జనగామ బంద్ సక్సెస్
-
అధికార పార్టీతో సహా ప్రతిపక్షాల నిరసనలు
-
డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
-
నిర్మానుష్యంగా రహదారులు
జనగామ : జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని మంగళవారం తలపెట్టిన బంద్ విజయవంతమైంది. హన్మకొండ వద్దు... జనగామ జిల్లా చేయాలని కోరుతూ అన్ని వర్గాల ప్రజలు రహదారులపైకి వచ్చి గర్జించారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, బీజే పీ, సీపీఎం, సీపీఐ, టీడీపీ, బహుజన సమాజ్‌వాది, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ప్రాంగణం ఎదుట ధర్నా చేపట్టారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో డిపోకే పరిమితమయ్యాయి.
ఆర్టీసీ కార్మికులు సైతం జనగామ బంద్‌కు మద్దతు పలికారు. యువత బైక్‌ర్యాలీలతో వాడవాడలా తిరుగుతూ జనగామ జిల్లా నినాదాలతో హోరెత్తించారు. డీఎస్పీ పద్మనాభరెడ్డి పర్యవేక్షణలో సీఐలు ముసికె శ్రీనివాస్, చంద్రశేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాలోని జనగామ, వరంగల్, నర్సంపేట, మహబూబాబాద్ సబ్ డివిజన్‌లోని ఎస్సైలు, పోలీసు సిబ్బందితోపాటు పారామిలటరీ బలగాలు, మహిళా కానిస్టేబుళ్లతో బందోబస్తు చర్యలు చేపట్టారు. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై అన్ని పార్టీల నాయకులు ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టారు. బంద్‌లో వ్యాపార, వాణి జ్య సంస్థలతోపాటు ప్రైవేటు పాఠశాలు స్వచ్ఛందం గా పాల్గొన్నాయి. జేఏసీ నాయకులు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. ప్రైవేటు వాహనాలు ఎక్కడివక్కడే నిలిచి ప్రయాణీలు చాలా ఇబ్బందులు పడ్డారు.
జనగామ పట్టణ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. సంపూర్ణ బంద్‌తో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. జనగామ జిల్లా చేయకపోతే అగ్నిగుండా మారుస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో అన్ని పార్టీల నాయకులు మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, బండ యాదగిరిరెడ్డి, నెల్లుట్ల నర్సిం హారావు, నాగారపు వెంకట్, చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, మహంకాళి హరిశ్చంద్రగుప్తా, వజ్జ పర్శరాములు, బొట్ల శ్రీనివాస్, మంగళ్లపల్లి రాజు, మామిడాల రాజు, పెద్దోజు జగదీష్, ఆలేటి సిద్దిరాములు, జక్కుల వేణుమాధవ్, పసుల ఏబేలు, ఉల్లెంగుల క్రిష్ణ, తిప్పారపు ఆనంద్, రావెల రవి ఉన్నారు.