socity
-
జె ఎన్ జె హెచ్ ఎస్ మహిళా సభ్యుల సమావేశం
-
ష్.. గప్చిప్
పెనుగొండ : ములపర్రు హిందూ ముస్లీం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సుమారు కోటి రూపాయల డిపాజిట్ల గల్లంతుతో రైతులు, డిపాజిట్‌దారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నా అధికారుల్లో ఉలుకూ.. పలుకూ లేదు. దీంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. డిపాజిట్ల గల్లంతుకు సంఘ అధ్యక్షుడు టీవీవీఎస్హెచ్ నాగేశ్వరరావు, కార్యదర్శి అండలూరి సత్య వెంకటే శ్వరరావులు ఇద్దరూ బాధ్యత వహించి తిరిగి సంఘానికి చెల్లించడానికి డైరెక్టర్ల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, సమావేశ సమయానికి సంఘ అధ్యక్షుడు నాగేశ్వరరావు తండ్రికి వైద్యం అంటూ తిరుపతికి వెళ్లడంతో కార్యదర్శికి ఒత్తిడి పెరిగి భయంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన పాఠకులకు విధితమే. డైరెక్టర్లందరూ ఏకతాటిపైకి వచ్చి అధ్యక్ష, కార్యదర్శులపై ఒత్తిడి తీసుకువచ్చి బాండ్ పేపర్లపై హామీలు పొందారు. అయితే, అధికారుల నుంచి మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి ప్రయత్నాలు, చర్యలు ప్రారంభం కాకపోవడం విశేషం. చర్యలు తీసుకొంటామంటూ ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన కార్యదర్శి అండలూరి సత్య వెంకటేశ్వరరావు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. రైతులు మాత్రం సహకార సంఘం చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. ఇప్పటికే మండలంలోని మునమర్రు, దేవ సహకార సంఘాల్లో కోట్లాది రూపాయల గల్లంతుతో రైతులు కుదేలై ఉన్నారు. ములపర్రు సహకార సంఘం అదేబాటలో పయనించడంతో సహకార వ్యవస్థపై రైతులకు నమ్మకం పూర్తిగా సన్నగిల్లిపోయింది. ఈ తరుణంలోనైనా అధికారులు రాజకీయ ఒత్తిళ్ల నుంచి బయటపడి రైతులకు అండగా నిలవకపోతే పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయంటూ డిపాజిట్‌దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరపాలి కాగా కేవలం డిపాజిట్లు మాత్రమే కాకుండా, సహకార సంఘ లావాదేవీలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. రుణాలు రెన్యువల్, చెల్లింపులకు సహకార సంఘ రసీదులు ఇవ్వకుండా, తెల్లకాగితాలపై సంతకాలు చేసి ఇచ్చి రైతులను మోసం చేసిన ఘటనలు ఉన్నాయని వివరించారు. రైతులందరికీ ఇదేవిధంగా రసీదులు ఇచ్చారన్నారు. ఎరువుల వ్యాపారంలోనూ ఇదే తంతు నిర్వహించారని తెలిపారు. అధ్యక్ష, కార్యదర్శులు ఇద్దరూ కుమ్మక్కై అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. అధికారులు తక్షణం స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
యువతతోనే మెరుగైన సమాజం
నెన్నెల : యువతతోనే మెరుగైన సమాజం, మార్పు సాధ్యమవుతుందని ఏసీపీ బాలుజాదవ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్, నెన్నెల పోలీసుల ఆధ్వర్యంలో మూఢనమ్మకాలు, నాటుసారా మహమ్మారి, అసాంఘిక కార్యకలాపాలపై కళా బృందంతో కళ్లకు కట్టినట్లు పాటలు, నృత్యం రూపంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ దేశం కోసం తనవంతు కృషి చేయాలన్నారు. హైటెక్ యుగంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలను నమ్ముతూ ఆరోగ్యంతో పాటు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారన్నారు. నాటుసారాతో జీవితాలు బజారున పడుతున్నాయన్నారు. మత్తు పదార్థాలకు అలవాటుపడి భార్య, పిల్లలకు చిన్న తనంలోనే దూరమవుతున్నా రన్నారు. ఏ సమస్యలున్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై చందర్, రామగుండం కమిషనరేట్ కళాబృందం సభ్యులు, పోలీసులు పాల్గొన్నారు. -
అనాథల అమ్మ
నంద్యాలటౌన్: ఆమె గిరిజన మహిళ. చదివింది ఇంటర్. ఆర్థిక, రాజకీయ బలం లేదు. కుటుంబ సభ్యులందరూ కులవృత్తి అయిన బుట్టలు అల్లుకునేవారే. సమాజ సేవ చేయాలన్న తలంపుతో ఆమె స్టార్ సొసైటీ స్థాపించారు. బడి బయట ఉన్న బాల కార్మికులను, అనాథ పిల్లలను అక్కున చేర్చుకొని ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆమె సేవలకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అవార్డులు సైతం వరించాయి. అందరిచేత మన్ననలు అందుకుంటున్న ఎరుకలి రాజేశ్వరమ్మ స్ఫూర్తిగాథ ఇదీ.. గోస్పాడు గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ, సుబ్బరాయుడుల రెండో సంతానం రాజేశ్వరమ్మ. వీరికి ఎలాంటి ఆస్తులు లేవు. గుడిసెలో జీవనం. బుట్టలు అల్లుకుని జీవించారు. తలిదండ్రుల రెక్కల కష్టంతో రాజేశ్వరమ్మ ఒకటి నుంచి పదో తరగతి వరకు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఇంటర్ నంద్యాలలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. ఆర్థిక కారణాలతో తల్లిదండ్రులు చదువు మాన్పించడంతో కొన్ని రోజులు ఇంటి వద్దనే ఉంటూ బుట్టలు అల్లేవారు. ఈ సమయంలో సమాజ సేవ చేయాలనే తలంపు వచ్చింది. తనలాంటి పేదలకు సాయం చేయా లనే ఆలోచనతో తన స్నేహితుడైన సుబ్బరాయుడుతో కలిసి స్టార్ సొసైటీని 2000 సంవత్సరంలో స్థాపించారు. ఈ స్టార్ సొసైటీ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్చేవారు. రాజేశ్వరి సేవలను గుర్తించిన బాలకార్మిక పునరావాస సంస్థ అధికారులు స్టార్ సొసైటీకి ఎన్సీఎల్పీ కింద ప్రభుత్వ నిధులతో బాల కార్మిక పాఠశాలను మంజూరు చేశారు. ప్రస్తుతం 50 మంది బాలకార్మిక విద్యార్థులతో ఈ పాఠశాల నంద్యాల పట్టణంలోని నందమూరినగర్‌లో విజయవంతంగా కొనసాగుతోంది. అలాగే అహోబిలం లో మరో పాఠశాలను 50 విద్యార్థులతో ప్రభు త్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. స్నేహితుడైన సుబ్బరాయుడును 2007లో ఈమె ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కలిసి స్టార్ సొసైటీ సేవలను విస్తరించారు. నిరాశ్రయులకు వసతి గృహం.. నంద్యాల పట్టణంలోని నందమూరినగర్‌లో 2015లో నిరాశ్రయుల వసతి గృహం ఏర్పాటు చేశారు. అనాథ పిల్లలందరినీ వసతి గృహంలో చేర్చుకొని వారికి ఉచిత భోజనం, వసతితో పాటు విద్యాబుద్ధులను నేర్పిస్తున్నారు. నంద్యాల డివిజన్లో తప్పిపోయిన పిల్లలు, అనాథ పిల్లలు కనిపిస్తే పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు రాజేశ్వరమ్మకు ఫోన్ చేస్తున్నారు. సొంత ఖర్చులతో నిర్వహిస్తున్న ఈ వసతి గృహం అనతి కాలంలోనే జిల్లాలో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఇక్కడ 30మంది ఆశ్రయం పొందుతున్నారు. పురస్కారాలివీ.. ♦ 2010లో ఉత్తమ ఎన్జీఓగా గుర్తింపు ♦ 2011లో గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ ♦ 2011లో రాజీవ్ విద్యామిషన్ ద్వారా అవార్డు అందజేత ♦ ఉత్తమ మహిళగా గుర్తించి 2017 మార్చిలో అవార్డు అందజేత ♦ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలుగా నియామకం. సేవలు ఇవీ.. స్టార్ సొసైటీ ద్వారా రాజేశ్వరమ్మ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నంద్యాల పట్టణంలో టైలరింగ్ ప్రోగ్రాం కింద 2 వేల మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించారు. అప్పటి జిల్లా కలెక్టర్ విజయమోహన్ చేతుల మీదుగా కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు డీఆర్డీఏ సహకారంతో ఉచితంగా కుట్టుమిషన్లను ఇప్పించారు. రాజీవ్ విద్యా మిషన్ ద్వారా ప్యాపిలి మండలం పీఆర్‌పల్లె గ్రామంలో వలసల నివారణ ప్రభుత్వం కేంద్రాన్ని స్థాపించగా.. పలువురు విద్యార్థులను రాజేశ్వరమ్మ ఈ కేంద్రంలో చేర్పించి జిల్లా కలెక్టర్ చేత ప్రశంసలు పొందారు. -
మొగల్తూరులో టీడీపీ నాయకులకు షాక్
నరసాపురం: నరసాపురం : మొగల్తూరులో టీడీపీ నాయకులకు, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అనుచరులకు షాక్ తగిలింది. పేరుపాలెం సొసైటీలో అవినీతి వ్యవహారం బట్టబయలైంది. మండలంలో ముఖ్య టీడీపీ నాయకులు కీలకంగా వ్యవహరిస్తోన్న సొసైటీలో రూ.50 లక్షల వరకూ అవినీతి జరిగిందని సహకార శాఖ చేపట్టిన విచారణలో తేటతెల్లమైంది. దీంతో పాలకవర్గాన్ని రద్దుచేసి సొసైటీకి ముగ్గురు సభ్యులతో కూడిన మేనేజ్మెంట్ కమిటీని నియమించారు. అయితే విచారణ ఇంకా సవ్యంగా సాగలేదని, మరికొందరు ముఖ్యులను తప్పించే ప్రయత్నం సాగుతోందని, ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన రైతులు, సొసైటీ మాజీ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే బరితెగింపు , పేరుపాలెం సొసైటీలో రూ.1 కోటి దాటిన అవినీతి పేరుతో గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన ‘సాక్షి’లో వచ్చిన కథనంతో ఈ అవినీతి వ్యవహారంపై కదలిక వచ్చింది. సంఘంలో జరిగిన అవినీతిపై నిస్పక్షపాతంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం విచారణ జరుగుతోందని 51 విచారణ అధికారి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డి.ధర్మరాజు తరువాత ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. విచారణలో భాగంగా 509 మందికి అప్పు నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. విచారణలో రూ.50 లక్షల అవినీతి జరిగిందని తేల్చారు. దీంతో పాలకవర్గాన్ని రద్దుచేసి మేనేజ్మెంట్ కమిటీని నియమించారు. మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా నరసాపురం డివిజన్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పి.రామదాసును, మొగల్తూరు డీసీసీబీ మేనేజర్, సూపరింటెండెంట్లను సభ్యులుగాను నియమించారు. టీడీపీ నేతలకు చెంపపెట్టు సొసైటీలో అవినీతి వ్యవహారం అధికారికంగా బయటపడటంతో మండల టీడీపీ నేతలకు చెంపపెట్టుగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు సత్యనారాయణ పాలకవర్గం రద్దయ్యింది. అలాగే ఈ వ్యవహారంలో మొదటి నుంచి వినిపిస్తున్న మరోపేరు సత్తినేని త్రినాథరావు. ఈయన మండలంలో టీడీపీకి కీలకనేత. సొసైటీ అవినీతి వ్యవహారం బయటకు రాకుండా అనేక విధాలుగా ప్రయత్నించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. వీరందరికీ షాక్ తగిలినట్టయ్యింది. సొసైటీలో సభ్యులందరూ పేద రైతులు, పైగా నిరక్షరాస్యులు ఎక్కువ. వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునే వ్యవహారానికి ఒడిగట్టారు పేరుపాలెం సొసైటీ ప్రతినిధులు. సదరు సొసైటీ వ్యవహారాల్లో అంతా తామే అన్నట్టుగా వ్యవహరిస్తోన్న టీడీపీ నేతలు తమను అడిగేవారే లేరన్నట్టుగా రెచ్చి పోయారు. సొసైటీ ద్వారా రూ.10 వేలు అప్పు ఇచ్చి తమ ఇస్టానుసారం రూ.25 వేలు, రూ.50 వేలు ఇచ్చినట్టుగా రాసేసుకున్నారు. అప్పుదారులకు కనీసం రుణమాఫీ సొమ్ము కూడా దక్కకుండా చాలాకాలంగా చీకటి తతంగాన్ని నడుపుకుంటూ వస్తున్నారు. చివరకు చనిపోయిన వారి పేరు మీద కూడా అప్పులు తీసుకున్నట్టుగా పత్రాలు సృష్టించారు. మీ పేరులతో వేలల్లో బకాయిలున్నాయి, అప్పులు కట్టండంటూ సొసైటీల నుంచి నోటీసులు రావడంతో రైతులు నోరెళ్లబెట్టారు. జరిగిన అన్యాయంపై పోరాటం చేసినా మొదట ప్రయోజనం లేకపోయింది. 51 విచారణ వేసినా ఈ మొత్తం అవినీతి వ్యవహారాన్ని చీకటిలోకి నెట్టేందుకు టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. ‘సాక్షి’ ద్వారా విషయం బహిర్గతం కావడం, రైతుల ఆందోళన పెద్దదవ్వడంతో సహకారశాఖ అధికారుల్లో చలనం వచ్చింది. చివరకు రూ.50 లక్షలు అవినీతి జరిగిందని తేల్చి చర్యలకు ఉపక్రమించారు. ఇంకా ఈ వ్యవహారంలో సొసైటీ కార్యదర్శి అందే రవికిషోర్ పాత్రపై పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. మరి చివరకు మునుముందు ఎవరెవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, టీడీపీ నేతల తదుపరి ప్రయత్నాలు ఎలా ఉంటాయనే దానిపై సొసైటీ వర్గాల్లో చర్చ సాగుతోంది. -
పాచి పనికి పంపొద్దు..చదువుకుంటాను
ఓ బాలికకు ఇంటి చాకిరీ నుంచి విముక్తి లభించింది. ఓ చర్చి ఫాదర్, సమతా సొసైటీ సభ్యుల చొరవతో ఆమె పాచిపని భారం నుంచి బయటపడింది. తనకు పనిచేయాలని లేదని, చదువుకోవాలని ఉందని చెప్పడంతో రావికమతం ఎస్ఐ ఆమెను జువైనల్ హోమ్‌కు తరలించారు. రావికమతం(చోడవరం): చాకిరీ నుంచి విముక్తి కల్పించండి, చదువుకుంటానని ఓ గిరిజన బాలిక వినతి మేరకు ఆమెను జువైనల్ హోమ్‌కు తరలించినట్టు రావికమతం ఎస్ఐ రామకృష్ణ బుధవారం తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జీకే వీధి మండలం అన్నవరం గ్రామానికి చెందిన కొర్రా అనిత(14) తల్లి కొన్నాళ్ల క్రితం మృతి చెందింది. తండ్రి వెంకటరావు మరో వివాహం చేసుకున్నాడు. ఆపై అనితను సరిగ్గా పట్టించుకోలేదు. దీంతో నర్సీపట్నంలో ఏఎన్ంగా పనిచేస్తున్న అనిత మేనత్త సుబ్బలక్ష్మి ఆమెను నర్సీపట్నం తీసుకువచ్చి గాంధీ అనే ఒక లారీ డ్రైవర్ ఇంట్లో పాచి పనికి నియమించింది. అయితే కొన్నాళ్లు బాగానే ఉన్న ఆ ఇంటి యజమానులు అనితను కొట్టడం, తిట్టడమే కాక మానసికంగా వేధించడంతో రెండు సార్లు అనిత ఇంటి నుంచి పరారైంది. మేనత్త మళ్లీ వెతికించి అక్కడే పనికి నియమించింది. అనిత మేనత్త సుబ్బలక్ష్మికి ఇటీవల డుంబ్రిగుడకు బదిలీ కాగా, అనితను అక్కడే వదిలి ఆమె వెళ్లిపోయింది. అయితే ఇంటి యజమాని పెట్టే బాధలు భరించలేని అనిత బుధవారం పారిపోయి రావికమతం వచ్చి ఒక చర్చి ఫాదర్‌ను ఆశ్రయించింది. ఆయన స్థానికంగా ఉన్న ఏపీ మహిళ సమత సొసైటీ సభ్యులైన పుష్ప, నాగమణిలకు అప్పగించారు. వారు వివరాలు తెలుసుకుని రావికమతం ఎస్ఐ రామకృష్ణకు అప్పగించారు. ఆయన నర్సీపట్నంలోని ఇంటి యజమాని గాంధీ దంపతులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే తాము పనులు చేయించలేదని, మా ఇంట్లో వారు అద్దెకు ఉండేవారని వివరించారు. అదంతా అబద్ధమని, తాను ఆ ఇంటికి వెళ్లబోనని, చదువుకోవాలని ఉందని ఎక్కడికైనా పంపించేయండంటూ అనిత కోరడంతో విశాఖలోని జువైనల్ హోమ్‌కు తరలించినట్టు ఎస్ఐ రామకృష్ణ వివరించారు. -
కె.అగ్రహారం సొసైటీ అధ్యక్షుడి రాజీనామా
కడప అగ్రికల్చర్/ఖాజీపేట : ఖాజీపేట మండలం కె.అగ్రహారం ప్రా«థమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడు కిషోర్‌కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈనెల 7వ తేదీన ‘అగ్రహారం సొసైటీలో అడ్డంగా దోపిడీ’ శీర్షికన సాక్షిలో వార్త ప్రచురితమైంది. సొసైటీలో కొందరు డైరెక్టర్లు కలిసి దోపిడీ కొనసాగించారు. దీనిపై పూర్తి సమాచారంతో సాక్షి బయటపెట్టింది. దీంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో పదవిలో కొనసాగడం ఇష్టంలేక అధ్యక్షుడు రాజీనామాకు సిద్ధపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కడపలోని పాత రిమ్స్‌లో ఉన్న డివిజన్ స్థాయి కో–ఆపరేటివ్ కార్యాలయానికి చేరుకుని అధ్యక్షుడు కిషోర్‌కుమార్ డీఎల్సీఓ గురుప్రకాష్కు రాజీనామాపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సొంత సమస్యల కారణంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇదే సందర్భంలో డీఎల్సీఓ మాట్లాడుతూ కిషోర్‌కుమార్ రాజీనామాను ఆమోదిస్తున్నామన్నారు. మళ్లీ ఎన్నిక నిర్వహించే వరకు ఉపాధ్యక్షుడు సొసైటీ అధ్యక్షుడుగా కొనసాగుతాడని అన్నారు. yీ ఎల్ ఆదేశాలతోనే.. అగ్రహారం సొసైటీలో జరిగిన భారీ కుంభకోణం విషయమై ఖాజీపేట మండలంలో రైతుల్లో తీవ్ర చర్చ జరిగింది. దీనిపై గత రెండు రోజులుగా మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సమక్షంలో సొసైటీ డైరెక్టర్లతో తీవ్రంగా చర్చలు జరిగాయి. రైతులకు జరిగిన అన్యాయాన్ని వారు డీఎల్‌కు వివరించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎల్ వెంటనే సొసైటీ ప్రక్షాళనకు నడుంబిగించారు. అందులోభాగంగానే రాజీనామా చేయాలని సొసైటీ అధ్యక్షుడు కిషోర్‌కుమార్‌రెడ్డిని ఆదేశించారు. ఆయన చేసేశారు. రికార్డుల సర్డుబాటు గత రెండురోజులుగా సొసైటీలోని అక్రమాలను సక్రమం చేసేందుకు సిబ్బంది నానాతంటాలు పడుతున్నారు. విచారణకు వచ్చిన అధికారుల దగ్గర అంతా సవ్యంగా ఉంది.. అని చూపించేందుకు దొంగ సంతకాలతో రికార్డులను బిల్లును సిద్ధం చేస్తున్నారు. రిజిస్టర్ ఆఫీసులో మార్టిగేజ్ పనులను చకచకా కానిస్తున్నారు. అయితే ఈ విషయం అందరికీ తెలిసినా స్పందించాల్సిన ఉన్నతాధికారులు తేలుకుట్టిన దొంగల్లా మిన్నకున్నారు తైవాన్ స్పెయర్లలో అందరికీ వాటాలు ముట్టిందని స్వయంగా సొసైటీ అధ్యక్షుడు చెప్పడంతో అధికారులు కంగుతిన్నారు. ఎక్కడ విచారణ జరిగితే తమ పేర్లు బయటపడతామోనని సొసైటీ సిబ్బందికి గడువు ఇచ్చి అన్ని సక్రమంగా చేయండి.. తర్వాత తాము వచ్చి పరిశీలిస్తాం అని సిబ్బందికి భరోసా ఇచ్చినట్లు సమాచారం విచారణ చేపట్టరా? ఇంత భారీ దోపిడీ జరిగినా ఇప్పటివరకు అధికారులు వచ్చి కనీస విచారణ చేపట్టకపోవడంపై అందరిలోనూ అనుమానాలు కలుగుతున్నాయి దాదాపు 1,020 మంది రైతులు నష్టపోయినా ఉన్నతాధికారులు స్పందించకపోవడం దారుణమని రైతుసంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు అధికారులందరూ ఇందులో ఉన్నారు కాబట్టి స్పందించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. స్పేయర్‌కు వసూలు చేసిన డబ్బులు వెనక్కి ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్చార్జిగా మల్లేశ్వర్‌రెడ్డి అధ్యక్షుడి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని తాత్కాలికంగా బాధ్యతలను సింగిల్‌విండో ఉపాధ్యక్షుడిగా ఉన్న బత్తెన మలేశ్వర్రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు అందుకు డైరెక్టర్లు కూడా ఆమోదించారు. అధికారిక సమావేశాన్ని ఏర్పాటు చేసి త్వరలోనే చార్జి ఇచ్చేఅవకాశం ఉంది -
కవిత్వం సామాజిక అంశాల దర్పణం
విజయవాడ కల్చరల్ : కవిత్వం సామాజిక అంశాల దర్పణమని మంత్రి పల్లెరఘనాథరెడ్డి అన్నారు. పుష్కరాల సందర్భంగా తెలుగు రక్షణ వేదిక , భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఐఎంఏ హాల్లో సోమవారం ఉదయం కవి సమ్మేళనం నిర్వహించింది. వర్ధమాన, ప్రముఖ కవులు కవయిత్రుల కవిత్వ పఠనం అలరించింది. మంత్రి మాట్లాడుతూ కవిత్వంలో సామాజిక అంశాలు కనిపించినప్పుడే అది సజీవంగా ఉంటుందని అన్నారు. ఏ రాష్ట్రంలో కవులకు కళాకారులకు గౌరవం ఉంటుందో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షుడు పొల్లూరి హరికృష్ణ మాట్లాడుతూ నూతన రాజధానిలో కవులను ప్రోత్సహించటానికి తెలుగు రక్షణ వేదిక అనేక కార్యక్రమాలు చేపట్టిందని,అందులో భాగంగా కవులకు పుష్కర పురస్కారం అందిస్తున్నామని విరించారు. రంగస్థల నటుడు గుమ్మడి గోపాల తెలుగు రక్షణవేదిక లక్ష్యాలను వివరించారు. డిప్యూటీ కలెక్టర్ సూర్యకళ, లయోల కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గుమ్మా సాంబశివరావు, సీనియర్ జర్నలిస్ట్, రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్ కార్యవర్గ సభ్యుడు సిహెచ్.వి.ఎన్.శర్మ, పాలపర్తి శ్యామలానందప్రసాద్, సుధారాణి, మందారపు హైమావతి, వలివేటి శివరామకృష్ణతో పాటు పలువురు కవులు, కవయిత్రులు కవిసమ్మేళనంలో పాల్గొన్నారు.మల్లెతీగ సంపాదకుడు కలిమిశ్రీ, రమ్యభారతి సంపాదకుడు చలపాక ప్రకాష్‌లు పర్యవేక్షించారు.