డప్పు నృత్య ప్రదర్శన చేస్తున్న కళాకారులు
హుజూరాబాద్: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం కళారవళి సోషియో కల్చరల్ అసోసియేషన్ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 700 మంది డప్పు కళాకారులతో గిన్నిస్ బుక్ నమోదు చేసేందుకు ‘తెలంగాణ స్థాయి డప్పు మహోత్సవం’ను ఘనంగా నిర్వహించారు. 1200 సెకన్లు నిరంతరంగా డప్పు వాయించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఈటల రాజేందర్ మెమోంటోలను అందజేసి అభినందించారు.
కళాకారులకు గుర్తింపు
మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో కళాకారుల పాత్ర మరువలేనిదని, కళాకారులకు తగిన గుర్తింపును ప్రభుత్వమిచ్చిందని, రానున్న రోజుల్లో డప్పు కళాకారులకు కూడా తగిన న్యాయం చేసేలా సీఎం ఆలోచన చేస్తున్నారని, తొందర్లోనే డçప్పు కళాకారులు శుభవార్త వింటారని అన్నారు. రాష్ట్రంలోనే హుజూరాబాద్ గడ్డ సాహసం, త్యాగాల్లో ఎప్పుడూ ముందుంటుందని, ఇక్కడి కళాకారులు ప్రతినిత్యం ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారి కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారని గుర్తు చేశారు. కళాకారులతోపాటు క్రీడలు, కోలాటాలకు కూడా హుజూరాబాద్ గడ్డ నిలయంగా నిలుస్తోందని కొనియాడారు. ఇక్కడి స్ఫూర్తితోనే జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా కోలాట నృత్య ప్రదర్శన వ్యాప్తి చెందిందన్నారు.
డప్పు కొట్టడం నామూషీగా భావించొద్దని, అది కూడా ఓ కళే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ జి.వి.రామకృష్ణారావు, మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, ఎంపీపీ వొడితెల సరోజనీదేవి, టీఆర్‌ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, వైస్ చైర్మన్ తాళ్లపల్లి రజిత శ్రీనివాస్, కళారవళి సోషియో కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణుదాస్ గోపాల్‌రావు, ప్రధాన కార్యదర్శి కన్నన్‌దురైరాజ్, గౌరవ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, కన్వీనర్ వంగల హన్మంత్‌గౌడ్, ఉపాధ్యక్షులు చాడ గంగాధర్‌రెడ్డి, క్యాస చక్రధర్, సహాయ కార్యదర్శి కలకోటి కిషన్‌రావు, పిల్లి సమ్మయ్య, కోశాధికారి చిట్టంపెల్లి ఉపేందర్, కార్యవర్గ సభ్యులు బూర్ల నాగభూషణం, ఎస్‌కే షౌకత్‌పాషా, మార్కండేయులు, రాజురి రాజు, ఇంద్రకరన్, అందాసి నారాయణ, దాసరపు కుమార్, బండ కిషన్, ముఖ్య సలహాదారులు పంజాల రాంనారాయణగౌడ్, వనమమలై జగన్మోహనచారి, దామెర గిరిజామనోహర్‌రావు, బుర్ర నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment