అనకాపల్లి: మహిళపై వీఆర్వో వేధింపులు.. వాట్సాప్‌లో మెసేజ్‌లు చేస్తూ..  | VRO Harassment Of Woman In Anakapalle District | Sakshi
Sakshi News home page

అనకాపల్లి: మహిళపై వీఆర్వో వేధింపులు.. వాట్సాప్‌లో మెసేజ్‌లు చేస్తూ.. 

Published Tue, Jan 31 2023 11:04 AM | Last Updated on Tue, Jan 31 2023 11:32 AM

VRO Harassment Of Woman In Anakapalle District - Sakshi

పాయకరావుపేట: ఇంటి స్థలం మంజూరు చేయాలంటే నన్ను ప్రేమించు... పక్కా గృహం నిర్మించుకోవాలంటే పక్కలోకి రా... అంటూ  ఒక వీఆర్వో దళిత మహిళతో బేరసారాలు సాగించాడు. అతని వేధింపులు తట్టుకోలేని బాధిత మహిళ బంధువుల సమక్షంలో వీఆర్వోకు దేహశుద్ధి చేసింది. ఈ షాకింగ్‌ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

బాధిత మహిళ తెలిపిన వివరాలు, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. పి.ఎల్‌.పురం గ్రామానికి చెందిన వివాహిత ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తు వీఆర్వో భాస్కరనాయుడు పరిశీలనకు వచ్చింది. ఆయన మహిళకు ఫోన్‌ చేసి ప్రేమించమని, సహజీవనం చేయమని వేధించడం మొదలుపెట్టాడు. అప్పుడే పనవుతుందని బెదిరించాడు. వాట్సాప్‌లో కూడా అసభ్యకరమైన మెసేజ్‌లు చేసేవాడు.

ఒకరోజు బాధితురాలికి ఫోన్‌ చేసి.. ‘ఒంటరిగా ఉంటున్నావు.. నాతో సహజీవనం చేస్తే అన్నీ చూసుకుంటాన’ని ఒత్తిడి చేశాడు. వీఆర్వో వేధింపులు సహించలేక ఆమె కుటుంబ సభ్యుల దృష్టికి సమస్యను తీసుకువచ్చింది. వీఆర్వో వద్దకు వెళ్లి నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో బాధిత మహిళ, ఆమె కుటుంబ సభ్యులు వీఆర్వోకు దేహశుద్ధి చేశారు. బాధితురా లు తహసీల్దార్‌ జయప్రకా‹Ùకు, పోలీసులకు ఫిర్యా దు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, వీఆర్వోను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement