HTLS2022: Ram Charan And Akshay Kumar Dance To Rangamma Mangamma Song Video Goes Viral - Sakshi
Sakshi News home page

Ram Charan Dance: ‘రంగమ్మ.. మంగమ్మ’ పాటకు అక్షయ్‌తో రామ్‌ చరణ్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

Published Sun, Nov 13 2022 12:11 PM | Last Updated on Sun, Nov 13 2022 1:10 PM

Ram Charan And Akshay Kumar Dance Video Goes Viral - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ డ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి స్టెప్పులైనా ఈజీగా వేసేస్తాడు. ఆయన డ్యాన్స్‌లో ఓ స్టైల్‌ ఉంటుంది. అందుకే చరణ్‌ స్టెప్పులేస్తే..అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. చివరకు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా రామ్‌ చరణ్‌ స్టెప్పులకు ఫిదా అయ్యాడు. చరణ్‌తో కలిసి కాలు కదుపుతూ..డ్యాన్స్‌ని ఆస్వాదించాడు. ఢిల్లీలో ఓ ప్రైవేట్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వెళ్లిన రామ్‌చరణ్‌..  అక్ష‌య్‌తో  క‌లిసి స్టేజ్‌పై డ్యాన్స్‌ చేశాడు. బాలీవుడ్ సూపర్‌ హిట్‌ సాంగ్‌.. తూ చీజ్ బ‌డీ హై మ‌స్త్ మ‌స్త్.. అనే పాట‌కు ఈ ఇద్దరు స్టార్‌ హీరోలు క‌లిసి డాన్స్ చేశారు. అలాగే చరణ్‌ నటించిన ‘రంగస్థలం’లో ‘రంగమ్మ మంగమ్మ’ పాటకు కూడా ఇద్దరు కలిసి స్టెప్పులేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. RC15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల కాబోతుంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది. ఈ మూవీ తాజా షెడ్యూల్‌ సోమవారం నుంచి న్యూజిలాండ్‌లో జరగనుంది. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నార‌నే టాక్‌ వినిపిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement