అరవై ఏళ్ల వెనుకబాటును ఐదేళ్లలో.. | trs mp kavitha comments telangana development | Sakshi
Sakshi News home page

అరవై ఏళ్ల వెనుకబాటును ఐదేళ్లలో..

Published Fri, Nov 6 2015 7:15 PM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM

ఆంధ్ర పాలకులు 60 ఏళ్లుగా తెలంగాణని అభివృద్ధికి దూరంగా ఉంచారనీ, అయిదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

నిజామాబాద్: ఆంధ్ర పాలకులు 60 ఏళ్లుగా తెలంగాణని అభివృద్ధికి దూరంగా ఉంచారనీ, అయిదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని బినోల, నాళేశ్వర్ గ్రామాలలో శుక్రవారం నిర్వహించిన 'మన ఊరు-మన ఎంపీ' కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వాటర్‌గ్రిడ్ పథకాన్ని మూడేళ్లలో పూర్తి చేయనుందని తెలిపారు.

ఇంటింటికి కుళాయి ద్వారా మంచి నీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వాటర్ గ్రిడ్ పథకానికి రూపకల్పన చేశారని తెలిపిన కవిత.. ప్రస్తుతం నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామాలకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతున్నామని చెప్పారు.  మన ఊరు-మన ఎంపీ కార్యక్రమంతో పల్లె జనాలతో మమేకమవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement