
న్యూఢిల్లీ: ఎవరికైనా తమకో లేక తమ వారికో జీవితంలో మొదటి సారి జరిగే వాటిని చాలా ప్రత్యేకంగా భావిస్తారు. అందుకే మొదటి సంతానం, ఫస్ట్ శాలరీ, ఫస్ట్ క్రష్ ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. అయితే ఒకప్పుడు ఇలాంటి మధుర జ్ఞ్యాపకాలను మదిలో గుర్తుపెట్టుకుంటే, ప్రస్తుత ట్రెండ్ లో వాటినే వీడియోలో షూట చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన బాబు మొదటి రోజు స్కూల్ కి వెళ్తున్నాడు. దాన్ని గుర్తుండి పోయేలా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. ఇంకేముంది పెళ్లి కి ఊరేగింపులా ఏకంగా బ్యాండ్ ట్రూప్ నే ఏర్పాటు చేశాడు. సాధారణంగా పిల్లల కూడా స్కూల్ కి వెళ్ళాలంటే బాగా మారం చేస్తారు. ఇక్కడ మాత్రం ఆ చిన్నారి సంతోషంగా కేరింతలు కొడుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Kid will need therapy growing up…. https://t.co/PpgUfHH5Jc
— Nistula Hebbar (@nistula) November 13, 2021