
హోసూరు(కర్ణాటక): తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యువతికి వేరొకరితో నిశ్చితార్థం జరగడంతో ఆమెఫొటోను అశ్లీలంగా చిత్రించి వాట్సప్‌లో ఉంచిన యువకున్ని బేరికె పోలీసులు అరెస్ట్ చేశారు. హోసూరు తాలూకా బి. ముదుగానపల్లి గ్రామానికి చెందిన నరేష్‌కుమార్(25) హోసూరులోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతి ఇంటికి వెళ్లి పిల్లను అడిగారు.
తల్లిదండ్రులు నిరాకరించి మరో యువకుడితో నిశ్చితార్థం చేశారు. ద్వేషం పెంచుకున్న నరేష్‌కుమార్ ఆ యువతి ఫొటోను అసభ్యంగా చిత్రీకరించి ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి వాట్సప్ ద్వారా పంపాడు. యువతి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నరేష్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి
భర్తను చంపి.. బాత్‌రూంలో పాతిపెట్టి
8 మంది భర్తలను మోసగించి, తొమ్మిదో పెళ్లికి రెడీ.. ట్విస్ట్ ఏంటంటే!
Comments
Please login to add a commentAdd a comment