
రఘునాథ్, మల్లారెడ్డి, నరేందర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్(హెచ్‌సీఏఏ) అధ్యక్షుడిగా వి. రఘునాథ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. గురువారం హైకోర్టు ప్రాంగణంలో ఈ ఎన్నికలు జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున పూర్తి ఫలితాలు వెలువడ్డాయి. రఘునాథ్‌కు 1,257 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి టీ.శ్రీకాంత్‌రెడ్డికి 667 ఓట్లు వచ్చాయి. దీంతో 590 ఓట్ల మెజారిటీతో రఘునాథ్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఉపాధ్యక్షుడిగా పాశం కృష్ణారెడ్డి, కార్యదర్శులుగా జి.మాల్లారెడ్డి, జె.నరేందర్, సంయుక్త కార్యదర్శి ఎస్.సుమన్, కోశాధికారిగా ఎం.నాగరాజు గెలుపొందారు. అలాగే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా రాజు, కార్యనిర్వాహక సభ్యులుగా పి.కిశోర్‌రావు(ఏకగ్రీవం), కె.కృష్ణకిశోర్, బి.కవిత, టి.కన్యాకుమారి(ఏకగ్రీవం), ఎన్.అనిరుధ్, ఈ.రవీందర్‌రెడ్డి, ఆర్‌పీ రాజు, పి. రాధిక విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment