సాక్షి, చెన్నై: కరోనాను త్వరగా గుర్తించేందుకు దేశీయంగా వివిధ పరికరాలు మార్కెట్లో విడుదలవుతున్నాయి. తాజాగా కరోనా లక్షణాలను త్వరగా గుర్తించేందుకు ఐఐటీ మద్రాస్, మ్యుస్ వియర్‌బేల్స్ అనే స్టార్టప్ సంస్థ సంయుక్తంగా కరోనా లక్షణాలను గుర్తించే బ్యాండ్‌ను వచ్చే నెలల్లో మార్కెట్లోకి తేనున్నట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు. అయితే ఈ బ్యాండ్‌ను చేతి మణికట్టుకు ధరించవచ్చు. ఈ బ్యాండ్ కరోనా లక్షణాలను గుర్తించే ముఖ్యమైన వ్యక్తి శరీర ఉష్ణోగ్రత, గుండె, ఆక్సిజన్, రక్త పనితీరును బ్యాండ్ ద్వారా గుర్తించవచ్చు.
ఈ బ్యాండ్‌కు రూ.3,500కు ధర నిర్ణయించారు. కాగా ఈ బ్యాండ్‌ను మొబైల్ ఫోన్, బ్లూటూత్‌లలో ధరించవచ్చు. అయితే కంటైన్‌మెంట్ జోన్లకు ప్రవేశించగానే ఈ బ్యాండ్‌ను ధరిస్తే ఆరోగ్య సేతు యాప్‌ను అలర్ట్ చేస్తుంది. ఈ సంవత్సరం 2లక్షల బ్యాండ్‌ల అమ్మకాలకు ప్రణాళిక ఉందని, రాబోయే 2022సంవత్సరానికి 10లక్షలకు పెంచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment