గుంటూరు: ఆశ్రయం ఇచ్చిన యజమాని నుంచి నగలు కొట్టేసి పారిపోయిన వ్యక్తిని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన గాదంశెట్టి కుమార్ రైల్వే ఉన్నతోద్యోగి. ఆయన వద్ద మంగళగిరికి చెందిన చిరుమామిళ్ల వెంకటరమణ అనే వ్యక్తి కేర్‌టేకర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 9వ తేదీన కార్యాలయం పని నిమిత్తం కుమార్‌తోపాటు వెంకటరమణ కూడా గుంటూరులోని డివిజినల్ రైల్వే మేనేజర్ కార్యాలయం వద్దకు కారులో వచ్చాడు.
కుమార్ ఏమరుపాటుతో ఉండగా ఆయన వద్ద ఉన్న రూ.లక్ష విలువైన 40 గ్రాముల బంగారు ఆభరణాలున్న సంచిని తీసుకుని పరారయ్యాడు. బాధితుని ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన గుంటూరు పోలీసులు.. నిందితుడు ఆదివారం స్థానిక బృందావనం వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా అదుపులోకి తీసుకున్నారు.