పట్నా: బిహార్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్యకు కరోనా అని తేలడంతో.. ఓ రైల్వే ఉద్యోగి ఆమె తల నరికి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడా బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వివరాలు.. అతుల్ లాల్ అనే వ్యక్తి రైల్వేలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యతో కలిసి పత్రకార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నాచక్ ప్రాంతంలోని ఓం రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం లాల్ భార్యకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దాంతో ఆగ్రహానికి గురైన లాల్ కత్తితో భార్య తల నరికి హత్య చేశాడు.
ఆ తర్వాత లాల్ కూడా అపార్ట్‌మెంట్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. గతంలో ఢిల్లీలో ఓ వ్యక్తి అనుమానంతో భార్యను నడిరోడ్డులో కత్తితో 25 సార్లు పొడిచి దారుణంగా హత్య చేశాడు.
చదవండి: వైరల్: భర్తకు కోవిడ్.. నోటి ద్వారా శ్వాస అందించిన భార్య
Comments
Please login to add a commentAdd a comment