
సరిహద్దు స్థలాన్ని పరిశీలిస్తున్న గ్రామస్తులు
మెట్‌పల్లిరూరల్: అధికారులు సూచించిన జిల్లా సరిహద్దు భూమిలో అక్రమంగా నిజామాబాద్ జిల్లా హసకోత్తూర్ గ్రామస్తులు పాతిన హద్దురాళ్లను మండలంలోని మెట్లచిట్టాపూర్ గ్రామస్తులు బుధవారం తొలగించారు. అధికారులు మండల, డివిజన్, జిల్లాస్థాయి భూసర్వే చేసి.. సరిహద్దు నిర్ణయిస్తూ ఫిబ్రవరి నెలలో రాష్ట్ర భూరికార్డులు సర్వే కార్యాలయం నుంచి తీర్మానం పత్రాన్ని ఆయా గ్రామ పంచాయతీలకు పంపించారు.కాని ఇటీవల హసకొత్తూర్ గ్రామస్తులు మెట్లచిట్టాపూర్ సరిహద్దులోకి చొచ్చుకు వచ్చి అక్రమంగా హద్దురాళ్లను పాతారు. సుమారు 75 ఎకరాల మేరకు చొచ్చుకు వచ్చారని ఆరోపిస్తూ రాళ్లను తొలగించారు.
కార్యక్రమంలో సర్పంచ్ సింగిరెడ్డి రాజేందర్‌రెడ్డి, మెట్‌పల్లి ఏఎంసీ డైరెక్టర్ బిక్యానాయక్, నాయకులు అంజిరెడ్డి, భూమ య్య, శ్రీనివాస్, భీమయ్య, రాములు, లింగం, గంగారెడ్డి, మహిపాల్ పాల్గొన్నారు. విషయం తెలిసిన మెట్‌పల్లి తహసీల్దార్ సుగుణాకర్‌రెడ్డి, ఎస్సై శంకర్‌రావు తదితరులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment