
విలపిస్తున్న విద్యార్థినులు
శివాజీనగర: స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో అందరూ మునిగితేలుతుంటే, ధార్వాడలోని ప్రెజన్‌టేషన్ స్కూల్ పిల్లలు కన్నీరు కార్చారు. అయితే అవి ఆనందభాష్పాలు కాదు. కర్ణాటకలోని ఆర్.ఎన్.శెట్టి క్రీడా మైదానంలో కవాతులో బ్యాండ్ వాయించటానికి వారం రోజుల పాటు శిక్షణ పొందిన విద్యార్థినులకు అధికారులు అవకాశం ఇవ్వలేదు. పిల్లలు పదే పదే వేడుకున్నా కూడా బ్యాండ్ బాయించటానికి అధికారులు ససేమిరా అనడంతో బాలికలు క్రీడా మైదానంలో విలపిస్తూ బయటికి వెళ్లిపోయారు.
కొన్నిరోజుల క్రితమే బాలికల ప్రతిభను చూసిన జిల్లా కలెక్టర్ మంగళవారం సాయంత్రం కవాతులో మీరు పాల్గొనవచ్చని చెప్పారు. దీంతో వారందరూ ఉదయాన్నే టిఫిక్ కూడా తినకుండా ఉత్సాహంగా బ్యాండు బాజాలు తీసుకుని వస్తే, అధికారులు సైంధవుల్లా అడ్డుపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment