సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. TSSPDCLలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మహిళా అధికారిని సీఐడీ ఎస్పీ వేధింపులకు గురిచేశాడు. తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
వివరాల ప్రకారం.. తెలంగాణలో సీఐడీ విభాగంలో ఎస్పీ ర్యాంకులో పనిచేస్తున్న కిషన్ సింగ్‌పై కేసు నమోదైంది. దిల్‌సుఖ్ నగర్ కొత్తపేటలో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి సీఐడీ ఎస్పీపై ఫిర్యాదు చేసింది. తన ఫోన్‌కు సీఐడీ ఎస్పీ అసభ్యకరమైన మేసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపుతున్నారని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
అయితే, అంతకుముందు.. తాను స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నానని వాటిలో పాల్గొనాలని మహిళా ఉద్యోగినికి చెప్పిన కిషన్ సింగ్.. ఆమె వద్ద నుంచి ఫోన్ నంబర్ తీసుకున్నట్టు తెలిపారు. కాగా, ఆమె ఫిర్యాదుతో కిషన్ సింగ్‌పై కేసు నమోదు చేసినట్టు చైతన్యపు పోలీసులు వెల్లడించారు. విచారణ చేపట్టినట్టు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ట్యాంక్ బండ్‌పై కారు బీభత్సం.. హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లి..
Comments
Please login to add a commentAdd a comment