‘చౌరస్తా’నుంచి మరో సాంగ్‌.. బాహుబలినై | ChowRaasta Band Release Mr Pellam Song Viral On Social Media | Sakshi
Sakshi News home page

‘చౌరస్తా’నుంచి మరో సాంగ్‌.. ఈ సారి

Published Thu, Apr 2 2020 2:58 PM | Last Updated on Thu, Apr 2 2020 2:58 PM

ChowRaasta Band Release Mr Pellam Song Viral On Social Media - Sakshi

ఫైల్‌ ఫోటో

చౌరస్తా బ్యాండ్‌.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది ఈ పేరు. నలుగురితో నారాయణ అన్నట్టు కాకుండా తమ కంటూ ఓ ప్రత్యేక స్టైల్‌ను అలవరుచుకున్న ఈ బృందం నయాట్రెండ్‌కు తగ్గ పాటలను అందిస్తూ ప్రజలను మైమరిపిస్తున్నారు. ఇప్పటికే మహమ్మారి కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేలా ‘చేతులెత్తి మొక్కుతా చేయిచేయి కలపకురా’ అంటూ ఈ బృందం పాడిన పాట సో​షల్‌ మీడియాలో సరికొత్త ట్రెండ్‌ సృష్టించింది. తాజాగా లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రస్తుతం ఇళ్లల్లోని పరిస్థితులను వివరిస్తూ మరో పాటను విడుదల చేశారు. 

లాక్‌డౌన్‌తో ఇంట్లో కష్టాలు పడుతున్న భర్తలకు.. ఆ భర్తలను భరిస్తున్న భార్యలకు ఈ పాట అంకితం అంటూ మొదలైన సాంగ్‌ ‘బాహుబలినై బట్టలుతికితే.. అవాక్కయ్యే తెలుపు లేదని, బంటు నేనై అంట్లు తోమితే.. అద్దమంటి మెరుపే లేదని’ అంటూ వచ్చే లిరిక్స్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రామ్‌, శ్రీనివాస్‌, యశ్వంత్‌, బాలా ఈ నలుగురు కలిసి చౌరస్తా అనే జానపద బ్యాండ్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఊరెళ్లిపోతా మామా, మాయ వంటి పాటలు సంగీత ప్రియుల్ని ముఖ్యంగా యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement