- ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు రఘునాథ్, అమర్‌నాథ్
- పార్టీ విద్యార్థి విభాగంతో ప్రత్యేక సమావేశం
అనకాపల్లిరూరల్, న్యూస్‌లైన్: యువనాయకుని సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా సాగిపోతు న్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యువతకు పెద్దపీట ఉంటుందని పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కొణతాల రఘునాథ్, గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. అనకాపల్లి వైఎంవీఏ సమావేశ మందిరంలో ‘వైఎస్సార్ సీపీ స్టూడెంట్ ఫోర్స్’ ఆధ్వర్యంలో ఆదివారం పలకారవి అధ్యక్షత సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రఘునాథ్ తొలుత మాట్లాడుతూ రాజకీయాలను మార్చగల సత్తా యువతకే ఉందని చెప్పారు.
వైఎస్సార్ సీపీ అత్యధిక సీట్లు యువతకు కేటాయించడమే పార్టీలో వారి ప్రాధాన్యాన్ని చెబుతోందన్నారు. పరి శ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న ప్రతిపాదన మేనిఫెస్టో లో జగన్ చేర్చారన్నారు. కొణతాల హ యాంలో అభివృద్ధి దిశగా సాగిపోయి న అనకాపల్లి పట్టణం గంటా రాకతో తిరోగమనంలో పయణించిందని చె ప్పారు.
జగన్‌పై నమ్మకంతో యువ కులంతా ‘వైఎస్సార్ స్టూడెంట్ ఫోర్స్’ గా ఏర్పడి పార్టీలోకి రావడం శుభపరిణామమన్నారు. ఎంపీ అభ్యర్థి అమర్‌నాథ్ మాట్లాడుతూ తాను సీటు ఆశించి పార్టీలోకి రాలేదని చెప్పారు. గుడివాడ కుటుంబానికి మేలు చేయాలన్న కొణతాల రామకృష్ణ ఆలోచనే ఈరోజు నా పోటీకి కారణమని చెప్పారు.
నిబద్ధత కలిగిన నాయకుడు కొణతాల అని కొనియాడారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్నికుయుక్తులు పన్నినా జగన్‌ని నిలువరించలేరన్నారు. తొలుత స్టూడెంట్స్ ఫోర్స్ సభ్యులు 300 మంది ఎల్లపు దివాకర్, రూప్‌తేజ, సాయి, సంతోష్, సతీష్, ఓంకార్, గోవింద్, బొడ్డేడ శివ, య ల్లపు దేవరాయలు, సూరిశెట్టి రాము డు, గాలి శ్రీనివాసరావు, దాడి ఈశ్వరరావు, కొణతాల సందీప్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
ఆకట్టుకున్న అమర్‌నాథ్
సమావేశంలో ప్రసంగించిన అమర్‌నాథ్ పలు చలోక్తులతో ఆకట్టుకున్నారు. పలు చమత్కారాలతో విద్యార్థులను కడుపుబ్బానవ్వించారు. మచ్చుకు కొన్ని....
పుట్టుకతోనే చంద్రబాబు ఓ ప్రత్యేకత సాధించుకున్నారు. 4వ నెల 20వ తేదీన పుట్టి జన్మతహా తాను 420 అని నిరూపించుకున్నారని చెప్పారు.
తొమ్మిదేళ్లు ఏం చేశావని చంద్రబాబును ప్రశ్నిస్తే హైటెక్ సిటీ కట్టానని గొప్పగా చెబుతారు. అదే హైటెక్ సిటీ నిర్మాణాన్ని తాపీ మేస్త్రికి అప్పగిస్తే మూడేళ్లలోనే పూర్తిచేస్తాడడన్నారు.
ఇంట్రా వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్‌ఎస్) మేరకే టికెట్లు ప్రకటిస్తానని చెప్పిన చంద్రబాబు అనకాపల్లి అభ్యర్థిని నిర్ణయించడానికి కృష్ణా జిల్లా నూజివీడుకి ఫోన్ చేశారని, అందుకే ముత్తంశెట్టికి టికెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. దీంతో అనకాపల్లి ప్రజలు విస్తుపోయారన్నారు.
బాబుపై నమ్మకంతో ప్రజలు ముత్తంశెట్టి శ్రీనివాస్‌ను తిరిగి కృష్ణా జిల్లాకే పంపిస్తారని చెప్పారు.
మళ్లీ నియోజకవర్గాన్ని మార్చి గంటా తన తీరు చాటుకున్నారు. అనకాపల్లి వాసులు ఓటేసి గెలిపిస్తే ఐదేళ్లు వారిని గేలిచేసి ఇప్పుడు భీమిలి పారిపోయారు.