
మాట్లాడుతున్న ఏసీపీ బాలుజాదవ్
నెన్నెల : యువతతోనే మెరుగైన సమాజం, మార్పు సాధ్యమవుతుందని ఏసీపీ బాలుజాదవ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్, నెన్నెల పోలీసుల ఆధ్వర్యంలో మూఢనమ్మకాలు, నాటుసారా మహమ్మారి, అసాంఘిక కార్యకలాపాలపై కళా బృందంతో కళ్లకు కట్టినట్లు పాటలు, నృత్యం రూపంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ దేశం కోసం తనవంతు కృషి చేయాలన్నారు. హైటెక్ యుగంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలను నమ్ముతూ ఆరోగ్యంతో పాటు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారన్నారు. నాటుసారాతో జీవితాలు బజారున పడుతున్నాయన్నారు. మత్తు పదార్థాలకు అలవాటుపడి భార్య, పిల్లలకు చిన్న తనంలోనే దూరమవుతున్నా రన్నారు. ఏ సమస్యలున్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై చందర్, రామగుండం కమిషనరేట్ కళాబృందం సభ్యులు, పోలీసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment