Raghunath
-
హెచ్‌సీఏఏ కొత్త అధ్యక్షుడు రఘునాథ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్(హెచ్‌సీఏఏ) అధ్యక్షుడిగా వి. రఘునాథ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. గురువారం హైకోర్టు ప్రాంగణంలో ఈ ఎన్నికలు జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున పూర్తి ఫలితాలు వెలువడ్డాయి. రఘునాథ్‌కు 1,257 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి టీ.శ్రీకాంత్‌రెడ్డికి 667 ఓట్లు వచ్చాయి. దీంతో 590 ఓట్ల మెజారిటీతో రఘునాథ్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా పాశం కృష్ణారెడ్డి, కార్యదర్శులుగా జి.మాల్లారెడ్డి, జె.నరేందర్, సంయుక్త కార్యదర్శి ఎస్.సుమన్, కోశాధికారిగా ఎం.నాగరాజు గెలుపొందారు. అలాగే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా రాజు, కార్యనిర్వాహక సభ్యులుగా పి.కిశోర్‌రావు(ఏకగ్రీవం), కె.కృష్ణకిశోర్, బి.కవిత, టి.కన్యాకుమారి(ఏకగ్రీవం), ఎన్.అనిరుధ్, ఈ.రవీందర్‌రెడ్డి, ఆర్పీ రాజు, పి. రాధిక విజయం సాధించారు. -
రఘునాథ్‌కు జట్టు పగ్గాలు
నాలుగు దేశాల హాకీ టోర్నీకి భారత జట్టు ప్రకటన బెంగళూరు: రెగ్యులర్ కెప్టెన్, గోల్‌కీపర్ శ్రీజేష్ గాయపడటంతో... నాలుగు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టుకు డ్రాగ్ ఫ్లికర్ వీఆర్ రఘునాథ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈనెల 23న ఆస్ట్రేలియాలో మొదలయ్యే ఈ టోర్నీ కోసం 18 మంది సభ్యులుగల భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. శ్రీజేష్‌తోపాటు కీలక ఆటగాళ్లు ఎస్వీ సునీల్, రమణ్‌దీప్ సింగ్‌లు కూడా ఈ టోర్నీకి దూరమయ్యారు. డిఫెండర్ రూపిందర్ పాల్ సింగ్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉంటాడు. శ్రీజేష్ స్థానంలో ఆకాశ్ చిక్టె రెగ్యులర్ గోల్‌కీపర్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అభినవ్ కుమార్ పాండే రెండో గోల్‌కీపర్‌గా ఉంటాడు. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాతోపాటు మలేసియా, న్యూజిలాండ్ జట్లు కూడా పాల్గొంటారుు. భారత హాకీ జట్టు: వీఆర్ రఘునాథ్ (కెప్టెన్), రూపిందర్‌పాల్ సింగ్ (వైస్ కెప్టెన్), ఆకాశ్ చిక్టె, అభినవ్ కుమార్ పాం డే, బీరేంద్ర లాక్రా, కొతాజిత్ సింగ్, సురేందర్ కుమార్, చింగ్లెన్సనా సింగ్, మన్‌ప్రీత్ సింగ్, సర్దార్ సింగ్, ఎస్కె ఉతప్ప, తల్విందర్ సింగ్, నికిన్ తిమ్మ య్య, అఫాన్ యూసుఫ్, మొహమ్మద్ అమీర్ ఖాన్, సత్బీర్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, ప్రదీప్ మోర్ -
భారత్‌కు చేజారిన విజయం
► జర్మనీతో 3-3తో మ్యాచ్ ‘డ్రా’ ► చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ లండన్: పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకుండానే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో బరిలోకి దిగిన భారత జట్టు తొలి మ్యాచ్‌లో ఆకట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్, ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ జర్మనీ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను టీమిండియా 3-3తో ‘డ్రా’ చేసుకుంది. భారత్ తరఫున రఘునాథ్ (7వ నిమిషంలో), మన్దీప్ సింగ్ (26వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (32వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. జర్మనీ జట్టుకు టామ్ గ్రామ్‌బుష్ (26వ, 36వ నిమిషాల్లో) రెండు గోల్స్, జొనాస్ గోమోల్ (57వ నిమిషంలో) ఒక గోల్ అందించాడు. ఆరంభంలోనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను రఘునాథ్ సద్వినియోగం చేసుకోవడంతో భారత్ ఖాతా తెరిచింది. 26వ నిమిషంలో జర్మనీ స్కోరు సమం చేసినా... ఆ వెంటనే భారత్ మరో గోల్ చేసి 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది. మూడో క్వార్టర్ ఆరంభంలో హర్మన్‌ప్రీత్ సింగ్ డ్రాగ్ ఫ్లిక్‌తో భారత్‌కు మూడో గోల్‌ను అందించాడు. ఈ దశలో జర్మనీ దూకుడును పెంచి భారత గోల్‌పోస్ట్‌పై దాడులు చేసి రెండో గోల్‌ను సాధించింది. ఆ తర్వాత కాసేపు జర్మనీ జోరును భారత్ అడ్డుకున్నా... చివర్లో తడబడింది. 57వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను జర్మనీ సద్వినియోగం చేసుకొని స్కోరును సమం చేసింది. చివరి 3 నిమిషాల్లో భారత్ మరో గోల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. -
పెళ్లింట్లో పట్టపగలే దొంగలు పడ్డారు!
ఆదిలాబాద్ క్రైం: ఇంటికి తాళం వేసి అందరూ ఫంక్షన్ హాల్లో జరిగే వివాహ వేడుకకు వెళ్లారు. అది గమనించిన దొంగలు ఇదే సరైన సమయం అనుకున్నారేమో.. అదనుచూసి ఇంట్లో అందినకాడికి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పట్టణంలోని రైల్వేక్వార్టర్స్‌లో ఉండే రైల్వే ఉద్యోగి రఘునాథ్ కూతురు వివాహం స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులంతా ఇంటికి తాళం వేసి పెళ్లి వేడుకకు వెళ్లారు. ఈ సమయంలో గుర్తు తెలియని దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉంచిన రూ.80వేల నగదుతోపాటు మూడు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. వివాహ వేడుక అనంతరం ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కత్తితో భార్యపై దాడి..ఆపై ఆత్మహత్య
సిర్పూర్(టి) మండలకేంద్రంలోని జైభీంనగర్ కాలనీ దారుణం చోటుచే సుకుంది. రఘనాథ్(40) అనే వ్యక్తి తన భార్యపై కత్తితో దాడికి దిగాడు. అనంతరం ఇంటి వెనకాల దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన భార్య రుక్మాబాయి(34)ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బడిపిల్లల భద్రతకు రవాణా శాఖ చర్యలు
నేటి నుంచి అమలు హైదరాబాద్: బడిపిల్లల భద్రతపై రవాణాశాఖ దృష్టి సారించింది. విద్యార్థుల కోసం బస్సులు నడిపే విద్యాసంస్థలపై పలు నిబంధనలు విధించింది. భద్రతాలోపాలకు తావు లేకుండా స్కూల్ బస్సులు, డ్రైవర్లు, పయనించే విద్యార్ధులు, బస్సులో ఉండే సహాయకుల వివరాలను రవాణాశాఖ వెబ్సైట్లో నమోదు చేయాలని విద్యాసంస్థలను ఆదేశించింది. విద్యాసంస్థ పేరు, విద్యాశాఖ అనుమతి వివరాలు, బస్సు రిజిస్ట్రేషన్ నంబర్, డ్రైవర్, సహాయకులు, బస్సుల్లో పయనించే విద్యార్థుల పేర్లు, ఫొటోలు, చిరునామాలు నమోదు చేయాలని సూచించింది. వివరాలు నమోదు చేసిన విద్యాసంస్థల బస్సులకే రవాణా అధికారులు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తారు. ఫిట్నెస్ లేని బస్సులు, అనుభవం కొరవడిన డ్రైవర్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో రవాణాశాఖ అప్రమత్తమై ఈ చర్యలు చేపట్టింది. తెలంగాణ అంతటా ఈ నిబంధనలు శనివారం నుంచి అమలవుతాయని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్ తెలిపారు. -
మహిళా డ్రైవర్లకు అద్భుతభవిష్యత్తు
అవకాశాలను సద్వినియోగం చేసుకోండి 24న ఆర్టీఏలో స్క్రీనింగ్ టెస్ట్ ఆసక్తి గల వారికి ఆహ్వానం ‘సాక్షి’తో జేటీసీ రఘునాథ్ సిటీబ్యూరో: షీక్యాబ్స్ విధి విధానాలపై ఆర్టీఏ కసరత్తు చేపట్టింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 24న (బుధవారం) స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు. అనంతరం వారికి రహదారి భద్రతా నిబంధ నలకు అనుగుణంగా మరింత శిక్షణనిస్తారు. నగరంలో షీ క్యాబ్స్ నడిపేందుకు ఆసక్తి చూపుతూ ఇప్పటి వరకు 47 మంది మహిళా డ్రైవర్లు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారు. హైదరాబాద్, రంగారెడ్డితో పాటు నల్లగొండ, మెదక్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల డ్రైవర్లు కూడా వీరిలో ఉన్నారు. రవాణా శాఖ అధికారులు దరఖాస్తులను పరిశీలించి, అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. స్క్రీనింగ్ పరీక్షలకు హాజరయ్యే మహిళా డ్రైవర్ల నైపుణ్యం, వాహనాలు నడపడంలో వారి అనుభవం, ఆసక్తి, ఎలాంటి వాహనాలను నడపగలరు వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని, అదే రోజు సాయంత్రం విధివిధానాలను రూపొందిస్తారు. బ్యాంకులు, ఇతర విభాగాల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో ఇది మొట్టమొదటి ప్రాజెక్టు కాబట్టి లోపాలకు. వైఫల్యాలకు తావు లేకుండా, సమర్థంగా నిర్వహించేందుకు రవాణా శాఖ దృష్టి సారించింది. ఇందుకోసం ఇప్పటికే కేరళలోని త్రివేండ్రంలోని షీ క్యాబ్స్ ప్రాజెక్టును అధ్యయనం చేసిన అధికారులు అక్కడి కంటే విజయవంతంగా దీనిని నిర్వహించడంపై దృష్టి కేంద్రీకరించారు. వాహనాల కొనుగోలుతో పాటు, 35 శాతం ప్రభుత్వమే సబ్సీడీని అందజేయడంతో పాటు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆసక్తి ఉన్న మహిళలకు అన్ని విధాలుగా బాసటగా నిలిచి శిక్షణతో పాటు, అవసరమైన వారికి వసతి సౌకర్యం కల్పించనున్నారు. ఆఖరు తేదీలు లేవు: రఘునాథ్, సంయుక్త రవాణా కమిషనర్ మహిళలు వాహనాలు నడపడం ఏ మాత్రం సమస్య కాబోదు. ఆసక్తి, అభిరుచి ఉంటే చాలు. రహదారులపై పరుగులు తీయవచ్చు. డ్రైవింగ్ వల్ల ఉపాధి లభిస్తుంది. మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆసక్తి ఉన్న మహిళా డ్రైవర్లు ఇంకా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు తేదీలంటూ ఏమీ లేవు. హైదరాబాద్‌లో ఈ వృత్తిని స్వీకరించబోయే మహిళలు ఒక సామాజిక బాధ్యతను కూడా తమ భుజాన వేసుకోబోతున్నారు. తోటి మహిళల భద్రతకు తాము భరోసా ఇవ్వబోతున్నారు. ఆ రకంగా వారు విజయం సాధించాలని ఆశిస్తున్నాం. మహిళా డ్రైవర్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలను అంద జేస్తుంది. -
బాబు పర్యటనతో ఒరిగిందేమీ లేదు
అనకాపల్లి : జిల్లాలో ఇటీవల రెండ్రోజుల పాటు జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కేవలం టీడీపీ రోడ్‌షో మాదిరిగా సాగిందని, దీనివల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని అనకాపల్లి నియోజక వర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్చార్జ్ కొణతాల రఘునాథ్ విమర్శించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ సీఎం పర్యటన ప్రజా సమస్యలపై సమీక్ష జరిపినట్లు లేదని, ఆ పార్టీ సొంత కార్యక్రమంలా సాగిందని ధ్వజమెత్తారు. జిల్లా అభివృద్ధికి నిధులు మంజూరు చేయకుండా తిరిగి వెళ్లిన ఘనత చంద్రబాబుదేనన్నారు. తుమ్మపాల చక్కెర కర్మాగారానికి నిధులు కుమ్మరిస్తారని హడావుడి చేశాక, ఇప్పుడు మూడు నెలల పాటు నిపుణులతో కమిటీ వేసి, ఆ నివేదిక మేరకు న్యాయం చేస్తానని చెప్పడం ఎంత వరకూ సమంజసమని రఘునాథ్ ప్రశ్నించారు. తుమ్మపాల సుగర్స్‌లో చెరకు రైతుల బకాయిలు, ఉద్యోగుల జీతాల బకాయిలపై ఒక్క మాట కూడా మాట్లాడని సీఎం పర్యటన వల్ల ఏం న్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వందేళ్లు నిండిన ఉత్తర కోస్తా మండలి వ్యవసాయ పరిశోధనా స్థానం వేడుకలకూ నిధులు మంజూరు చేయకుండా వట్టి చేతులతో వెళ్లిపోయిన సీఎం చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. గ్రామీణ ప్రాంతంలోని విద్యుత్ వినియోగదారుల మన్ననలు పొందిన కశింకోట ఆర్‌ఈసీఎస్‌ను రద్దు చేస్తానని చెప్పడం బాబు మార్కు పాలనకు నిదర్శనమని, అయినా అదేమీ నామినేటెడ్ పాలకవర్గం కాదన్న విషయం సీఎంకు తెలియకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కష్టాల్లో కూరుకుపోయిన రైతులకు భరోసా ఇవ్వకుండా, చిర్రుబుర్రులాడుతూ రాజకీయ కక్షసాధింపు రీతిలో సాగిన చంద్రబాబు పర్యటన వల్ల అధికారుల విలువైన సమయం, లక్షలాది రూపాయిలు వృథా అయ్యాయని రఘునాథ్ మండిపడ్డారు. -
వేధింపుల ఈఓ మాకొద్దు
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిపై ఉద్యోగులు తిరుగుబావుటా ఎగురవేశారు. ఏడాదికాలంగా ఉద్యోగులు, అర్చకులను ఈఓ రఘునాథ్ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపానికి ఎదురుగా ఉద్యోగులు, అర్చకులు ధర్నాకు దిగారు. ఈఓ గో బ్యాక్, సంపాదిత సెలవులు మంజూరు చేయాలి, ఈఓ నిరంకుశత్వ వైఖరి నశించాలి, వేధింపులు ఆపాలి, ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలి అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ దేవస్థాన ఉద్యోగులు, వేదపండితులు, అర్చకులు, నాల్గవ తరగతి ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. టీజేఏసీ కూడా రంగంలోకి దిగి ఉద్యోగులకు మద్దతుగా నిలిచింది. ఈ సందర్భంగా దేవస్థానం స్థానాచార్యులు కెఈ స్థలశాయి మాట్లాడుతూ ఈఓ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఆలయ సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మతపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కనీసం వేదపండితులు, అర్చకులతో చర్చించాలనే ఆలోచన చేయకపోవటంతో ఆలయ సంప్రదాయాలు కనుమరుగైపోయాయన్నారు. ఆలయ సంప్రదాయాలు తెలియని కొంతమంది మాటలు విని ఎంతో కాలంగా రాముని సేవలో తరిస్తున్న తమను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘భద్రాద్రి రాముడిని రామనారాయణుడి’గానే ఇప్పటి వరకూ కొలుస్తూ వచ్చామని, అయితే ప్రస్తుత ఈఓ రఘునాథ్, ఎవరో ఫిర్యాదు ఇచ్చారనే కారణంతో తగిన పరిశీలన లేకుండానే తమకు చార్జిమెమోలు ఇవ్వటం ఎంత వరకూ సమంజసమన్నారు. ఆయన తీవ్రంగా అవమానపరిచారన్నారు. గతేడాది జరిగిన శ్రీరామనవమి వేడుకలలో మహాపట్టాభిషేక వేదిక మార్చాలంటూ తమ ఒత్తిడి తీసుకొచ్చారని, దీనిని వ్యతిరేకించినందుకు వేదపండితులపై, ఉద్యోగులపై కక్ష కట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది సంప్రదాయ వ్యతిరేకుల మాట విని, వారి ప్రలోభాలకు గురై తమను వేధింపులకు గురిచేస్తున్నందున ఇక సహించలేక రోడ్డుకెక్కామని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మాడవీధుల విస్తరణలో ఇల్లు కోల్పోయిన రామభద్రాచార్యులు అనే పరిచారికకు కలెక్టర్ హామీతో ఉద్యోగం ఇచ్చినప్పటికీ, నేటి వరకు ఆయనకు సర్వీసు రిజిస్టర్‌ను ప్రారంభించలేదని, అతనికంటే వెనుక వచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగికి అన్ని సౌకర్యాలను కల్పిస్తూ పక్షపాత బుద్ధిని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యాలయానికి చెందిన విషయాలలో సైతం అనవసరంగా ఉద్యోగులకు మెమోలు జారీ చేస్తూ వారిని మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఆలయ ఏఈవో శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. ఈఓతో వాగ్వాదం ఉదయం నుంచి ఆలయ ఉద్యోగులు ఆందోళన చేస్తుండగా...సాయంత్రానికి ఈఓ కార్యాలయానికి చేరుకున్నారు. టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు ఈఓతో చర్చించి.. ఉద్యోగులపై పనిభారం పెంచుతూ, ప్రశ్నించిన వారికి అక్రమంగా మెమోలను జారీ చేయటం సరైంది కాదన్నారు. వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరగా దీనిపై ఈవో ససేమిరా అన్నారు. అర్చకులకు జారీ చేసిన మెమోలను వెనక్కి తీసుకునేది లేదని, వాటికి వివరణ ఇవ్వాల్సిందేనన్నారు. ఈ సమయంలో ఈఓ, వేదపండితుల మధ్య కొంతసేపు మాటల యుద్ధం కొనసాగింది. సహనం కోల్పోయిన ఈఓ రఘునాథ్ తనతో వాదనకు దిగిన వేదపండితులను నోరు మూసుకోవాలని హెచ్చరించారు. దీంతో వేదపండితులు సైతం ఘాటుగానే స్పందించారు. ఇరు పక్షాల మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి చేయిదాటుతోందని గమనించిన టీజేఏసీ నాయకులు చల్లగుళ్ల నాగేశ్వరరావు కల్పించుకున్నారు. ఈఓ పంథాను మార్చుకోకపోతే ఉద్యోగులు ఇక్కడ పనిచేసే పరిస్థితి లేదని, దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సహాయ నిరాకరణకు పిలుపు : ఈఓ తీరుతో విసుగుచెందిన ఆలయ ఉద్యోగులు, వేదపండితులు సహాయ నిరాకరణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం కల్పించుకొని ఈఓపై తగిన చర్యలు తీసుకునేంత వరకూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని, పరిపాలన పరమైన పనులపై కూడా తగిన విచారణ జరిపించాలని ఆలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కె.నరసింహారాజు అన్నారు. ఆందోళన కార్యక్రమంలో ఆలయ వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, శ్రీనివాసరెడ్డి, నిరంజన్‌కుమార్, పోతుల శ్రీను, కత్తి శ్రీను, వెంకటప్పయ్య, కనకదుర్గ, నాగమణి, రామారావు, స్వర్ణ కుమారి, భాస్కర్, ఏఈ రవీందర్, టీజేఏసి నాయకులు వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, పూసం రవికమారి, ఐటీడీఏ రాంబాబు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలో యువతకు పెద్దపీట
ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు రఘునాథ్, అమర్నాథ్ పార్టీ విద్యార్థి విభాగంతో ప్రత్యేక సమావేశం అనకాపల్లిరూరల్, న్యూస్‌లైన్: యువనాయకుని సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా సాగిపోతు న్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యువతకు పెద్దపీట ఉంటుందని పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కొణతాల రఘునాథ్, గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి వైఎంవీఏ సమావేశ మందిరంలో ‘వైఎస్సార్ సీపీ స్టూడెంట్ ఫోర్స్’ ఆధ్వర్యంలో ఆదివారం పలకారవి అధ్యక్షత సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రఘునాథ్ తొలుత మాట్లాడుతూ రాజకీయాలను మార్చగల సత్తా యువతకే ఉందని చెప్పారు. వైఎస్సార్ సీపీ అత్యధిక సీట్లు యువతకు కేటాయించడమే పార్టీలో వారి ప్రాధాన్యాన్ని చెబుతోందన్నారు. పరి శ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న ప్రతిపాదన మేనిఫెస్టో లో జగన్ చేర్చారన్నారు. కొణతాల హ యాంలో అభివృద్ధి దిశగా సాగిపోయి న అనకాపల్లి పట్టణం గంటా రాకతో తిరోగమనంలో పయణించిందని చె ప్పారు. జగన్‌పై నమ్మకంతో యువ కులంతా ‘వైఎస్సార్ స్టూడెంట్ ఫోర్స్’ గా ఏర్పడి పార్టీలోకి రావడం శుభపరిణామమన్నారు. ఎంపీ అభ్యర్థి అమర్నాథ్ మాట్లాడుతూ తాను సీటు ఆశించి పార్టీలోకి రాలేదని చెప్పారు. గుడివాడ కుటుంబానికి మేలు చేయాలన్న కొణతాల రామకృష్ణ ఆలోచనే ఈరోజు నా పోటీకి కారణమని చెప్పారు. నిబద్ధత కలిగిన నాయకుడు కొణతాల అని కొనియాడారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్నికుయుక్తులు పన్నినా జగన్‌ని నిలువరించలేరన్నారు. తొలుత స్టూడెంట్స్ ఫోర్స్ సభ్యులు 300 మంది ఎల్లపు దివాకర్, రూప్తేజ, సాయి, సంతోష్, సతీష్, ఓంకార్, గోవింద్, బొడ్డేడ శివ, య ల్లపు దేవరాయలు, సూరిశెట్టి రాము డు, గాలి శ్రీనివాసరావు, దాడి ఈశ్వరరావు, కొణతాల సందీప్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఆకట్టుకున్న అమర్నాథ్ సమావేశంలో ప్రసంగించిన అమర్నాథ్ పలు చలోక్తులతో ఆకట్టుకున్నారు. పలు చమత్కారాలతో విద్యార్థులను కడుపుబ్బానవ్వించారు. మచ్చుకు కొన్ని.... పుట్టుకతోనే చంద్రబాబు ఓ ప్రత్యేకత సాధించుకున్నారు. 4వ నెల 20వ తేదీన పుట్టి జన్మతహా తాను 420 అని నిరూపించుకున్నారని చెప్పారు. తొమ్మిదేళ్లు ఏం చేశావని చంద్రబాబును ప్రశ్నిస్తే హైటెక్ సిటీ కట్టానని గొప్పగా చెబుతారు. అదే హైటెక్ సిటీ నిర్మాణాన్ని తాపీ మేస్త్రికి అప్పగిస్తే మూడేళ్లలోనే పూర్తిచేస్తాడడన్నారు. ఇంట్రా వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) మేరకే టికెట్లు ప్రకటిస్తానని చెప్పిన చంద్రబాబు అనకాపల్లి అభ్యర్థిని నిర్ణయించడానికి కృష్ణా జిల్లా నూజివీడుకి ఫోన్ చేశారని, అందుకే ముత్తంశెట్టికి టికెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. దీంతో అనకాపల్లి ప్రజలు విస్తుపోయారన్నారు. బాబుపై నమ్మకంతో ప్రజలు ముత్తంశెట్టి శ్రీనివాస్‌ను తిరిగి కృష్ణా జిల్లాకే పంపిస్తారని చెప్పారు. మళ్లీ నియోజకవర్గాన్ని మార్చి గంటా తన తీరు చాటుకున్నారు. అనకాపల్లి వాసులు ఓటేసి గెలిపిస్తే ఐదేళ్లు వారిని గేలిచేసి ఇప్పుడు భీమిలి పారిపోయారు. -
భక్తులందరికీ ప్రశాంత దర్శనం
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్ : శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జనవరి 11న జరిగే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనంలో సామాన్య భక్తులు సైతం ప్రశాంతంగా, నయనానందకరంగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో ఎం.రఘునాథ్ తెలిపారు. సోమవారం ఆయన ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో విలేకరులతో మాట్లాడారు. ముక్కోటి ఏకాదశి రోజు న వీఐపీలు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అధ్యయనోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూల అలంకరణకు, వైదిక పనుల నిర్వహణ, ఇతర ఖర్చుల నిమిత్తం దేవస్థానం నుంచి రూ.32 లక్షలు కెటాయిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు గ్రామపంచాయతీ తరఫున మరో రూ.10 లక్షలు విడుదల చేయనున్నారని వివరించారు. తెప్పోత్సవం, ముక్కో టి ఏకాదశికి లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, ఇందుకు తగ్గట్టుగా 3 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. భక్తులు లడ్డూల కోసం ఇబ్బంది పడకుండా ఆలయ ప్రాకారం ఎదురుగా క్యూలైన్ల వద్ద 5 లడ్డూలు రూ.50కి విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తెప్పోత్సవానికి వినియోగించే లాంచీ హంసాలంకరణను జనవరి 5, 6 నాటికి సిద్ధం చేసి ట్రయల్ రన్ చేస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారన్నారు. గతేడాది జరిగిన లోటుపాట్లను సరిచేసుకొని ఈ ఏడాది ఉత్సవాల విజయవంతానికి కృషి చేస్తామని, అందుకు కావల్సిన సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. అధ్యయనోత్సవాలకు ‘సురభి’ శోభ... అధ్యయనోత్సవాలలో భాగంగా జరిగే పగల్‌పత్తు ఉత్సవాలలో సురభి కంపెనీ వారిచే ప్రఖ్యాత నాటకాల ప్రదర్శనకు ఏర్పాటు చేశామని ఈవో తెలిపారు. మిథిలా స్టేడియం వద్ద జనవరి 1, 10 తేదీలలో మాయాబజార్, 2న శ్రీవీరబ్రహ్మంగారి చరిత్ర, 3న సతీ అనసూయ, 4న భక్తప్రహ్లాద, 5, 8 తేదీలలో జైపాతాళ భైరవి, 6న బాలనాగమ్మ, 7న లవకుశ, 9న శ్రీకృష్ణలీలలు నాటకాలు ఉంటాయని వివరించారు. వీటితో పాటు స్థానిక కళాకారులచే సాంసృ్కతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. జనవరి 5 నుంచి రూ.500 టికెట్ల విక్రయం... వైకుంఠ ద్వార దర్శనానికి రూ.800 విలువ గల వీఐపీ టికెట్లు 600, రూ.500 టిక్కెట్లు 2580, రూ250.టికెట్లు 650 సిద్ధం చేసినట్లు తెలిపారు. వీటిలో వీఐపి టిక్కెట్లను ఆర్డీవో ఆధ్వర్యంలో అమ్మనున్నారని, రూ 500, 250 విలువైన టికెట్లు జనవరి 5న దేవస్థాన కార్యాలయంలో అమ్మకానికి పెట్టనున్నట్లు చెప్పారు. 7 నుంచి కల్యాణ మండపం, ఇతర ప్రదేశాలలో టికెట్ల కౌంటర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. టిక్కెట్ల ఆన్లైన్ విక్రయానికి నిక్ సంస్థ ఆధ్వర్యంలో ఎండోమెంట్ శాఖ చేపట్టిన టెక్నికల్ సేవలు వచ్చే శ్రీరామనవమి నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. సమావేశంలో ఆలయ ఏఈఓ శ్రవణ్‌కుమార్, ఏఈ రవీందర్, అర్చకులు విజయ రాఘవన్, శ్రీమన్నారాయణాచార్యులు పాల్గొన్నారు. -
18 నుంచి శబరి ఉత్సవాలు
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: శ్రీ రాముడి వద్ద అన్ని కులాలు, వర్గాలు ఒకటేననే సత్యం చాటేందుకు ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి అక్టోబర్ 18వ తేదీ నుంచి మూడురోజులు శబరి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓ ఎం.రఘునాథ్ తెలిపారు. భద్రాచలం చుట్టుపక్కల ఉన్న గిరిజనులు, ప్రజల్లో ఆర్థిక అసమానతలు తొలగించి హిందూ మతం వైపు వారిని ఆకర్షించేందుకే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రామున్ని ఆరాధ్యదైవంగా కొలచిన శబరి గిరిజన మహిళ కావడం, రామాలయం ఏజెన్సీ ప్రాంతంలో ఉండటంతో శబరి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఏజెన్సీలో ఉంటూ రాముని దర్శనం చేసుకోని వారున్నారని..అటువంటి వారు ఇతర మతాలవైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. దీన్ని అరికట్టేందుకు ప్రచార రథాల ద్వారా ఉత్సవాలపై ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. గిరిజన ఆచార వ్యవహారాలను పరిశీలిస్తున్నామని, వారి సంస్కృతీ సంప్రదాయాల ప్రకారమే ఉత్సవాలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఆలయ అర్చకులతో సమీక్ష అనంతరం తుదిరూపు ఇస్తామన్నారు. గిరిజన, హరిజనవాడల్లో రూ. 3 లక్షల సీజీఎఫ్ నిధులతో రామాలయాలను నిర్మించి ఆ ఆలయాల్లోగిరిజన అర్చకుల ద్వారా పూజలు నిర్విహ స్తామన్నారు. వారికి రూ.2,500 గౌరవవేతనం అందించే బృహత్తర కార్యక్రమం వచ్చే ఏడాదికల్లా రూపుదిద్దుకుంటుందన్నారు. 2015లో జరిగే గోదావరి ఉత్సవాలకు ప్రణాళికను రూపొందించి ఉన్నతాధికారులకు పరిశీలనకు పంపామన్నారు. తానీషా కల్యాణ మండపాన్ని పూర్తిగా తీసివేసి రూ.5 కోట్ల వ్యయంతో ‘0 బ్లాక్’తో వందగదుల సత్రాన్ని భక్తుల వసతి కోసం నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ ప్లాన్‌కు రామాలయ స్పెసిపైడ్ అథారిటీ కమిటీ కూడా ఆమోదం తెలిపిందన్నారు. బిల్డింగ్ ప్లాన్‌నూ రూపొం దిస్తున్నామన్నారు. దీన్ని తిరుమల తిరుపతిలోని రామ్బగీజా సత్రం తరహాలో నిర్మిస్తామని తెలిపారు. తానీషా కల్యాణ మండపం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో దాతల సహకారంతో 30 ఏసీ గదులతో మరో సదనం, 18 గదులతో శ్రీరామ సదనానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే గుట్టపైన రూ. 50 లక్షల వ్యయంతో ఓ కాటేజి, రూ. 60 లక్షలతో మరో కాటేజీని దాతల సహాయంతో నిర్మిస్తున్నామన్నారు. తూర్పుమెట్లకు రెండువైపులా మెట్లు, మధ్యలో విచారణ కేంద్రం నిర్మిస్తామని తెలిపారు. గోదావరి నీటిని ప్యూరిపైడ్ చేసి భక్తులకందించేందుకు వీలుగా ఆలయంలో ఐదు కూలర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పీఆర్వో కార్యాలయాన్ని బస్సుల పార్కింగ్ ప్రదేశానికి మార్చే ఆలోచన ఉందన్నారు. ఇక్కడి వరకు ఆర్టీసీ బస్సులు వచ్చేలా చూస్తామన్నారు. ఇక్కడి నుంచి గుట్టమీద ఉన్న టీటీడీ గదుల వరకు నిరంతరం ప్రైవేట్ వాహనాలను తిప్పేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుట్టపై మోడ్రన్ క్యాంటిన్కూ అనుమతిస్తామన్నారు. సారపాక వద్దే ట్రాఫిక్‌ను ఆపేలా చర్యలు గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల వాహనాలను సారపాక వద్దే ఆపేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనివల్ల బ్రిడ్జిపై ట్రాఫిక్ ఇక్కట్లు తప్పుతాయన్నారు. ఇందుకు రెవెన్యూ, పోలీసుశాఖల సలహా ప్రకారం సారపాకలో రూ.68 లక్షల వ్యయంతో 28 ఎకరాల భూమిని సేకరిస్తున్నామన్నారు. ఏడాది క్రితమే దీనికి సంబంధించిన నగదును పాల్వంచ ఆర్డీఓ కార్యాలయానికి డిపాజిట్ చేశామన్నారు. మిథిలాస్టేడియాన్ని కూడా ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. కల్యాణ మండపం ఆవశ్యకత, శిల్పకళా సౌందర్యం విశిష్టతను తెలిపేలా గైడ్‌నూ నియమిస్తున్నామన్నారు. కల్యాణమండపానికి తాత్కాలికంగా ఉన్న గేట్లను తొలగించి వాటిస్థానంలో ముఖద్వారంతో కూడిన శాశ్వతగేట్లను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నామన్నారు. 2015 గోదావరి పుష్కరాల సమయానికి ఈ పనులన్నింటినీ పూర్తిచేస్తామని ఈఓ రఘునాథ్ తెలిపారు. -
నేటి నుంచి ఐసెట్ వెబ్ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: ఐసెట్ వెబ్ ఆప్షన్లకు ఈ నెల 15 నుంచి అవకాశం కల్పించినట్లు అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. 15, 16 తేదీల్లో ఒకటో ర్యాంకు నుంచి 60 వేల ర్యాంకు వరకు... 17, 18 తేదీల్లో 60,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులు ఉదయం 9 గంటల నుంచి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు. ఇక 19న ఒకటో ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులు అప్షన్లను మార్చుకోవచ్చని వివరించారు. వీరికి 21న సాయంత్రం 6 గంటల తరువాత సీట్లను కేటాయిస్తామన్నారు. ఆ వివరాలను తమ వెబ్సైట్లో https:// apicet.nic.in అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రేపటి నుంచి ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. బయో టెక్నాలజీ, బీ ఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ (బైపీసీ స్ట్రీమ్) అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈ నెల 16 నుంచి 21 వరకు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు రఘునాథ్ తెలిపారు. వారికి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఈ నెల 17 నుంచి 22 వరకు నిర్వహిస్తామని, 24న సీట్లను కేటాయిస్తామన్నారు. ఇక స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు 16, 17 తేదీల్లో సాంకేతిక విద్యా భనవ్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని పేర్కొన్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను https://apeamcetb.nic.in వెబ్సైట్లో పొందవచ్చని వివరించారు. ఇంజనీరింగ్‌లో ఆప్షన్లు మార్చుకున్న వారు 47 వేల మంది... ఇంజినీరింగ్‌లో ఆప్షన్లు ఇచ్చుకున్న వారిలో శనివారం సాయంత్రం వరకు 47 వేల మంది తమ ఆప్షన్లను మార్పు చేసుకున్నట్లు రఘునాథ్ పేర్కొన్నారు. శుక్రవారం 26 వేల మంది, శనివారం 17 వేల మంది విద్యార్థులు ఆప్షన్లు మార్చుకున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల వరకు కూడా ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉందని వెల్లడించారు. వీరికి 17న సీట్లను కేటాయిస్తామని వివరించారు.