చీటీల పేరుతో రూ. 2 కోట్ల టోకరా! | Chit Fund Fraud 140 Families Lose Rs 2 Crore In Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో చీటీల పేరుతో రూ.2 కోట్ల టోకరా!

Published Sat, Jun 27 2020 3:59 PM | Last Updated on Sat, Jun 27 2020 4:39 PM

Chit Fund Fraud 140 Families Lose Rs 2 Crore In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: చీటీల పేరుతో నగరంలో భారీ మోసం జరిగింది. ఓ ప్రబుద్ధుడు చీటీల పేరుతో ప్రజల్ని నమ్మించి సుమారు రెండు కోట్ల రూపాయలు టోకరా వేశాడు. దీంతో 140 కుటుంబాలు లబోదిబోమంటున్నాయి. కొణతాల లక్ష్మీమాధురీ, అప్పలరాజు దంపతులు చంద్రానగర్‌లో నివాసముంటున్నారు. అప్పలరాజు రైల్వే ఉద్యోగి కావడంతో స్థానికులు, బంధువులు అతని వద్ద నమ్మకంగా చీటీ వేశారు. దీంతో రైల్వేలో సీనియర్ కమర్షియల్ ఇన్స్‌పెక్టర్‌గా పని చేస్తున్న అప్పలరాజు కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేశాడు. 

ఇటీవల భార్య లక్ష్మీమాధురీ మరణంతో చెల్లింపుల బాధ్యత తీసుకున్న అప్పలరాజు నెలలు గడుస్తున్నా పైసా కూడా చెల్లించలేదు. డబ్బుల కోసం నిలదీయగా అప్పలరాజు  రాత్రికి రాత్రే ఇల్లు మారిపోయినట్టు తెలిసింది. అతని వద్ద చీటీ వేసినవారు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement