రఘునాథ్‌కు జట్టు పగ్గాలు
నాలుగు దేశాల హాకీ టోర్నీకి భారత జట్టు ప్రకటన
బెంగళూరు: రెగ్యులర్ కెప్టెన్, గోల్‌కీపర్ శ్రీజేష్ గాయపడటంతో... నాలుగు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టుకు డ్రాగ్ ఫ్లికర్ వీఆర్ రఘునాథ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈనెల 23న ఆస్ట్రేలియాలో మొదలయ్యే ఈ టోర్నీ కోసం 18 మంది సభ్యులుగల భారత జట్టును శుక్రవారం ప్రకటించారు.
శ్రీజేష్‌తోపాటు కీలక ఆటగాళ్లు ఎస్‌వీ సునీల్, రమణ్‌దీప్ సింగ్‌లు కూడా ఈ టోర్నీకి దూరమయ్యారు. డిఫెండర్ రూపిందర్ పాల్ సింగ్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉంటాడు. శ్రీజేష్ స్థానంలో ఆకాశ్ చిక్టె రెగ్యులర్ గోల్‌కీపర్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అభినవ్ కుమార్ పాండే రెండో గోల్‌కీపర్‌గా ఉంటాడు. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాతోపాటు మలేసియా, న్యూజిలాండ్ జట్లు కూడా పాల్గొంటారుు.
భారత హాకీ జట్టు: వీఆర్ రఘునాథ్ (కెప్టెన్), రూపిందర్‌పాల్ సింగ్ (వైస్ కెప్టెన్), ఆకాశ్ చిక్టె, అభినవ్ కుమార్ పాం డే, బీరేంద్ర లాక్రా, కొతాజిత్ సింగ్, సురేందర్ కుమార్, చింగ్లెన్‌సనా సింగ్, మన్‌ప్రీత్ సింగ్, సర్దార్ సింగ్, ఎస్‌కె ఉతప్ప, తల్విందర్ సింగ్, నికిన్ తిమ్మ య్య, అఫాన్ యూసుఫ్, మొహమ్మద్ అమీర్ ఖాన్, సత్బీర్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, ప్రదీప్ మోర్