వ్యక్తిని మరోసారి చెప్పుతో కొట్టింది. మిగతా ప్రయాణికులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె లెక్కచేయలేదు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
HYD: మహిళా అధికారికి వేధింపులు.. సీఐడీ ఎస్పీపై కేసు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. TSSPDCLలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మహిళా అధికారిని సీఐడీ ఎస్పీ వేధింపులకు గురిచేశాడు. తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. తెలంగాణలో సీఐడీ విభాగంలో ఎస్పీ ర్యాంకులో పనిచేస్తున్న కిషన్ సింగ్‌పై కేసు నమోదైంది. దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో టీఎస్ఎస్పీడీసీఎల్ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి సీఐడీ ఎస్పీపై ఫిర్యాదు చేసింది. తన ఫోన్‌కు సీఐడీ ఎస్పీ అసభ్యకరమైన మేసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపుతున్నారని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, అంతకుముందు.. తాను స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నానని వాటిలో పాల్గొనాలని మహిళా ఉద్యోగినికి చెప్పిన కిషన్ సింగ్.. ఆమె వద్ద నుంచి ఫోన్ నంబర్ తీసుకున్నట్టు తెలిపారు. కాగా, ఆమె ఫిర్యాదుతో కిషన్ సింగ్‌పై కేసు నమోదు చేసినట్టు చైతన్యపు పోలీసులు వెల్లడించారు. విచారణ చేపట్టినట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ట్యాంక్ బండ్‌పై కారు బీభత్సం.. హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లి.. -
కళాక్షేత్రంలో విద్యార్థినిలపై లైంగిక వేధింపులు!.. సీఎం స్టాలిన్ సీరియస్!
చెన్నై: అతను శాస్త్రీయ కళలకు పాఠాలు బోధించే అసిస్టెంట్ ప్రొఫెసర్. కానీ, హద్దులు మీరి.. శిక్షణ పొందుతున్న యువకులతో అనుచితంగా ప్రవర్తించాడు. వారిని బాడీ షేమింగ్ లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో, దాదాపు 200 మంది విద్యార్ధినిలు అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులు అతడిపై లైంగిక దాడి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ కూడా స్పందిస్తూ.. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని యవతులకు హామీ ఇచ్చారు. వివరాల ప్రకారం.. చెన్నైలోని సాంప్రదాయ కళలను బోధించే ప్రతిష్టాత్మక కళాక్షేత్ర ఫౌండేషన్‌లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ హరి పద్మన్‌పై లైంగిక దాడి కేసు నమోదైంది. అయితే, పద్మన్.. ఓ మాజీ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు బుక్ చేశారు. ఆ ప్రొఫెసర్, మరో ముగ్గురు రిపర్టరీ ఆర్టిస్టులు తమను లైంగికంగా వేధిస్తున్నారని, బాడీ షేమింగ్, దుర్భాషలాడుతున్నారని ఆమెతో పాటు మరో 200 మంది విద్యార్థినిలు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినిలు, వారి పేరెంట్స్ కూడా నిరసనలు దిగారు. అయితే, గతంలో కూడా హరి పద్మన్‌పై లైంగిక వేధింపుల కారణంగా చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థినిలు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కాగా, ఇందులో నిజం లేదని తప్పుడు ప్రచారం అంటూ కమిషన్ వారి ఫిర్యాదును కొట్టివేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా దాదాపు 90 మంది విద్యార్థినులు రాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్‌కి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం, విద్యార్థినిలు.. డైరెక్టర్ రేవతి రామచంద్రన్‌ను తొలగించాలని, అంతర్గత ఫిర్యాదుల కమిటీని పునర్నిర్మించాలని కోరుతూ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్లకు లేఖ రాశారు. దీంతో, స్పందించిన సీఎం స్టాలిన్ నిందితులపై కఠినంగా లీగల్ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కళాక్షేత్ర ఫౌండేషన్‌ను 1936లో నర్తకి రుక్మిణీ దేవి అరుండేల్ స్థాపించారు. ఇది భరతనాట్యం, కర్ణాటక సంగీతం, ఇతర సాంప్రదాయ కళలలో కోర్సులను అందించే జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ. ఇది శ్రేష్ఠత, క్రమశిక్షణ వంటి ఉన్నత ప్రమాణాలకు ప్రసిద్ధి చెందింది. దశాబ్దాలుగా అనేక మంది ప్రముఖ కళాకారులు ఇక్కడి నుంచి శిక్షణ పొందారు. Hundreds of students and staff are protesting at Chennai's iconic Kalakshetra foundation. They are demanding action on sexual harassment allegations against 4 faculty members. Watch the video here#kalakshetra #kalakshetraprotest #kalakshetraharassment pic.twitter.com/h255MoH5OT — Mirror Now (@MirrorNow) March 31, 2023 -
నార్సింగి కేసులో వీడిన మిస్టరీ.. ఇద్దరు అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: నార్సింగిలో వివాహిత కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో పోలీసులు ఇద్దరికి అరెస్ట్ చేశారు. బాచుపల్లికి చెందిన శుభంశర్మ, సుమిత్ శర్మను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. కాగా, గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేయడం విశేషం. అయితే, ఓ మహిళను కిడ్నాప్ చేసి కారు డ్రైవర్లు.. ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. ఈ క్రమంలో స్పృహ కోల్పోయిన అనంతరం.. నిందితులు కారులోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత ఆమెను గండిపేట వద్ద విచిడిపెట్టి కారులో పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. వారిపై 365, 376 (2)(g) 392, 342 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. -
అనకాపల్లి: మహిళపై వీఆర్వో వేధింపులు.. వాట్సాప్‌లో మెసేజ్‌లు చేస్తూ..
పాయకరావుపేట: ఇంటి స్థలం మంజూరు చేయాలంటే నన్ను ప్రేమించు... పక్కా గృహం నిర్మించుకోవాలంటే పక్కలోకి రా... అంటూ ఒక వీఆర్వో దళిత మహిళతో బేరసారాలు సాగించాడు. అతని వేధింపులు తట్టుకోలేని బాధిత మహిళ బంధువుల సమక్షంలో వీఆర్వోకు దేహశుద్ధి చేసింది. ఈ షాకింగ్ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. బాధిత మహిళ తెలిపిన వివరాలు, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. పి.ఎల్.పురం గ్రామానికి చెందిన వివాహిత ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తు వీఆర్వో భాస్కరనాయుడు పరిశీలనకు వచ్చింది. ఆయన మహిళకు ఫోన్ చేసి ప్రేమించమని, సహజీవనం చేయమని వేధించడం మొదలుపెట్టాడు. అప్పుడే పనవుతుందని బెదిరించాడు. వాట్సాప్‌లో కూడా అసభ్యకరమైన మెసేజ్‌లు చేసేవాడు. ఒకరోజు బాధితురాలికి ఫోన్ చేసి.. ‘ఒంటరిగా ఉంటున్నావు.. నాతో సహజీవనం చేస్తే అన్నీ చూసుకుంటాన’ని ఒత్తిడి చేశాడు. వీఆర్వో వేధింపులు సహించలేక ఆమె కుటుంబ సభ్యుల దృష్టికి సమస్యను తీసుకువచ్చింది. వీఆర్వో వద్దకు వెళ్లి నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో బాధిత మహిళ, ఆమె కుటుంబ సభ్యులు వీఆర్వోకు దేహశుద్ధి చేశారు. బాధితురా లు తహసీల్దార్ జయప్రకా‹Ùకు, పోలీసులకు ఫిర్యా దు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, వీఆర్వోను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
మహారాష్ట్రలో దారుణం.. సమాజం ఎటు పోతోంది!
దేశంలో రోజురోజుకు మహిళలు, యువతులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక చోట కొందరు మృగాలు రెచ్చిపోతూ దారుణాలను పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు ఓ వివాహితపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం.. పైశాచికత్వం ప్రదర్శించారు. వివరాల ప్రకారం.. ముంబైలోని కుర్లా ప్రాంతంలో బాధితురాలు నివాసం ఉంటోంది. కాగా, బుధవారం తెల్లవారుజామున అదే ప్రాంతానికి ముగ్గురు యువకులు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం, ఆమెను కత్తిలో బెదిరించారు. ఈ క్రమంలోనే ఆమెపై ముగ్గురు యువకులు.. ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. అకృత్యానికి పాల్పడుతూనే మహిళ పట్ల పైశాచికత్వం ప్రదర్శించారు. లైంగిక దాడి చేస్తున్న క్రమంలో ఆమె ప్రైవేటు భాగాలపై సిగరెట్‌తో కాల్చుతూ రక్షసానందం పొందారు. ఆమె ఛాతీ, రెండు చేతులపై పదునైన ఆయుధంతో దాడి చేశారు. నిందితులలో ఒకరు ఈ సంఘటనను వీడియో చేశారు. అనంతం, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరింపులకు గురి చేశారు. కాగా, బాధితురాలు తనకు జరిగిన అన్యాయం మరొకరి జరగొద్దనే కారణంతో ఎన్జోవోలను ఆశ్రయించింది. దీంతో, నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 376 (రేప్), 376డి (గ్యాంగ్ రేప్), 377 (అసహజ సెక్స్), 324 (ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపరచడం), ఇతర నేరాల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్టు స్పష్టం చేశారు. -
రెచ్చిపోయిన మృగాలు.. స్కూటీపై వెళ్తున్న మహిళను అడ్డుకుని పొల్లాల్లోకి లాక్కెళ్లి..
ఒంగోలు సబర్బన్: రాత్రివేళ స్కూటీపై ఇంటికి వెళ్తున్న ఓ మహిళను ఇద్దరు యువకులు అడ్డుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. చిమ్మచీకట్లో పొలాల్లోకి లాక్కెళ్లి లైంగికదాడి చేశారు. ఒంగోలులోని కొప్పోలు–ఆలూరు రోడ్డులో బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. కొత్తపట్నం మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన వివాహిత(30) ఒంగోలు నగరంలో కూరగాయల వ్యాపారం చేస్తుంటుంది. బుధవారం రాత్రి వ్యాపారం ముగించుకుని 10.30 గంటల సమయంలో స్కూటీపై ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో ఇద్దరు యువకులు అడ్డుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. తొలుత ద్విచక్ర వాహనంపై ఆమెను వెంబడించారు. కొప్పోలు–గుత్తికొండవారిపాలెం రోడ్డులో గుత్తికొండవారిపాలెం దాటిన తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో అడ్డుకున్నారు. చీకట్లో పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. అనంతరం ఇంటికి వెళ్లిన ఆమె.. ఆ విషయాన్ని తన తల్లికి చెప్పుకుంది. గురువారం ఒంగోలు వచ్చి ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్ అధికారులను వేడుకుంది. ఎస్పీ మలికాగర్గ్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని అఘాయిత్యానికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులు ఆలూరు రోడ్డులోని రొయ్యల చెరువుల వద్ద పనిచేసే వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్ నుంచి ఒంగోలు దిశ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. దర్యాప్తును ముమ్మరం చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
నవ వధువుకు చేదు అనుభవం.. కన్యత్వ పరీక్షలో ఫెయిల్ కావడంతో..
కొత్తగా పెళ్లై.. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు చేదు అనుభవం ఎదురైంది. కన్యత్వ పరీక్షలో వధువు విఫలం కావడంతో భర్త, అత్తామామలు దారుణానికి ఒడిగట్టారు. తన కన్యత్వాన్ని బజారుకీడ్చారు. పంచాయితీ నిర్వహించి ఆమెకు రూ.10 లక్షల జరిమానా విధించారు. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. భిల్వారా జిల్లాలో మే 11వ తేదీన బాధితురాలు(24)కు బాగోర్‌కు చెందిన ఒక వ్యక్తితో వివాహం జరిగింది. కాగా, వారి సంప్రదాయం ప్రకారం.. ‘కుక్డి’ విధానంలో నిర్వహించిన కన్యత్వ పరీక్షలో వధువు విఫలమైంది. దీంతో ఒక్కసారిగా అత్తింటివారు షాకయ్యారు. అనంతరం.. దీనిపై వధువును నిలదీయడంతో వరుడి గుండెలు బద్దలయ్యే విషయం చెప్పింది. పెళ్లికి ముందు.. తన ఇంటి వద్ద ఉండే ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు చెప్పుకొచ్చింది. దీంతో ఆగ్రహానికి లోనైన తన భర్త, అత్తామామలు.. ఆమెను చితకబాదారు. అనంతరం.. ఊరి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. దీంతో, పంచాయతీ పెద్దలు.. వధువు, ఆమె కుటుంబానికి రూ.10 లక్షల జరిమానా విధించారు. ఆ డబ్బులు చెల్లించనందుకు వధువుతోపాటు ఆమె కుటుంబాన్ని అత్తింటి వారు వేధించారు. నూతన వధువును ఆమె పుట్టింటికి పంపారు. దీంతో, వధువు కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వధువు భర్త, మామపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: కొడుకు ఎదుటే రన్నింగ్ రైలులో మహిళపై అత్యాచారయత్నం -
పోకిరీ మైనర్!
సాక్షి, సిటీబ్యూరో: ఈవ్ టీజర్ల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మహిళలు, అమ్మాయిలను నడి రోడ్డు మీదే అసభ్య పదజాలంతో దూషించడం, ఫోన్, సోషల్ మీడియాలలో వేధిస్తున్నారు. 319 మంది ఈవ్ టీజర్లకు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సైబరాబాద్ షీ టీమ్స్ కౌన్సెలింగ్ ఇచ్చాయి. వీరిలో 98 మంది మైనర్లే ఉన్నారు. 19–24 ఏళ్ల వయస్కులు 112 మంది ఉండగా.. 25–35 ఏళ్ల వాళ్లు 92 మంది, 36–50 ఏళ్ల వయస్సు వారు 17 మంది ఉన్నారు. గత రెండు నెలలో సైబరాబాద్ షీ టీమ్‌కు వివిధ మాధ్యమాల ద్వారా 355 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికంగా 299 ఫిర్యాదుల వాట్సాప్ ద్వారా చేయగా.. ట్విటర్లో 8 మంది, హ్యాక్ ఐలో 7 మంది, ఈ–మెయిల్ ద్వారా 5 మంది, ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా 36 మంది, భౌతికంగా 30 మంది ఫిర్యాదు చేశారు. ఫోన్లో మహిళలను వేధించే ఆకతాయిలే ఎక్కువ. గత రెండు నెలలలో 141 పిటీషన్లు ఈ తరహావే కావటం గమనార్హం. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్నారని 34 మంది, సోషల్ మీడియాలో 33, బెదిరింపులు 33, స్టాల్కింగ్ 35 మంది, పెళ్లి చేసుకుంటానని మోసం పోయిన మహిళలు 19 మంది, అసభ్యప్రవర్తన 31, వాట్సాప్‌లో వేధింపులు 11, కామెంట్లు 7 మంది, రహస్యంగా మహిళల ఫొటోలు, వీడియోల చిత్రీకరణ 3, పని ప్రదేశాలలో వేధింపులు 3, ప్రేమ సమస్యలు 2, ఫ్లాషింగ్ 2 మంది మహిళా బాధితులున్నారు. 7 బాల్య వివాహాలకు చెక్.. గత రెండు నెలల వ్యవధిలో సైబరాబాద్ కమిషనరేట్‌లో 7 బాల్య వివాహాలను షీ టీమ్‌లు అడ్డుకున్నాయి. 81 కేసులను నమోదు చేశాయి. వీటిలో 18 క్రిమినల్ కేసులు కాగా.. 63 పెట్టీ కేసులున్నాయి. బస్టాప్స్, రైల్వే స్టేషన్లు, మాల్స్, కాలేజీలు వంటి బహిరంగ ప్రదేశాలలో 1,003 డెకాయ్ ఆపరేషన్లను నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో 248 మంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగా.. వీటిలో 117 పెట్టీ కేసులను నమోదు చేశారు. మిగిలిన ఆకతాయిలను కౌన్సెలింగ్‌కు పంపించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాత్రి సమయాల్లో నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో 75 మంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్, సైబరాబాద్ షీ టీమ్ సంయుక్తంగా కలిసి కౌన్సెలింగ్ ఇచ్చాయి. -
దొంగ బాబా: భూత వైద్యం పేరుతో మహిళను లొంగదీసుకొని.. ఆ తర్వాత..
దేశంలో ఏదో ఒక చోట మహిళలు వేధింపులకు, అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా దెయ్యాలు, భూతాల పేరుతో ఓ దొంగ బాబా.. 19ఏళ్లుగా మహిళపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బాధితురాలు కరన్పుర్లో నివాసం ఉండేది. కాగా, ఆమె 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అనారోగ్యానికి గురికావడంతో అదే ప్రాంతంలో ఉండే పరమానంద పురి అలియాస్ ప్రవీణ్ గుజ్రాల్ అనే బాబా వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమెను ఆత్మల పేరుతో భయపెట్టి ఆరోగ్యం బాగుచేస్తానని నమ్మించాడు. అనంతరం కూల్‌డ్రింక్‌లో మత్తు మందులు కలిపి ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే, 2006లో సదరు దొంగ బాబా ఆ ప్రాంతం వదిలి డెహ్రాడూన్‌కు వెళ్లిపోయాడు. అనంతరం 2012లో ఆమెకు ఓ మానసిక రోగితో వివాహం జరిపించాడు. కానీ, ఆమెతో మాత్రం సంబంధం కొనసాగించాడు. తాజాగా ఆమె కుతూళ్లపై దొంగ బాబా కన్నేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. దీవెనెల పేరుతో ప్రవీణ్ గుజ్రాల్ తనను అనుచితంగా తాకేవాడని తెలిపింది. బాబా ఇచ్చే ఔషధాల వల్ల తనకు చాలా సార్లు అబార్షన్ అయిందని వాపోయింది. 2021 మే నెలలో తన కూతుళ్లతో బాబా కన్నేసి లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. తన వద్ద నుంచి బాబా రూ.40 లక్షలు తీసుకున్నాడని చెప్పుకొచ్చింది. ఆమె ఆరోపణలపై గుజ్రాల్ స్పందిస్తూ.. మహిళ తనను బ్లాక్మెయిల్ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాధితురాలి ఆరోపణలను కొట్టిపారేశాడు. ఇదిలా ఉండగా గతంలోనూ బాబాపై మహిళ ఇలాగే ఆరోపణలు చేసినట్లు సమాచారం. కాగా, ఆమె ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిపారు ఇది కూడా చదవండి: కట్నం కోసం బంధువులతో అత్యాచారం.. వీడియో యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి.. -
అతడికి 60.. ఒంటరిగా ఉన్న అమ్మాయిపై కన్నేసి..
అనంతపురం క్రైం: బాలికతో వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన శుక్రవారం నగరంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నగర్లో బాబూరావు (60) ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. కూతురు హైదరాబాదులో నివాసం ఉంటోంది. బాబూరావు మద్యానికి బానిసయ్యాడు. ఇరుగుపొరుగు వారు ఇచ్చే భోజనం తిని, యాచిస్తూ వచ్చిన డబ్బుతో మద్యం తాగేవాడు. శుక్రవారం నివాస ప్రాంతంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. బాలిక ఒంటరిగా కనిపించడంతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అదే సమయంలో బాలిక తల్లి అక్కడికి వచ్చి.. గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పరుగున చేరుకున్నారు. డయల్ 100కు సమాచారం అందించారు. త్రీటౌన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించారు. కేసును ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దిశ పోలీస్ స్టేషన్‌కు బదలాయించారు. దిశ డీఎస్పీ శ్రీనివాసులు జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. బాలిక స్టేట్మెంట్ను రికార్డు చేశారు. వృద్ధుడు బాబూరావుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇది కూడా చదవండి: చక్రం తిప్పిన దివ్య హాగరగి.. హోం మంత్రి సంచలన ప్రకటన -
ఆత్మవిశ్వాసమిచ్చే తీర్పు
మూడేళ్లక్రితం మన దేశంలో రగుల్కొన్న ‘మీ టూ’ ఉద్యమంలో ఇదొక కీలకమైన మలుపు. పనిచేసేచోట అడుగడుగునా రకరకాల రూపాల్లో వేధింపులు, వివక్ష, అవమానాలు ఎదుర్కొంటూ మౌనంగా కుమిలిపోయే మహిళా లోకానికి ఆత్మసై్థర్యాన్నిచ్చే ఘట్టం. ఎలాంటి సాక్ష్యాధారాలూ లేని లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి, తన పరువు దిగజారుస్తున్నారంటూ సీనియర్ జర్నలిస్టు ప్రియా రమణిపై కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ వేసిన పరువు నష్టం దావా చెల్లుబాటు కాదని ఢిల్లీ కోర్టు బుధవారం ఇచ్చిన తీర్పు ఎన్నదగినది. ఎంజే అక్బర్ పత్రికా సంపాదకుడిగా ఉన్న ప్పుడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడేవారని, అసభ్యంగా ప్రవర్తించేవారని పలువురు మహిళలు ఆరోపించారు. అయితే అవన్నీ అబద్ధాలనీ, ఈ అసత్యారోపణలు చేసినవారిపై చట్టపరంగా చర్య తీసుకుంటానని అప్పట్లో అక్బర్ హెచ్చరించారు. చివరకు ప్రియా రమణిపై ఢిల్లీ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ‘మీ టూ’ ఉద్యమం తర్వాత మన దేశంలో తొలిసారి బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా సినీ రంగంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి గళమెత్తారు. ఆ తర్వాత ఫేస్బుక్ వేదికగా కొందరు మహిళలు తమకెదురైన చేదు అనుభవాలను తెలియజేశారు. అందుకు కారకులెవరో వారి పేర్లతో సహా వెల్లడించారు. అయితే తమ వివ రాలేమిటో, ఆ వేధింపుల స్వభావం ఎటువంటిదో చెప్పకుండా, గోప్యంగా వుండి ఆరోపించే ధోరణి సరికాదని చాలామంది అభిప్రాయపడ్డారు. అది దాదాపు చల్లబడిపోతున్నదని అందరూ అనుకునే సమయంలో ప్రియా రమణి నేరుగా అక్బర్ పేరు వెల్లడించి, ఆయన వల్ల ఎదుర్కొన్న ఇబ్బందుల్ని తెలియజేశారు. విచారణ సందర్భంగా అప్పట్లో తన వయసుకూ, ఆయన వయ సుకూ... ఆ సంస్థలో ఆయనకుండే పలుకుబడికీ... తన నిస్సహాయతకూ మధ్య వున్న వ్యత్యాసాన్ని వివరించారు. ఇవి బయటపెట్టడంలో తనకెలాంటి స్వప్రయోజనాలూ, దురుద్దేశాలూ లేవని చెప్పారు. ఈమధ్య ‘బ్రాస్ నోట్‌బుక్’ పేరుతో తన ఆత్మకథను వెలువరించిన ప్రముఖ ఆర్థికవేత్త దేవకీ జైన్ 1958లో పాతికేళ్ల వయసులో ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తనకెదురైన చేదు అనుభవాలనూ, అవి అనంతర కాలంలో తనపై చూపిన ప్రభావాన్ని వివరించారు. ఆ ప్రొఫెసర్ అసభ్య ప్రవర్తనను ప్రతిఘటించినందుకు ఉద్యోగం కోల్పోవటంతోపాటు తన ఆత్మ విశ్వాసం ఎలా దెబ్బతిన్నదో తెలిపారు. లైంగిక వేధింపులు ఎదుర్కొనే ప్రతి మహిళా ఇలాంటి దుస్థితిలోనే పడతారు. ఢిల్లీ కోర్టు మేజిస్ట్రేట్ అన్నట్టు ఇలాంటి వేధింపులన్నీ మహిళ ఒంటరిగా వున్నప్పుడే జరుగుతాయి. వేధింపులకు పాల్పడే మాయగాళ్లు నలుగురిలో వున్నప్పుడు మర్యాదస్తుల్లా ప్రవ ర్తిస్తారు. మంచివారిలా మెలుగుతారు. అందువల్లే బాధిత మహిళ సహోద్యోగులకు చెప్పడానికి సంశయిస్తుంది. చెప్పినా తననే దోషిగా పరిగణిస్తారన్న భయం ఆమెను ఆవహిస్తుంది. చేస్తున్న ఉద్యోగం పోతుందేమోనని సందేహిస్తుంది. దీర్ఘకాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దుర్మార్గాన్ని ‘మీ టూ’ ఉద్యమం బద్దలుకొట్టింది. దీనికి ముందు మన దేశంలో ఎవరూ ప్రశ్నిం చలేదని కాదు. రాజస్తాన్ దళిత మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి కొన్ని స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ వర్మ నేతృత్వంలోని ధర్మాసనం 1997లోనే కీలకమైన తీర్పు వెలువరించింది. పనిచేసేచోట మహిళలకు వేధింపులు ఎదురుకాకుండా వుండటానికి తీసు కోవాల్సిన చర్యలేమిటో వివరిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎలాంటి చేష్టలు లైంగిక వేధింపులకిందికొస్తాయో ఆ మార్గదర్శకాలు వివరించాయి. ఆ తర్వాత పనిచేసేచోట లైంగిక వేధింపుల్ని నిరోధించేందుకు 2013లో ఒక చట్టం వచ్చింది. అయితే విషాదమేమంటే చట్టపరంగా ఎన్ని రక్షణలు కల్పించినా వేధింపులూ, వివక్ష సమసి పోలేదు. అటువంటి మహిళలకు ధైర్యాన్నిచ్చే విధంగా సంస్థలు తగిన చర్యలు తీసుకోకపోవటం, ప్రభుత్వాలు సైతం పట్టనట్టు వ్యవహరించటం అందుకు కారణం. రెండున్నర దశాబ్దాలక్రితం జరిగిందంటూ తనపై ప్రియా రమణి చేసిన ఆరోపణలవల్ల పాత్రికేయుడిగా, పత్రికా సంపాద కుడిగా జీవితపర్యంతం సంపాదించుకున్న పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయంటూ అక్బర్ చేసిన వాదనను మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే అంగీకరించలేదు. మీ పరువు కోసం ఒక మహిళ జీవించే హక్కును పణంగా పెట్టలేమని ఆయన వ్యాఖ్యానించారు. వేధింపులు ఎదుర్కొనటమేకాక, ముద్దాయిగా బోనులో నిలబడవలసివచ్చిన బాధితురాలి స్థితిగతుల్ని అవగాహన చేసుకుని ఎంతో పరిణతితో మేజిస్ట్రేట్ ఇచ్చిన ఈ తీర్పు ఆహ్వానించదగ్గది. గత రెండేళ్లుగా ఈ కేసు విచారణ కోసం ప్రియా రమణి 50 సార్లు బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లాల్సివచ్చింది. కేసులో ఓడిపోతే చెల్లించాల్సిన పరిహారం సంగతలావుంచి, క్రిమినల్ కేసు ఎదుర్కొనాల్సివచ్చేది. కానీ ఆమె నిబ్బరంగా పోరాడారు. ఆమె తరఫు న్యాయవాది రెబెకా జాన్ సమర్థవంతమైన వాదనలు వినిపించారు. ఢిల్లీ కోర్టు వెలువరించిన తీర్పు పనిచేసే చోట నిత్యం వేధింపులు ఎదుర్కొంటున్న లక్షలాదిమంది బాధిత మహిళలకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. దోషులను బయటికీడ్చేందుకు దోహద పడుతుంది. -
‘దిశ’ స్ఫూర్తితో 74 కేసుల్లో శిక్షలు
సాక్షి, అమరావతి: మహిళలపై నేరాలకు, అకృత్యాలకు ఒడిగట్టే వారికి కఠిన శిక్షలు వేయడమే కాకుండా.. వేగంగా శిక్షలు పడేలా రాష్ట్ర ప్రభుత్వం ‘దిశ’ చట్టాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. దీనికి కేంద్రం నుంచి ఆమోదం రావాల్సి ఉన్నప్పటికీ.. నేరాలకు పాల్పడిన వారిపై దిశ చట్టం స్ఫూర్తితో న్యాయస్థానాల్లో వేగంగా శిక్షలు ఖరారయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే దిశ చట్టం చేసిన తరువాత ఆగస్టు నెల వరకు మహిళలపై నేరాలకు పాల్పడిన 74 కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయి. జాప్యాన్ని నివారించి.. ► సాధారణంగా న్యాయస్థానాల్లో సంవత్సరాల తరబడి వాదనలు నడుస్తాయి. దీనివల్ల కేసులు వాయిదాలు పడుతూ వస్తాయి. ► అయితే, దిశ చట్టం కింద నేరం జరిగిన ఏడు రోజుల్లో పోలీసులు చార్జిషీటు దాఖలు చేయాలి. 21 రోజుల్లోనే నిందితులకు శిక్షలు ఖరారు కావాలి. ► ఇందుకోసం కేసుల విచారణకు మహిళా ప్రత్యేక కోర్టుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దిశ చట్టం రూపుదిద్దుకున్నాక మహిళలపై నేరాలకు సంబంధించి ఇప్పటివరకు 74 కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయి. ► వాటిలో మూడు కేసుల్లో నిందితులకు మరణ శిక్షలు పడ్డాయి. ► మరో ఐదు కేసుల్లో జీవిత ఖైదు, రెండు కేసుల్లో 20 ఏళ్ల పాటు జైలు శిక్షలు ఖరారయ్యాయి. మహిళలకు రక్షణ కవచం ‘దిశ’ – దీపికా పాటిల్, ‘దిశ’ ప్రత్యేక అధికారి మహిళల రక్షణ కవచంలా ఉండేలా సీఎం వైఎస్ జగన్ ‘దిశ’ బిల్లు తెచ్చారు. ఎక్కడైనా నేరం జరిగితే కేసు నమోదు, పోలీస్ దర్యాప్తు, న్యాయ విచారణ వేగంగా పూర్తి చేసేలా దృష్టి సారించాం. ప్రతి దిశ పోలీస్ స్టేషన్లో ప్రభుత్వం ఐదుగురు ఎస్సైలను నియమించింది. అందుకే కేసుల్లో వేగంగా తీర్పులు వచ్చి దోషులకు శిక్షలు పడుతున్నాయి. దిశ బిల్లు రాక ముందు ఉన్న కేసులను కూడా దీని పరిధిలోకి తెచ్చి వేగంగా విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. -
200 మంది అమ్మాయిల్ని చిత్రహింసలు పెట్టి..
- అడ్డంగా దొరికిపోయిన ఆర్టీసీ కండక్టర్ - భార్య స్నేహితురాళ్లనూ వదలని కీచకుడు - విజయవాడలో సంచలనం.. ఇద్దరి అరెస్ట్ విజయవాడ: యువతులు, మహిళలు కలుపుకొని దాదాపు 200 మందిని ఆడవాళ్లను చిత్రహింసలకు గురిచేసిన ఆర్టీసీ కండక్టర్ కీచకవ్యవహారం విజయవాడలో సంచలనం రేపుతున్నది. మహిళా ప్రయాణికులపై చేతులు వేయడం, వారు దిగే సమయంలో బస్సు మెట్ల వద్ద నిలబడి తడమటం లాంటి వికృతచేష్టలకుతోడు బస్సుల్లో ప్రయాణించే యువతులు చూపించే బస్సు పాస్‌లలో నెంబర్లను వారికి తెలియకుండా తీసుకోవడం, తన భార్యకు తెలియకుండా ఆమె ఫోన్లో ఉన్న మహిళల నెంబర్లుకు ఫోన్లుచేయడం, రోడ్లపై, పేపరు ప్రకటనలలో వచ్చిన ఆడపిల్లలు, మహిళల ఫోన్ నెంబర్లను సేకరించి వారికి నరకం చూపించడం ఇతని నిత్యకృత్యం. ఫిర్యాదుమేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. కండక్టర్ పమిడిపాటి శ్రీనివాసరావును, అతని స్నేహితుడు మార్లపూడి శామ్యూల్‌ను సినీ ఫక్కీలో అరెస్టుచేశారు. విజయవాడ సిటీ లా అండ్ ఆర్డర్ డీసీపీ పాలరాజు సూర్యారావుపేటలోని తన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. గుర్తుతెలియని వ్యక్తులు వేర్వేరు ఫోన్ నెంబర్లనుండి చెప్పలేని విధంగా అసభ్యకర మెసేజ్‌లతో వేధిస్తున్నారని పటమట ఎన్.టీ.ఆర్.సర్కిల్ సమీపంలో నివసిస్తున్న ఓ యువతి.. 21వ తేదీ రాత్రి గవర్నర్‌పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తమకందిన సమాచారం ప్రకారం 22వ తేదీన గవర్నర్‌పేట బస్ డిపో వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు, వారి నుంచి 5 సెల్ఫోన్లు, 3 సిమ్ కార్డులు, 9 మెమొరీ కార్డులు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ చెప్పారు. నిందితులలో ఒకరిని పమిడిపాటి శ్రీనివాసరావుగా గుర్తించినట్లు, అతను ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో యనమలకుదురులో నివసిస్తున్నట్లు వివరించారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు కూడా మహిళా ప్రయాణికులపై చేతులు వేయడం, వారు దిగే సమయంలో బస్సు మెట్ల వద్ద నిలబడి వారిని తడమటం చేస్తుంటాడని తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఫోన్ ద్వారా మహిళలకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి వికృతానందం పొందుతుంటాడన్నారు. బస్సుల్లో ప్రయాణించే యువతులు చూపించే బస్సు పాస్‌లలో నెంబర్లను వారికి తెలియకుండా తీసుకోవడం, తన భార్యకు తెలియకుండా ఆమె ఫోన్లో ఉన్న మహిళల నెంబర్లు తీసుకోవడం, రోడ్లపై పేపరు ప్రకటనలలో వచ్చిన ఆడపిల్లలు, మహిళల ఫోన్ నెంబర్లను సేకరించి వారికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నట్లుకూడా వెల్లడైందన్నారు. కండక్టర్ అనేక సిమ్ కార్డులు పొంది వాటి నుండి మహిళలకు అసభ్యకర మెసేజ్‌లు పంపుతుంటాడని చెప్పారు. బస్సులో తనకు పరిచయమైన సింగ్‌నగర్‌కు చెందిన మార్లపూడి శామ్యూల్‌కు ఇదే అలవాటు ఉండటంతో అతనితో కలిసి కండక్టర్ మెసేజ్‌లు పంపేవాడన్నారు. వీరిద్దరు కలిసి ఎక్కడైనా సిమ్ కార్డులు దొరికన వెంటనే వాటిని ఉపయోగించి మహిళలకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి పైశాచికానందం పొందేవారని డీసీపీ చెప్పారు. ఈ సమావేశంలో సెంట్రల్ ఏసీపీ శ్రీనివాస్, గవర్నర్‌పేట సీఐ పవన్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. -
మంత్రి ఫోన్‌కాల్.. గ్యాంగ్‌రేప్‌ను అడ్డుకుంది!
డెహ్రాడూన్: ఓ మంత్రికి చేసిన ఫోన్ కాల్ మహిళపై లైంగిక దాడిని అడ్డుకుంది. ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రకాశ్ పంత్ సత్వరమే స్పందించి ఓ మహిళను గ్యాంగ్ రేప్ నుంచి తప్పించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. సోమవారం ఆర్టీఐ కేసు విచారణ నిమిత్తం ఓ జంట( భార్యభర్తలు) ఆదివారం రాత్రి డెహ్రాడూన్ లోని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసుకి వచ్చింది. రాత్రి ఇక్కడే ఉండిపొమ్మని డైరెక్టరేట్ ఆఫీసు ఉద్యోగులు వారికి చెప్పారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆ దంపతులు డిన్నర్ చేసి నిద్ర పోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆఫీసు స్టాఫ్ కాల్ చేయగానే మరో ఇద్దరు అక్కడికి వచ్చారు. ఆపై నలుగురు కలిసి వివాహితతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆపై గ్యాంగ్ రేప్ చేసేందుకు యత్నించారు. వివాహిత ప్రతిఘటించడంతో దంపతులిద్దరిపై నిందితులు బౌతిక దాడికి పాల్పడ్డారు. మహిళ భర్త వెంటనే ఎమ్మెల్యే, మంత్రి ప్రకాశ్ పంత్‌కు కాల్ చేసి తమను రక్షించాలని కోరాడు. మంత్రి ప్రకాశ్ పంత్ ఎస్ఎస్పీ స్వీటీ అగర్వాల్‌కు కాల్ చేసి మహిళపై దురాగతాన్ని అడ్డుకుని నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. సిబ్బందితో సహా డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసుకి వెళ్లిన అగర్వాల్.. నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వారిపై 354(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందుతులలో జగ్మోహన్ సింగ్ చౌహాన్, అనిల్ రావత్, హరి సింగ్ పెత్వాల్ లు డైరెక్టరేట్ ఉద్యోగులని, జగదీశ్ సింగ్ అనే వ్యక్తి టీ స్టాల్ నడుపుతంటాడని స్టేషన్ ఆఫీసర్ వివరించారు. బాధితులకు సాయం చేసేందుకు ఫోన్లో తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మంత్రి ప్రకాశ్ పంత్ తెలిపారు.